Gunde Ninda Gudi Gantalu Today Episode రవి ఇంటికి ప్రభావతి- కాళ్ల బేరానికి మీనా- సాంబార్‌లో బల్లి, తండ్రిని కాపాడిన బాలు-gunde ninda gudi gantalu serial december 2nd episode prabhavathi deceives sathyam balu saves father star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode రవి ఇంటికి ప్రభావతి- కాళ్ల బేరానికి మీనా- సాంబార్‌లో బల్లి, తండ్రిని కాపాడిన బాలు

Gunde Ninda Gudi Gantalu Today Episode రవి ఇంటికి ప్రభావతి- కాళ్ల బేరానికి మీనా- సాంబార్‌లో బల్లి, తండ్రిని కాపాడిన బాలు

Sanjiv Kumar HT Telugu
Dec 02, 2024 08:30 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial December 2 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 2 ఎపిసోడ్‌లో రవి ఇంటికి సత్యంకు తెలియకుండా ప్రభావతి, కామాక్షి వెళ్తారు. ఇంతలో సత్యం తినే సాంబార్‌లో బల్లి పడుతుంది. మరోవైపు వడ్డీ వ్యాపారి దగ్గరికి మీనా వెళ్తుంది. కాళ్ల బేరానికి వచ్చిందా అని అతను అంటాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 2 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 2 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శోభనం గురించి శ్రుతి అడుగుతుంది. నాకు ఇప్పుడు అలాంటిది లేదని రవి చెబుతాడు. ఇంకా మనం పెళ్లి చేసుకుని తప్పు చేశామని ఫీల్ అవుతున్నావా అని శ్రుతి అడుగుతుంది.

నాతో మాత్రమే ఉండు

పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలకు దూరంగా ఉండటం కాదు. మన శోభనం సాంప్రదాయబద్ధంగా జరగాలని అనుకుంటున్నా. మీ వాళ్లు మా వాళ్లు కలిసి సంతోషంగా మనల్ని గదిలోకి పంపాలి అని రవి అంటాడు. మా వాళ్లు ఇప్పట్లో ఒప్పుకోరు. మీ వాళ్లు ఒప్పుకుంటారా. మీ బాలు అన్నయ్య ఒప్పుకుంటాడా. అనవసరంగా టైమ్ వేస్ట్ చేసినట్లే. మొన్న దీపావళికి ఏమైందో చూశావ్‌గా. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. నాతో ఉన్నప్పుడు నాతో మాత్రమే ఉండు. నా స్వార్థం నువ్వు నీ ప్రేమ. ఇవే నాకు చాలు అర్థం చేసుకో అని శ్రుతి అంటుంది.

మరోవైపు మనోజ్ రెడీ అవుతుంటే అందరికంటే ముందే వెళ్తున్నావా. అది మీ బాస్ నోటీస్ చేశాడా అని రోహిణి అడుగుతుంది. నాకంటే ముందుగా నా కొలిగ్స్ వెళ్తున్నారు అని మనోజ్ అంటాడు. అంటే లేట్‌గా వెళ్తున్నావా అని రోహిణి అంటే.. లేదు వాళ్లే ముందు వెళ్తున్నారు అని మనోజ్ అంటాడు. అలా అయితే మీ బాస్ దృష్టిలో నువ్ లేట్‌గా వెళ్తున్నట్లేగా అని రోహిణి అంటుంది. మనకెవడు బాస్ లేడు. మనకు మనమే బాస్ అని మనోజ్ అంటాడు.

నువ్ కారు షో రూమ్‌కే వెళ్తున్నావా. లేక ఉద్యోగం ఊడగొట్టుకుని ఇంకెక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతుంది రోహిణి. దాంతో కంగారుపడిన మనోజ్ ఏంటీ అలా అడిగావ్. టార్గెట్ అచీవ్ చేస్తే ఎప్పుడెళ్లామని పట్టించుకోరు. అక్కడ అంతా బాగానే ఉంది. మంచి గాలి, మంచి వెళుతురు, పడుకోడానికి బెంచీలు అని మనోజ్ అంటాడు. కొంపదీసి మీ షో రూమ్‌ని పబ్లిక్ పార్క్ చేశారా ఏంటీ అని రోహిణి అంటుంది. ఛీ ఛీ అలా ఎందుకు చేస్తారు. సెంట్రల్ ఏసీ, ఫుల్ సీలింగ్ లైట్స్, బెడ్ కమ్ బెంచీ అని చెబుతున్నాను అని మనోజ్ అంటాడు.

