Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలును తొక్కిన మీనా- మారిపోయిన రవి- శ్రుతిపై యాసిడ్‌తో దాడి- అడ్డుకున్న పూలగంప
Gunde Ninda Gudi Gantalu Serial December 11 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 11 ఎపిసోడ్‌లో బాలు అన్న మాటలు తలుచుకుని బాధపడిన రవితో శ్రుతి ఎప్పటికీ ఆ ఇంటికి రాను అని తెగేసి చెబుతుంది. ఇద్దరు దాని గురించి వాదించుకుంటారు. మరోవైపు బాలును వెనుకనుంచి తొక్కుతుంది. అది ప్రభావతి చూస్తుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో బాలు అన్న మాటలను తలుచుకుని బాధపడతాడు రవి. శ్రుతి వచ్చి అదే ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అన్నయ్య మాటలు చూస్తుంటే జీవితంలో ఇంటికి రానిచ్చేలా లేడు అని రవి అంటాడు.
నీకేనా ఫ్యామిలీ ఉంది
ఇంకా ఆ ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నావా. మీ అన్నయ్య అసలు మనిషేనా. ఎలా పడితే అలా కొడతాడా. మీనాతో అలాగే మాట్లాడుతాడు. నాతో కూడా అలాగే మాట్లాడుతాడా. ఆడవాళ్లు అంటే మర్యాద లేరా అని శ్రుతి అంటుంది. అలా అంటే ఎలా. అందరం కలిసి ఉంటేనా బాగుంటుంది. ఫ్యామిలీకి దూరంగా ఉండటం ఎలా అని రవి అంటాడు. నీకేనా ఫ్యామిలీ ఉంది. నాకు లేదా. నేను దూరంగా లేనా. పోలీస్ స్టేషన్‌లో మీ అన్నయ్యను చూశాను. ఒక రౌడీలా, ఒక గూండాలా బిహేవ్ చేస్తున్నాడు అని శ్రుతి అంటుంది.
అలాంటి వాడిని మీనా ఎలా భరిస్తుందో నాకు అర్థం కావడం లేదు అని శ్రుతి అంటుంది. అన్నయ్య చాలా మంచివాడు అని రవి అంటాడు. మంచివాడు అయితే అలా చేస్తాడా. మీ అన్నయ్యను చూశాకా ఆ ఇంటికి వచ్చే ఇంట్రెస్ట్ నాకు పోయింది. వాళ్లే కావాలని అనుకున్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావ్. విడిగా ఉంటూ కూడా హ్యాపీగా బతకొచ్చు. లేదు వాళ్లే కావాలంటే నువ్ ఒక్కడివే వెళ్లు. నా లైఫ్ నేను చూసుకుంటాను. అది నీకు ఓకేనా అని వార్నింగ్ ఇస్తుంది శ్రుతి.
మరోవైపు బాలు నొప్పులతో బాధపడుతుంటాడు. ఏమైందని మీనా అడుగుతుంది. రవిని కొట్టిన పాపం తగిలినట్లుంది అని మీనా అంటుంది. ఆ డబ్బుడమ్మ చెప్పిందా అని బాలు అంటాడు. దీనికే ఇలా అయితే మొక్కు ఎలా చెల్లిస్తారో. మీకు కారు వస్తే నన్ను ఎత్తుకుని గుడి ఎక్కుతారని మొక్కుకున్న అని మీనా అంటుంది. అలాంటి లేవు. వచ్చి ఒళ్లు నొక్కమని బాలు అంటాడు. ఒళ్లు నొప్పులు ఎలా వదిలించుకోవాలో మీనా చెబుతుంటే అన్నింటికి వద్దని చెబుతాడు బాలు.
