Eco Friendly Diwali : ఎకో ఫ్రెండ్లీ దీపావళి.. పిల్లలే స్వయంగా ఇలా క్యాండిల్స్ తయారుచేసుకోవచ్చు-eco friendly diwali children can make candles for this deepavali festival like this details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Eco Friendly Diwali : ఎకో ఫ్రెండ్లీ దీపావళి.. పిల్లలే స్వయంగా ఇలా క్యాండిల్స్ తయారుచేసుకోవచ్చు

Eco Friendly Diwali : ఎకో ఫ్రెండ్లీ దీపావళి.. పిల్లలే స్వయంగా ఇలా క్యాండిల్స్ తయారుచేసుకోవచ్చు

Anand Sai HT Telugu
Oct 20, 2024 04:00 PM IST

Eco Friendly Diwali : దీపావళి వచ్చిందంటే టపాసుల మోత. ఇటు పర్యావరణానికి ఇబ్బందే. అటు ప్రజల ఆరోగ్యానికి సమస్యలే. అదే ఎకో ఫ్రెండ్లీ దీపావళి చేసుకుంటే ఎంత బాగుంటుంది. పిల్లలే స్వయంగా క్యాండిల్స్ తయారుచేసుకునేట్టుగా ఉంటే వారికి కూడా మంచిది.

ఎకో ఫ్రెండ్లీ
ఎకో ఫ్రెండ్లీ

ఎకో ఫ్రెండ్లీ దీపావళి అనేది జనాల్లోకి ఇప్పుడిప్పుడే చర్చకు వస్తుంది. పర్యావరణ అనుకూలమైన దీపావళి జరుపుకోవడం అందరికీ మంచిది. కానీ కొంతమంది టపాసుల మోతతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే గ్రీన్ దీపావళి అలవాటు చేయాలి. వారిలో క్రియేటివిటీని కూడా పెంచాలి. అలాంటి ఆలోచనల్లో నుంచి పుట్టిందే.. క్రాఫ్‌ టౌన్.

ప్రతిఒక్కరి జీవితంలో చీకట్లు తొలగిపోయి వెలుగు రావాలని ఆకాంక్షించే పండుగ దీపావళి. అలాంటి పండుగను టాపాసుల మోతతో మితిమీరిన శబ్ద కాలుష్యంతో చెడగొట్టేస్తున్నారు చాలా మంది. అందుకే క్రాఫ్‌ టౌన్ అనే స్టార్టప్ ఎకో ఫ్రెండ్లీ కిట్‌ను పరిచయం చేస్తూ పిల్లల నుంచి పెద్దల వరకు గ్రీన్‌ దీపావళి ఎలా జరుపుకోవాలో చెబుతోంది.

ఎకో ఫ్రెండ్లీ కిట్ ద్వారా పిల్లలే స్వయంగా క్యాండిల్ తయారుచేసుకోవడం నేర్చుకుంటారు. దీనివల్ల పిల్లలకు ఆర్ట్స్ పట్ల ఆసక్తి కూడా పెరుగుతుందని క్రాఫ్ టౌన్ అంటోంది. త‌మ చేతుల‌తో క్యాండిల్స్ త‌యారుచేసుకోవ‌డం వ‌ల్ల పండుగ పట్ల ఎమోష‌నల్ బాండింగ్ ఏర్పడుతుంది. జీరో ప్లాస్టిక్ దీని ప్రత్యేకత. ఈ కిట్ వాడిన తర్వాత వ్యర్థాలన్నీ మట్టిలో కలిసిపోతాయి.

పండుగలు రాగానే పిల్లలతోపాటు పెద్దలు టీవీలు చూడటం, సినిమాలకు వెళ్లడం చేస్తుంటారు. కానీ అందరికీ కలసి పర్యావరణ అనుకూలమైన పండుగ జరుపుకొంటేనే కిక్కు. అందుకే పిల్లలు స్వయంగా క్యాండిల్ తయారుచేసుకునేలా కిట్ ను అందిస్తుంది క్రాఫ్ టౌన్. ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు క్యాండిల్స్ ఎలా తయారుచేసుకోవాలి? కళల‌ పట్ల ఆసక్తి ఎలా పెంచుకోవ‌చ్చు ఈ కిట్ చెబుతుంది. పెద్దలు పిల్లలతో గ‌డిపేందుకు సమయం కూడా దొరుకుతుంది. మీరు కూడా అందమైన క్యాండిల్స్‌తో దీపావళి జరుపుకోవాలనుకుంటే.. Craftown.in వెబ్‌సైట్‌కు వెళ్లి వీటిని ఆర్డర్ పెట్టవచ్చు.

త‌యారీ విధానం ఇలా

ఎకో ఫ్రెండ్లీ కిట్‌లో ప్రమిదలు, చెక్కతోకూడిన‌ బ్రష్, మైనంతో కూడిన క్యాండిల్‌ రా మెటిరీయ‌ల్, స‌హ‌జ‌మైన రంగులుటాయి. చెక్క బ్రష్‌తో మ‌న‌కు న‌చ్చిన బొమ్మలు, ఆకృతులు ప్రమిద‌ల‌పై వేసుకొవ‌చ్చు. ఆ త‌ర్వాత చిన్నపాటి కుండ తీసుకోవాలి. దాంట్లో నీళ్లు పోసి వేడి చేసిన త‌ర్వాత రా మెటిరియ‌ల్ వేయాలి. 30 నిమిషాల త‌ర్వాత‌ క్యాండిల్స్ మ‌న కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. క్యాండిల్ ఎలా త‌యారుచేసుకోవాలో మొత్తం వివ‌రాల‌తో కూడిన ఓ పేప‌ర్ కూడా మీకు కిట్‌తోపాటుగా వస్తుంది.

Whats_app_banner