బాలుకంటే పెద్ద రౌడీని

ఎన్ని కార్లు అమ్మావ్ అని రోహిణి అడిగితే 15 అని మనోజ్ చెబుతాడు. అవునా.. అంటే, టార్గెట్‌ కంటే ఎక్కువే అమ్మావన్నమాట. ఇంత ఎఫిషియంట్‌వి వర్క్ చేయడం ఏంటీ అని రోహిణి అంటుంది. మానేయమంటావా.. నువ్ చెప్పు ఇప్పుడే మానేస్తాను అని మనోజ్ అంటాడు. ఛీ ఛీ లేదు అంత మంచి జాబ్ నేనెందుకు మానేయమంటాను. జీతం తక్కువ అని ఒకవేళ మానేశావే నువ్ అసలైనా రోహిణిని చూస్తావ్. మీ బాలుకంటే పెద్ద రౌడీని అవుతాను అని రోహిణి అంటుంది.

భలే దానివే. నేనెందుకు మానేస్తాను. నువ్వు నీ కుళ్లు జోకులు అని మనోజ్ అంటాడు. వేసింది నువ్వు. జీతం పెంచమను లేకుంటే ఎన్ని కారులు అమ్మితే అంత ఇన్సెంటివ్స్ ఇవ్వమను. బాలుకంటే మనమే ఎక్కువగా ఇంటి ఖర్చులకు ఇవ్వాలి. అప్పుడే గౌరవం అని రోహిణి అంటుంది. జీతానికి వడ్డీకి తెస్తున్నాను. ఇంకా ఇన్సెంటివ్స్ అంటే ఇంటింటికి వెళ్లి ముష్టి ఎత్తుకోవాలి అని మనోజ్ మనసులో అనుకుంటాడు. లేదంటే చెప్పు మా బాస్ భార్యను తీసుకొచ్చి అడిగిస్తాను అని రోహిణి అంటుంది.

దాంతో షాక్ అయిన మనోజ్ అప్పుడు గాని నా జాతకం మొత్తం బయటపడదు అనుకుంటాడు. ఆవిడదాకా ఎందుకు నేనే మా బాస్‌కు బాస్. నా మాట వినకుంటే ఊరుకుంటానా అని వెళ్తాడు మనోజ్. టైమ్‌కు మనోజ్ వెళ్లడంపై ప్రభావతి సెటైర్లు వేస్తుంది. ఎన్ని రోజులు అని ఆటోలో వెళ్తావ్. మంచి కంపెనీలోనే పని చేస్తున్నావ్‌గా. అడిగి లోన్ తీసుకుని ఓ కారు తీసుకొవచ్చుగా అని సత్యం అంటాడు. దాంతో మనోజ్ షాక్ అవుతాడు. అప్పుడు ప్రభావతి మరింతగా సెటైర్లు వేస్తుంది.

రోహిణి అబద్ధం

ఇంతలో రోహిణి వస్తే.. నువ్వెళ్లి కారు లోన్ గురించి అడగొచ్చుగా అని ప్రభావతి మరింత ఇరికిస్తుంది. నాకు రాని ఐడియా మామయ్యకు వచ్చింది అని రోహిణి అంటే.. మనోజ్ డైవర్ట్ చేస్తూ ఆకలేస్తుందని చెబుతాడు. అది తప్పదుగా అని టిఫిన్ ఇస్తుంది. తర్వాత మనోజ్ జాబ్ గురించి గొప్పు చెబుతుంది రోహిణి. తర్వాత రోహిణి వెళ్తుంది. సిగ్గులేదన్నట్లుగా అని మనోజ్‌ను కొడుతుంది ప్రభావతి. తర్వాత రోహిణి వెళ్తుంటే.. ప్రభావతి వెళ్లి తాను కూడా పార్లర్‌కు వస్తానంటుంది.