ఎప్పుడో పోయేవాడు
దీనికి ఒక్కటే మందు ఎక్కి తొక్కడం అని మీనా అంటుంది. బాలును బోర్లా పడుకోమ్మని చెబుతుంది. దాంతో బాలు అలాగే పడుకుంటే వీపు ఎక్కి తొక్కుతుంది మీనా. ఏంటే ఇంత బరువు ఉన్నావ్. ఇన్నాళ్లు నేను కారులో ఎక్కాను. ఇప్పుడు కారే నాపై ఎక్కినట్లు ఉంది. మీ అమ్మ కూడా మీ నాన్నపై ఇలా ఎక్కి తొక్కుంటే ఎప్పుడో పోయేవాడు కదా అని బాలు అంటాడు. దాంతో ఛీ ఆపండి అని గట్టిగా తొక్కుతుంది మీనా. దానికి అమ్మా అని అరుస్తాడు బాలు.
అది విన్న ప్రభావతి బాలు గాడు నన్ను ఇంత ప్రేమగా పిలవడం ఏంటీ. ఏమైంది అని పైకి వెళ్తుంది. బాలును మీనా తొక్కడం చూసి ప్రభావతి షాక్ అవుతుంది. కోపంలో మొగుడు ఏమైనా అంటే పడేసి తొక్కుతావా. నలిగిపోతాడే అని ప్రభావతి అంటుంది. మా అమ్మ కన్నపేగు కదిలినట్లు నా పేగులు కదులుతున్నాయి అని బాలు అంటాడు. పెళ్లాంతో తొక్కించుకోవడం ఏంట్రా అని ప్రభావతి అంటుంది. ఒళ్లు నొప్పులకు వాళ్ల దగ్గర ఇలాగే తొక్కుతారట అని బాలు అంటాడు.
నేను తొక్కడం తప్పు అయితే మీ అమ్మతో తొక్కించుకోండి అని మీనా అంటుంది. అమ్మో.. మా అమ్మ తొక్కితే క్యాలెండర్‌లా సమంగా అయిపోతాను అంటాడు బాలు. నీ కర్మరా చేసుకున్నావ్ కదా. అనుభవించు. అది ఛాన్స్ దొరికిందని కాళీయ మర్దనం, శివతాండవం చేస్తుంది అని ప్రభావతి అంటుంది. నువ్ వెళ్లవే అమ్మా దీని తొక్కడం కంటే నీ నొక్కడం ఎక్కువైంది అని బాలు అంటాడు. నోరారా పిలిస్తే ప్రేమగా పిలిచాడని కన్నపేగు కదిలింది అని తిట్టుకుంటూ వస్తుంది ప్రభావతి.
నేను తొక్కుతాను
అది విన్న ఎవరినే అంటున్నావ్ అని సత్యం అంటాడు. మంచి మర్యాద తెలిసిన అమ్మాయి అని చేస్తే వాడిని కిందపడేసి తొక్కుతుంది. వాడికి వీపు నొప్పి అంటా ఇది తొక్కుతుంది. వాడు అమ్మ అని పిలిస్తే వాళ్ల గదికి వెళ్లాను. దొరికిందే ఛాన్స్ అని అది తకిట తకిట అని తాండవం చేస్తుంది అని ప్రభావతి అంటుంది. ఓ అదా. నువ్వెందుకు వెళ్లావ్ అని సత్యం అంటే.. మీరు కూడా బోర్లా పడుకోండి నేను తొక్కుతాను అని ప్రభావతి అంటుంది.
నేను మొన్నే గుండె ఆపరేషన్ చేయించుకుని వచ్చాను. నువ్ తొక్కితే గుండె గొంతులోనుంచి బయటకు వస్తుంది. వెళ్లి పడుకో అని సత్యం వెళ్లిపోతాడు. ఇంత పొగరుబోతు బాలుగాడు అది తొక్కితే తొక్కించుకోవడం ఏంటీ. పూర్తిగా దాని మాయలో పడిపోయాడు. ఈ పూలగంప ఏం మాయ చేసిందో అయ్యో అని ప్రభావతి అనుకుంటుంది. తర్వాత బాలు మీద నుంచి లేచి అతన్ని మొక్కుతుంది మీనా. మీ అమ్మగారు తిట్టిపోశారు. నాకు పొద్దున్నే ఉంటుంది సుప్రభాతం అని మీనా అంటుంది.
