Gunde Ninda Gudi Gantalu: భర్తకు శాశ్వతంగా దూరమైన మీనా - రవిని చితక్కొట్టిన బాలు- సంజుకు దొరికిపోయిన శృతి
Gunde Ninda Gudi Gantalu:గుండెనిండా గుడి గంటలు అక్టోబర్ 24 ఎపిసోడ్‌లో అత్తింటికి...పుట్టింటికి దూరమైన మీనా తన బాధను భర్తకు చెప్పుకోవడానికి వస్తుంది. కానీ మీనా ముఖం చూడటానికి బాలు ఇష్టపడడు. ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని అంటాడు. నా దగ్గరకు మాత్రం రావోద్దని మీనాతో అంటాడు.
Gunde Ninda Gudi Gantalu: పెళ్లైన తర్వాత రోజే రవి, శృతి గొడవపడతారు. శృతి తండ్రి వల్లే తాను తన కుటుంబానికి దూరమైనట్లు రవి ఆరోపిస్తాడు.పెళ్లి విషయంలో తొందరపడ్డామని అంటాడు. భర్త వాదనలకు శృతి ధీటుగా సమాధానమిస్తుంది. శృతిని పుట్టింటికి వెళ్లిపొమ్మని రవి అంటాడు.
రవిపై కోపంతో డబ్బింగ్ స్టూడియోకు బయలుదేరిన శృతి... సంజు కంటపడుతుంది. రవిని శృతితో పాటు చూసి సంజు షాకవుతాడు. ఇద్దరు కలిసే తనను జోకర్‌ను చేశారని అర్థం చేసుకుంటాడు.వి, శృతిల సంతోషాన్ని చెడగొట్టడమే తన టార్గెట్ అని మనసులో ఫిక్సవుతాడు సంజు.
వెన్నుపోటు పొడిచింది...
రవి, మీనాలపై బాలు కోపం రోజురోజుకు పెరుగుతుంది. రవి దొరికితే అతడికి చంపేయాలన్నంత కోపంగా కనిపిస్తాడు. మీనా...వీపు చూపిస్తే వెన్నుపోటు పొడుస్తుందని, ఎదురునిలిస్తే గుండెల్లో పొడుస్తుందని..పోటు మాత్రం గ్యారెంటీ అని భార్య గురించి స్నేహితులతో చెబుతాడు బాలు. భర్త మాటలను చాటు నుంచి విని మీనా బాధపడుతుంది.
బాలు కారుకు అడ్డంగా...
మీనాను చూడగానే బాలు ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లబోతాడు. ఒక్కసారిగా బాలు కారుకు మీనా అడ్డు వస్తుంది. ఆమెను చూసి సడెన్ బ్రేక్ వేస్తాడు బాలు.రవి చేసిన తప్పు వల్ల తన బ్రతుకు రోడ్డుపాలైందని, నా బాధను చెప్పుకోవడానికి వచ్చానని భర్తతో అంటుంది మీనా.
ఏం ఎరగని మహానటిలా...
రవి, శృతిల పెళ్లిచేసి ఏం ఎరగని మహానటిలా మా ముందు వచ్చి నిలబడ్డావు...నిన్ను చచ్చినా నమ్మను...చచ్చేదాకా నమ్మను అని బాలు అంటుంది. నా జీవితంలో నిన్ను క్షమించనని మీనాతో చెబుతాడు. ఎక్కడికైనా వెళ్లిపోమని చులకనగా మాట్లాడుతాడు. నా దగ్గరకు మాత్రం రాకని అంటుంది. పుట్టింటికి, అత్తింటికి రానివ్వడం లేదని, ఇప్పుడు నువ్వు కూడా వద్దని అంటే ఎక్కడికి వెళ్లాలో చెప్పమని భర్తను నిలదీస్తుంది.
నీకు నాకు సంబంధం లేదు...
నాకు నీకు ఎలాంటి సంబంధం లేదని, ఇక్కడికి వెళ్లమని మీనాతో అంటాడు బాలు. మీనా ముఖం చూడటానికి కూడా ఇష్టపడడు. నిన్ను చచ్చేదాకా నమ్మనని అంటాడు. నేను చనిపోయిన తర్వాత అయినా మీరు నన్ను అర్థం చేసుకుంటారని నమ్ముతున్నానని బాలుతో అంటుంది మీనా. ఇక మీకే కాదు..ఎవరికి కనిపించనని బాలుతో చెబుతుంది. మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు...నన్ను వెళ్లగొట్టినందుకు మీరు జీవితాంతం కన్నీళ్లు పెట్టుకునే రోజు వస్తుందని భర్తతో అంటుంది మీనా. మీనా ఏడుస్తూ వెళుతున్న బాలు పట్టించుకోడు.
