Manchu Mohan Babu : మనోజ్ నా గుండెల మీద తన్నావ్, నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాపం- మోహన్ బాబు
Manchu Mohan Babu : మంచు ఫ్యామిలీ వివాదం కలకలం రేపుతోంది. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన ఇంటి వద్ద జరిగిన ఘర్షణపై మోహన్ బాబు ఆడియో విడుదల చేశారు.
Manchu Mohan Babu : కుటుంబ వివాదంపై సినీనటుడు మోహన్‌బాబు స్పందించారు. మంగళవారం రాత్రి తన ఇంటి చోటుచేసుకున్న ఘటనపై ఆడియో మెసేజ్ విడుదల చేశారు.
"మనోజ్ నువ్వు నా బిడ్డవి. లక్ష్మీప్రసన్న, విష్ణువర్ధన్‌బాబు, మనోజ్ కుమార్ మిమ్మల్ని ఎలా పెంచాను? అందరికంటే నిన్నే ఎంతో గారాబంగా పెంచాను. అందరికంటే నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాలని చూశాను. నువ్వు ఏది అడిగినా ఇచ్చాను. నువ్వు ఈరోజు నా గుండెల మీద తన్నావు మనోజ్. నా మనసు ఆవేదనతో కుంగిపోతుంది. కొన్ని కారణాల వల్ల ఇద్దరం గొడవ పడ్డాం. ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి. జల్‌పల్లిలోని ఇల్లు నా కష్టార్జితం. ఈ ఇంటితో నీకు సంబంధం లేదు. మనోజ్ మద్యానికి బానిసై పోయాడు. మద్యం మత్తులో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు.
నా ఇంట్లో పనిచేస్తోన్న వారిపై దాడికి చేయడం సరికాదు. నా పరువు ప్రఖ్యాతలు మంటగలిపావు ఇక చాలు. నన్ను ఇప్పటి వరకూ ఎవరూ మోసగాడు అనలేదు. నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాపం. ఆస్తులు ముగ్గురికీ సమానంగా ఇవ్వాలా? వద్దా? అనేది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా? దాన ధర్మాలు చేస్తానా? అనేది నా ఇష్టం. నా ఇంట్లో అడుగుపెట్టే అధికారం నీకు లేదు. మనోజ్ నీ వల్ల మీ అమ్మ ఆసుపత్రి పాలైంది. భార్య మాటలు విని తాగుడుకు బానిసై ఇలా ప్రవర్తిస్తున్నావు. ఇక చాలు ఇంతటితో ఈ గొడవను ముగిద్దాం" అని మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు.
వివాదానికి అసలు కారణమేంటి?
మంచు ఫ్యామిలీలో గొడవ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. రెండు రోజుల క్రితం మొదలైన ఈ గొడవ సోమవారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. తొలుత మంచు మనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయగా.. ఆ వెంటనే మంచు మోహన్ బాబు రాచకొండ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ తమని తాము సమర్థించుకుంటూ ప్రెస్‌నోట్‌లు రిలీజ్ చేశారు. కానీ అసలు గొడవకి కారణమేంటి? అనే విషయాన్ని మాత్రం మంచు ఫ్యామిలీలో ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు.
మంచు మోహన్‌బాబు ఇంట్లో అసలు ఏం జరిగింది? అనే విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి ద్వారా మంగళవారం బహిర్గతమైంది. ఆమె మాటల్లో.. ‘‘మోహన్ బాబు సార్ స్టాఫ్ ప్రసాద్‌తో తొలుత మంచు మనోజ్ అన్నకి గొడవైంది. అతడ్ని కొట్టేందుకు మనోజ్ అన్న ప్రయత్నించగా.. నా స్టాఫ్‌ను నేను అదుపులో పెట్టుకుంటాను కొటొద్దు అని మోహన్ బాబు సార్ చెప్పారు. కానీ.. మనోజ్ అన్న వినలేదు. దాంతో మోహన్ బాబు సార్, మనోజ్ అన్న మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో మనోజ్ అన్న రెండో పెళ్లి టాపిక్ కూడా వచ్చింది. పెళ్లికి ముందే ఒక బాబు ఉన్న మౌనికని మనోజ్ అన్న పెళ్లి చేసుకోవడం ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదు. పెళ్లితో మనస్పర్థలు వచ్చాయి.శనివారం ఈ గొడవ జరిగింది. మోహన్ బాబు సార్ అంటే.. మంచు విష్ణు అన్నకి ప్రాణం. సార్ మీద చేయి వేశారంటే.. అస్సలు ఒప్పుకోడు. మనోజ్ అన్న చెయ్యి వేశాడు.. అందుకే డాడీనీ ముట్టుకుంటావా అంటూ మంచు విష్ణు అన్న కోప్పడ్డారు’’ అని ఆమె చెప్పుకొచ్చింది.
సంబంధిత కథనం