నేను అమ్మ అరవగానే మా అమ్మ పరుగెత్తుకువచ్చింది. నిజంగానే మా అమ్మకు నాపై ప్రేమ ఉందా అని బాలు అంటాడు. ఎందుకుండదు. నేను తొక్కడం వల్ల రెండు లాభాలు. మీ వీపు నొప్పి పోయింది. మీ అమ్మగారి ప్రేమ బయటపడింది అని మీనా చెబుతుంది. దాంతో బాలు సంతోషిస్తాడు. మరుసటి రోజు ఉదయం మనోజ్ ఎక్సర్‌సైజ్ చేస్తుంటే రవి కాల్ చేస్తాడు. నాకు మీరంత గుర్తుకు వస్తున్నారా. మీ అందరికి దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది అని బాధగా చెబుతాడు రవి.
ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా
నువ్ బాధపడకు. నీ గురించి నాన్నతో అమ్మ మాట్లాడింది. నాన్న ఆలోచిస్తున్నారు. ఒక బాలుగాడికే మీరు రావడం ఇష్టం లేదు. రోహిణి చెప్పింది. మీనా చెప్పింది. అందరు చెప్పారు. కానీ, బాలు గాడే ఒప్పుకోలేదు. నాన్న ఒప్పుకుంటారులే. అయినా నీ భార్య మీనాలా పేదింటి అమ్మాయి కాదు కదా. జాబ్ చేస్తుంది. మీ మావయ్యకు ఆస్తిపాస్తులు ఉన్నాయట కదా. మంచి అమ్మాయినే పట్టావురా అని మనోజ్ అంటాడు. రోహిణి వదినకు కూడా ఆస్తి పాస్తులు ఉన్నాయి కదా అని రవి అంటాడు.
ఉండి ఏం లాభం. ఇంకా నేను ఆయనతో మాట్లాడనేలేదు అని మనోజ్ అంటాడు. ఇద్దరు క్యాష్, చెక్ గురించి మాట్లాడుకుంటారు. ఎంతైనా నువ్ లక్కీరా అని మనోజ్ అంటాడు. ఎందుకు ఆస్తి ఉన్న అమ్మాయిని చేసుకున్నందుకా. నువ్ ఎప్పుడు డబ్బు గురించే ఆలోచిస్తావా. నువ్ కూడా జాబ్ చేస్తున్నావ్ కదా. జాబ్ లేనివాడిలా మాట్లాడతవేంటీ అని రవి అంటాడు. అవును, నేను కూడా సంపాదిస్తున్నాను. జాబ్‌కు టైమ్ అయింది అని అంటాడు మనోజ్.
సరే శ్రుతి వస్తుంది అని రవి కాల్ కట్ చేస్తాడు. ఎవరు అని అడిగితే మనోజ్ పెద్ద అన్నయ్య అని రవి చెబుతాడు. మరి ఎందుకు కాల్ కట్ చేశావ్. కొత్తగా ఇదేంటీ. ఏం మాట్లాడుకున్నారు అని శ్రుతి అడుగుతుంది. ఆఫీస్‌కు టైమ్ అయిందంటే కట్ చేశాడు. మనం ఇంటికి రావడం గురించి ఆలోచిస్తున్నారట. వెళ్లడం మంచిదే కదా అని అన్నాను అని రవి అంటాడు. అయితే నువ్వు వెళ్లు నేను రాను. అది మీ నాన్న ఇల్లు. నీది కాదు. నాకు చెప్పకుండా మాట ఎలా ఇస్తావ్ అని శ్రుతి అంటుంది.