దాంతో రోహిణి షాక్ అవుతుంది. మీ మామయ్య హాస్పిటల్, పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు ఏడ్చి ఏడ్చి నా మొహం పాడైపోయింది. ఇప్పుడే వస్తాను అని ప్రభావతి అంటుంది పార్లర్‌కు వెళ్లట్లేదు. పెద్ద క్లైంట్‌ దగ్గరికి వెళ్తున్నాను. ఇంటికి వచ్చాక నేనే ఫేసియల్ చేస్తాను అని అబద్ధం చెప్పి వెళ్లిపోతుంది రోహిణి. మనోజ్ వస్తుంటే ప్రభావతి కారు గురించి సెటైర్లు వేస్తుంది. నువ్ కూడా బాలులా మారావ్ ఏంటని మనోజ్ అంటే ఇలా అంటే మారవ్ కదా అని ప్రభావతి అంటుంది.

నిజంగానే నీ విషయం బయటపడితే బాలుగాడు రోడ్డుమీద నిలబెడతాడు. ఏదో ఒక పని చూసుకుని రా అని ప్రభావతి అంటుంది. ఇంట్లోకి వెళ్తుంటే అక్కడ సత్యం ఉంటాడు. వాళ్ల మాటలు విన్నాడేమో అనుకుని ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటీ ఏది ఒక పని చూసుకుని రా అంటున్నావ్. వాడు పనికి వెళ్లట్లేదా అని సత్యం అంటాడు. ఆఫీస్‌లో పని లేదంటే ఏదోటి చేసుకుని రా అని చెప్పాను అని కవర్ చేస్తుంది ప్రభావతి.

క్లాస్ పీకిన బాలు

మరోవైపు బాలు క్లీన్ చేస్తుంటే ఇంతలో తన కారు వస్తుంది. అది చాలా డర్టీగా ఉంటుంది. దాంతో కోపానికి వచ్చిన బాలు ఆ కారు డ్రైవర్‌ను తిడతాడు. మనిషివేనా. మానవత్వం ఉందా. నువ్ చేసిన పనికి నరికేయాలి అని అంటాడు బాలు. చెప్పి తిట్టమని కారు డ్రైవర్ కోపంగా అంటాడు. కారును కన్నబిడ్డలా చూసుకోవాలి. మనం పళ్లు తోముకున్నట్లుగా దాన్ని తీసేటప్పుడు కడిగి తీయాలి కదా అని బాలు అంటాడు. మా ఓనరే అనలేదు. మీరెవరు అనడానికి అని అతను అంటాడు.

ఆ కారు ఓనర్ మొన్నటివరకు నేనే. మొన్నే గణపతికి అమ్మాను అని బాలు అంటాడు. మీకు ఆ కారుకు సంబంధం లేదు. నన్ను తిట్టే హక్కు కూడా మీకు లేదు. ఇప్పటికే ఎక్కువ అన్నారు. మీ పని చూసుకోండి అని అతను వెళ్లబోతుంటే ఆగరా నీ సంగతి చెబుతాను అని ఫోన్ తీసి గణపతికి కాల్ చేసి చెబుతాడు బాలు. నేను జాగ్రత్తగా చూసుకున్న కారును ఓ వెధవకి అప్పజెప్పారు. వాడు ఇష్టమొచ్చినట్లు వాడుతున్నాడు. శుభ్రత లేకుండా ఉంచుతున్నాడు. కారు నాది కాదు. కానీ, కారు కారేగా బాగా చూసుకోవాలిగా అని బాలు అంటాడు.

దాంతో కారు డ్రైవర్ చెప్పకన్నా. బుద్ధి గడ్డితిని ఓవర్‌గా మాట్లాడాను. కారును చంటిబిడ్డలా చూసుకుంటాను అని అంటాడు. అన్నం పెట్టే కారుని అమ్మలా చూసుకోవాలి అని బాలు చెబుతాడు. దాంతో అతను వెళ్లిపోతాడు. మరోవైపు వంట చేశాను. బయటకు వెళ్లొస్తాను అని సత్యంకు చెబుతుంది మీనా. ఏదో ఇళ్లల్లో పాచి పని చేసేదానిలా ఎక్కడికే అని ప్రభావతి అంటుంది. గుడికి వెళ్లాలి. ఇవాళ చాలా పూలమాలలు కట్టేది ఉందట. అమ్మకు అవసరం అని మీనా అంటుంది.