రవికి వార్నింగ్...
రవి రెస్టారెంట్‌కు రాగానే అతడిని చూసి ఫ్రెండ్ కంగారుపడతాడు. నీ గురించి మీ అన్నయ్య బాలు వెతుకుతున్నాడని, నిన్ను కొట్టాలన్నంత కోపంగా తిరుగుతున్నాడని చెబుతాడు. బాలు తనను అర్థం చేసుకుంటాడనే నమ్మకం ఉందని రవి అంటాడు.
రవి రెస్టారెంట్‌కు వచ్చిన విషయం సెక్యూరిటీ గార్డ్ ద్వారా తెలుసుకుంటాడు బాలు. ఆవేశంగా రెస్టారెంట్‌కు వచ్చి రవిని చితక్కొడతాడు. రవి ఎంత కన్వీన్స్ చేయాలని చూసిన బాలు అతడి మాటలు నమ్మడు. అతడి స్నేహితులు వారించినా బాలు వినకుండా రవిని రక్తం వచ్చేలా కొడతాడు.
వదిన తప్పేం లేదు...
నన్ను నమ్ముకొని ఓ అమ్మాయి వచ్చిందని, నువ్వు నన్ను చంపేస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటని బాలును అడుగుతాడు రవి. నాన్నకు గౌరవం ఇవ్వని వ్యక్తి కూతురిని పెళ్లిచేసుకోవద్దని నీకు నేను, నాన్న ఎన్నిసార్లు చెప్పాం. ఒక్కరి మాట వినకుండా మేము ఏమైపోయినా పర్వాలేదని చెప్పి ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయావని రవిపై ఫైర్ అవుతాడు. మేము ఎంత నరకం చూశామో తెలుసా...నాన్నను సురేంద్ర ఎంత అవమానించాడో తెలుసానని రవితో కోపంగా అంటాడు బాలు. వదినను అపార్థం చేసుకోవద్దని రవి చెప్పిన బాలు పట్టించుకోడు.
ఇంటికి రావోద్దు...
ఇక నుంచి నీపై తమ్ముడు అనే ప్రేమ లేదని, ఈ రోజు నుంచి నువ్వు ఎవరో...నేను ఎవరోనని తమ్ముడితో అంటాడు బాలు. మళ్లీ ఇంటి గడప తొక్కితే చంపేస్తానని రవికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు బాలు.
గుడిలో దిక్కులేనిదానిలా ఉన్న కూతురిని చూసి మీనా తల్లి ఎమోషనల్ అవుతుంది. భర్త దగ్గరకు వెళితే నా ముఖం కూడా చూడటానికి ఇష్టపడటం లేదని, అత్తింటికి వెళితే కనీసం వాళ్లు గడపకూడా తొక్కనీయడం లేదని మీనా అంటుంది. నేను ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదంటే ఇప్పుడే పుట్టినింటి నుంచి కూడా వెళ్లిపోతానని మీనా అంటుంది.
నేను కావాలనుకుంటే వస్తాడు...
మీనాను కన్వీన్స్ చేసేందుకు తల్లి ప్రయత్నిస్తుంది. బాలు కోపం తగ్గిన తర్వాత వెళ్లి అతడికి సర్థిచెప్పమని అంటుంది. నేను ఎక్కడికి వెళ్లనని, నా ఓపిక నశించిందని, నేను కావాలనుకుంటే బాలు వస్తాడు. రమ్మని పిలుస్తాడు. ఆ రోజు వరకు ఇక్కడే ఉంటానని తల్లితో చెబుతుంది మీనా. ఒకవేళ పిలవకపోతే ఎప్పటికీ పుట్టింట్లోనే ఉండిపోతానని అంటుంది. నీకు నచ్చకపోతే ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని మీనా బయలుదేరబోతుంది. ఈ పౌరుషానికి ఏం తక్కువలేదని మీనాను ఆపేస్తుంది తల్లి.
రవి కంగారు...
రవి, మీనాపై కోపంతో మందుతాగుతుంటాడు రవి. నేను నీకు కనపడను అని చెప్పిన మీనా ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందోనని బాటు బయటపడతాడు. మీనాకు తన ఫ్రెండ్ చేత ఫోన్ చేయిస్తాడు. కానీ మీనా ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుంది. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.
టాపిక్