మనిద్దరమే ఫ్యామిలీ
నేను మనిద్దరి గురించి ఆలోచిస్తుంటే నువ్వేంటీ. నీకు నేను నాకు నువ్వు. ఇదే మన ఫ్యామిలీ. నేను రాకపోవడానికి కారణం మీ బాలు అన్నయ్య. అతను ఉన్న ఇంటికి ఎప్పటికీ రాను. మన విషయంలో ఎంత మూర్ఖంగా చేశాడో చూశావా. అతని పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. నేను ఆ ఇంటికి రాను అని శ్రుతి అంటుంది. మా ఫ్యామిలీ చాలా పెద్దది. వాళ్లందరు లేకుండా ఉండటం కష్టంగా ఉంది. ఇంట్లో అందరం కలిసి పడుకునేవాళ్లం. నాకు వాళ్లున్నారని హాయిగా పడుకునే వాన్ని. మళ్లీ వాళ్ల ప్రేమ కావాలనిపిస్తుంది అని రవి అంటాడు.
హో ఇప్పుడు వాళ్లతో పడుకోవాలా. ఇది కూడా ఒక కారణమా. చిన్నపిల్లాడిలా అని శ్రుతి అంటుంది. నీకు ఫ్యామిలీ వాల్యూ తెలియట్లేదు. నీకు అన్నా చెల్లి లేరు అందుకే ఇలా అంటున్నావ్ అని రవి అంటాడు. నేను నీకు బోర్ కొట్టాను అందుకే వెళ్తానంటున్నావ్. అప్పుడే బోర్ కొట్టానా అని శ్రుతి అంటుంది. ఇడియట్‌లా మాట్లాడకు శ్రుతి. నువ్ వద్దన్ననా. ఫ్యామిలీ కూడా కావాలని అంటున్నాను అని రవి అంటాడు. నేను మనిద్దరమే ఫ్యామిలీ అంటున్నాను. నీకు కావాలనిపిస్తే నువ్వు వెళ్లు అని శ్రుతి వెళ్లిపోతుంది.
శ్రుతిని బతిమిలాడుతు రవి బయటకు వస్తాడు. చుట్టు ఉన్న వాళ్లందరిని శ్రుతి పిలిచి వెళ్లి మా ఇంట్లో ఉండండి. ఇతనికి జోలపాడండి. నీకు చుట్టూ జనం కావాలని అన్నావ్‌గా వీళ్లు సరిపోకపోతే రైల్వే స్టేషన్ దగ్గర చాలా మంది ఉంటారు. వాళ్లతో పడుకో అని శ్రుతి వెళ్లిపోతుంది. ఏంటీ బాబు ఇలా అవమానిస్తున్నారు అని వాళ్లు అంటే రవి సారీ చెప్పి పంపిస్తాడు. తర్వాత మీనాకు శ్రుతి కాల్ చేసి ఓసారి కలవలాని అంటుంది.
శ్రుతిపై యాసిడ్ అటాక్
ఓసారి కలుస్తేనే అంత సమస్య అయిందని మీనా చెబుతుంది. నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు నువ్ రాకుంటే నా బాధ ఎవరికీ చెప్పుకోవాలో తెలియక నా తల పగిలిపోతుంది. నేను అడ్రస్ చెబుతాను అక్కడికి రా అంటుంది శ్రుతి. కట్ చేస్తే మీనాతో రవి మారిపోయాడు అని శ్రుతి అంటుంది. నిన్ను పెళ్లి చేసుకున్నాడని అందరిని మర్చిపోవాలా. దూరం పెంచే ఏ విషయాన్ని పెంచకు. అలా చేస్తే నువ్వే రవికి దూరం అయిపోతావ్ అని మీనా వెళ్లిపోతుంది.
ఇంతలో శ్రుతి దగ్గరికి మాస్క్ పెట్టుకుని సంజు వస్తాడు. ఇప్పుడు నేను చేయబోయేది కూడా నీకు జీవితాంతం గుర్తు ఉంటుంది అని యాసిడ్ బాటిల్ తీస్తాడు సంజు. సంజుతో వచ్చిన ఇద్దరు శ్రుతిని పట్టుకుంటారు. శ్రుతి మీద యాసిడ్ పోసేందుకు సంజు ప్రయత్నిస్తాడు. అది చూసిన మీనా అడ్డుకునేందుకు వస్తుంది. అక్కడితో నేటి గుండే నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.
టాపిక్