Yashasvi Jaiswal: క్రికెటర్‌గా ఎంట్రీ ఇస్తోన్న యశస్వి జైస్వాల్ తమ్ముడు - షమీ బ్రదర్ కూడా!
Yashasvi Jaiswal: టీమిండియా హిట్టర్ యశస్వి జైస్వాల్ తమ్ముడు తేజస్వి జైస్వాల్ క్రికెటర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. త్రిపుర తరఫున రంజీ ట్రోఫీ ఆడబోతున్నాడు. మహ్మద్ షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్ వెస్ట్ బెంగాల్ టీమ్ నుంచి రంజీ ట్రోఫీలో బరిలో దిగనున్నాడు.
Yashasvi Jaiswal: అన్నదమ్ములు క్రికెటర్లుగా మారడం ఇండియాలో కొత్తేమీ కాదు. ప్రస్తుతం హార్దిక్ పాండ్య టీమిండియాలో కీలక ప్లేయర్‌గా కొనసాగుతోండగా అతడి అన్నయ్య కృనాల్ పాండ్య దేశవాళీతో పాటుఐపీఎల్‌లో రాణిస్తున్నాడు. కృనాల్ పాండ్య కూడా టీమిండియా తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ కలిసి టీమిండియా తరఫున క్రికెట్ ఆడారు.

తాజాగా \ టీమిండియా హిట్టర్ యశస్వి జైస్వాల్ తమ్ముడితో పాటు పేసర్ మహ్మద్ షమీ సోదరుడు కూడా క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
తేజస్వి జైస్వాల్...
దూకుడైన ఆటతీరుతో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన కొద్ది రోజుల్లోనే క్రికెట్ వర్గాల దృష్టిని ఆకట్టుకున్నాడు యశస్వి జైస్వాల్. టెస్టు, టీ20లలో అదరగొడుతోన్న అతడు టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
కాగా యశస్వి జైస్వాల్ బాటలతోనే అతడి తమ్ముడు తేజస్వి జైస్వాల్ కూడా ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ ఏడాది త్రిపుర జట్టు తరఫున రంజీ ట్రోఫీ ఆడబోతున్నాడు. యశస్వి బ్యాట్స్‌మెన్ కాగా...తేజస్వి మాత్రం బౌలర్ కావడం గమనార్హం. బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. ఇప్పటికే లిస్ట్ ఏ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా అదరగొట్టాడు. రంజీలో రాణించి టీమిండియాలో చోటుపై కన్నేసే ప్రయత్నాల్లో ఉన్నాడు తేజస్వి జైస్వాల్.
మహ్మద్ షమీ తమ్ముడు...
తేజస్వి జైస్వాల్‌తో పాటు మరో టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్ కూడా ఈ ఏడాది రంజీ ట్రోఫీలో వెస్ట్ బెంగాళ్ తరఫున బరిలో దిగుతోన్నాడు. ఈ ఏడాది జనవరిలో విశాఖపట్నం వేదికగా ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా రంజీ ట్రోఫీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మహ్మద్ కైఫ్. అన్న షమీలాగే తమ్ముడు కైఫ్ కూడా పేసర్ కావడం గమనార్హం. దేశవాళీలో సర్ఫరాజ్‌ఖాన్, అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ పరుగుల వరద పారిస్తున్నారు.
షమీ రీఎంట్రీ…
మరోవైపు గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత గాయం కారణంగా టీమిండియాకు దూరమయ్యాడు షమీ. వన్డే వరల్డ్ కప్‌లో 24 వికెట్లతో అదరగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. గాయం నుంచి కోలుకున్న షమీ రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు.