Keerthy Suresh Next Telugu Movie: రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌ స‌ర‌స‌న కీర్తిసురేష్ - మ‌హాన‌టి స‌ర్‌ప్రైజ్ ప్లాన్‌-keerthy suresh to team up with writer padmabhushan hero suhas for lady oriented movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Keerthy Suresh To Team Up With Writer Padmabhushan Hero Suhas For Lady Oriented Movie

Keerthy Suresh Next Telugu Movie: రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌ స‌ర‌స‌న కీర్తిసురేష్ - మ‌హాన‌టి స‌ర్‌ప్రైజ్ ప్లాన్‌

HT Telugu Desk HT Telugu
Jun 15, 2023 05:49 AM IST

Keerthy Suresh Next Telugu Movie:ద‌స‌రా త‌ర్వాత తెలుగులో కీర్తిసురేష్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో యంగ్ హీరో ప్ర‌ధాన పాత్ర‌ను పోషించ‌నున్న‌ట్లు స‌మాచారం

కీర్తిసురేష్
కీర్తిసురేష్

Keerthy Suresh Next Telugu Movie: ద‌స‌రా (Dasara Movie) సినిమాతో మంచి న‌టిగా పేరుతో పాటు బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ను బోన‌స్‌గా ద‌క్కించుకొంది కీర్తిసురేష్. వెన్నెల అనే తెలంగాణ యువ‌తి పాత్ర‌లో స‌హ‌జ న‌టన‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసింది. ద‌స‌రా తో పెద్ద హిట్ అందుకున్నాతెలుగులో తన తర్వాతి సినిమాను స్టార్ హీరోతో కాకుండా అప్‌క‌మింగ్ యంగ్‌ హీరోతో చేస్తూ ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతున్న‌ది కీర్తిసురేష్‌.

ట్రెండింగ్ వార్తలు

తెలుగులో లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఓ మూవీకి కీర్తిసురేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. కీర్తి సురేష్ పాత్ర ప్ర‌ధానంగా సాగే ఈ మూవీలో రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ (Writer Padmabhushan) హీరో సుహాస్ (Suhas) ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఇద్ద‌రి పాత్ర‌లు డిఫ‌రెంట్ యాంగిల్స్‌లో సాగుతాయ‌ని చెబుతోన్నారు. ఈ ఇద్ద‌రు జంట‌గా క‌నిపిస్తారా? లేదా? అన్న‌ది తెలియ‌రాలేదు. ఈ మ‌హిళా ప్ర‌ధాన సినిమాతో కొత్త డైరెక్ట‌ర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు (Dil Raju) నిర్మించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సింగిల్ సిట్టింగ్‌లోనే కీర్తిసురేష్ ఈ సినిమాను అంగీక‌రించిన‌ట్లు చెబుతోన్నారు. ఈ జూన్ లోనే కీర్తిసురేష్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం తెలుగులో భోళా శంక‌ర్ సినిమా చేస్తోంది కీర్తిసురేష్‌. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి సోద‌రిగా క‌నిపించ‌బోతున్న‌ది. అలాగే త‌మిళంలో నాలుగు సినిమాల్లో న‌టిస్తోంది. కాగా ద‌స‌రా త‌ర్వాత కీర్తిసురేష్ త‌న రెమ్యున‌రేష‌న్‌ను రెట్టింపు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.