రవి ఇంటి ప్రభావతి, కామాక్షి

తినేది ఇక్కడ పని అక్కడ అని ప్రభావతి అంటే.. తల్లికేగా సహాయం చేసేది. వెళ్లమ్మా అని సత్యం అంటాడు. దాంతో మీనా వెళ్తుంది. ఇలా ఎందుకు అడ్డుతగులుతావ్. ఇలా అలుసు ఇస్తే ఎలా అని ప్రభావతి కోప్పడుతుంది. తర్వాత కామాక్షి వస్తుంది. రవి గురించి మాట్లాడుతుంది. రేపైనా ఎల్లుండైనా వచ్చేవాడేగా. రానివ్వకపోతారా అని కామాక్షి అంటుంది. అలాంటి ఆలోచన లేదమ్మా. వాడిని బాగా నమ్మాను. నా నమ్మకాన్ని దెబ్బతీసాడు. వాడి పేరే వినడానికి ఇష్టం లేదు అని సత్యం అంటాడు.

కామాక్షి కమ్మలు పాతబడ్డాయట. కొత్తవి తీసుకుంటుందట. అందుకే బయటకు వెళ్తున్నాం అని ప్రభావతి సత్యంకు అబద్ధం చెబుతుంది. తర్వాత ఇద్దరూ ఇంట్లో భోజనం చేస్తుంటారు. ఏంటీ వదినా రవిగాడిని కలవడానికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పలేదా అని కామాక్షి అడుగుతుంది. ఇప్పుడే చెబితే ఇల్లు కూడా కదలనివ్వరు. మనం వెళ్లి ముందు వాడిని కలుద్దాం. వాడి ఉద్దేశం ఎలా ఉందో తెలుసుకుని బాలు గాడితో మాట్లాడుదాం అని ప్రభావతి అంటుంది.

ప్రభావతి, కామాక్షి భోజనం చేసి వెళ్తుంటారు. సాంబార్ గిన్నెపై మూత లేకపోవడంతో అందులో బల్లి పడుతుంది. మీనా వచ్చేలోపు ఆకలేస్తే పెట్టుకుని తినండి అని చెప్పి ప్రభావతి వెళ్లిపోతుంది. తర్వాత బాలు వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్తుంది మీనా. ఏవమ్మా అలాంటివాడితో ఎలా కాపురం చేస్తున్నావ్. అయినా అది మాకెందుకు. కానీ, మీ గురించి చెబితే అన్న రానివ్వరు అని సెక్యూరిటీ గార్డ్స్ అంటారు. దాంతో మీనా బతిమిలాడుతుంది.

కాళ్ల బేరానికి వచ్చిందా?

అప్పుడు వడ్డీ వ్యాపారితో బాలు భార్య వచ్చిందని చెబుతాడు. ఓహో వాడితో పని జరగట్లేదని, వాడి పెళ్లాన్ని కాళ్లబేరానికి పంపించాడా. ఈ పెళ్లాల మొహం చూసి జాలిపడితే మనం బిజినెస్ చేయలేం కానీ, నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి పంపించు అని వడ్డీ వ్యాపారి అంటాడు. బిజీగా ఉన్నాడు అని సెక్యూరిటీ గార్డ్ చెబుతాడు. దాంతో అక్కడే ఉంటానని, కలిసే వెళ్తానని మీనా అంటుంది. ఆ విషయం యజమానికి సెక్యూరిటీ గార్డ్ చెబుతాడు.

కట్ చేస్తే సత్యం బాలు భోజనం చేస్తుంటారు. సాంబార్‌లో బల్లి పడిన విషయం చెప్పి సత్యంను తినకుండా ఆపుతాడు బాలు. ఇంతలో ప్రభావతి వస్తే బాలు కోప్పడుతాడు. ఆ తర్వాత మీనా వస్తే సాంబార్‌లో బల్లి పడిందని, ఇంట్లో అందరిని చంపాలనుకున్నావా అని కోప్పడుతుంది ప్రభావతి. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner