Brahmamudi December 2nd Episode: పనిమనిషికి అసిస్టెంట్స్‌గా రాజ్, రాహుల్, ప్రకాశం- పళ్లు రాలగొట్టించుకున్న ఇంటి వారసుడు
Brahmamudi Serial December 2nd Episode: బ్రహ్మముడి డిసెంబర్ 2 ఎపిసోడ్‌లో పనిమనిషి స్టెల్లా స్టైలిష్‌గా ఎంట్రీ ఇస్తుంది. రాహుల్‌కు డెలిషియస్, ప్రకాశంకు పులిహార, రాజ్‌కు చెర్రీస్ అని నిక్‌నేమ్స్ పెడుతుంది స్టెల్లా. తర్వాత తనకు అసిస్టెంట్స్‌గా ముగ్గురు కావాలని చెప్పడంతో ముగ్గురు అలాగే చేస్తారు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటికి కొత్త పనిమనిషి స్టెల్లా వస్తుంది. అంతా ఆశ్చర్యంగా ఆమెను చూస్తారు. రాగానే అందరికి హాయ్ చెప్పిన స్టెల్లా రాజ్‌ను హ్యాండ్సమ్‌గా ఉన్నావని చెబుతుంది. నువ్ కూడా ప్రిట్టీగా ఉన్నావని రాజ్ అంటాడు.
పోపుల పెట్టెలా ఉంది
పోపులపెట్టలా రకరకాలుగా ఉందిరా అని ప్రకాశం అంటే.. యూ చిలీ అని స్టెల్లా అంటుంది. సిల్లీనా చిలీనా అని ప్రకాశం అంటే.. ఫుడ్ భాషలో అలా చెప్పింది బాబాయ్ అని రాజ్ అంటాడు. ఇంత డెలిషియస్‌గా ఉన్నాడు రాహుల్‌ను అంటుంది స్టెల్లా. మీరు కూడా గార్జియస్‌గా ఉన్నారని రాహుల్ అంటాడు. అవును, నేను అలాగే ఉంటాను డెలిషియస్ అని స్టెల్లా అంటుంది. వాడికి డెలిషియస్ అని పేరు పెట్టావ్. నాకు పెట్టవా అని ప్రకాశం అడుగుతాడు.
పాత చింతపచ్చడిలా పులిహారకు పనికివచ్చేలా ఉన్నారు. మీ పేరు పులిహార అని స్టెల్లా అంటుంది. ప్రకాశం మురిసిపోతుంటే మిగతా వాళ్లు నవ్వుకుంటారు. అవును మా మామయ్య బాగా కలుపుతాడు పులిహార అని రాహుల్ అంటాడు. ఇంతకీ అన్ని రకాల వంటలు వచ్చా అని ప్రకాశం అడిగితే.. నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని రకాల వంటలు వచ్చని స్టెల్లా అంటుంది. ఒక్కొక్కరు లిస్ట్ చెబుతారు. దాంతో మరి నా అసిస్టెంట్స్ ఎక్కడ అని స్టెల్లా అడుగుతుంది.
అసిస్టెంట్స్ ఏంటీ అని రాజ్ అంటే.. ముగ్గురు అసిస్టెంట్స్ కావాలి. ఒకరు డిషెస్ క్లీన్ చేయడానికి, మరొకరు వెజిటేబుల్స్ కట్ చేయడానికి, ఇంకొకరు వంటలో సహాయం చేయడానికి. ముగ్గురు ఉంటే తప్పా మీరు చెప్పిన వంటలు టైమ్‌కి కావు అని స్టెల్లా అంటుంది. అప్పటివరకు కావ్య దగ్గర రాజ్ ఇచ్చిన బిల్డప్ తుస్సుమంటుంది. మరి నువ్వేం చేస్తావ్ మేకప్ వేసుకుని కూర్చుంటావా అని స్వప్న అంటుంది. మెయిన్ చెఫ్ ఎవరు గరిట పట్టుకుని తిప్పరు. ఎలా చేయాలో చెబుతారు అని స్టెల్లా అంటుంది.
బాత్రూమ్స్ కడగను
వంటకే ముగ్గురు కావాలంటుంది. మరి బాత్రూమ్ కడగడానికి ఇంకెంతమంది కావాలంటుందో అని ఇందిరాదేవి అంటుంది. ఛీ ఛీ నేను బాత్రూమ్స్ కడగను అని స్టెల్లా అంటుంది. ఈమెకె లక్ష అంటే ముగ్గురు అసిస్టెంట్స్‌కు మరో లక్ష కావాలి కదరా అని సుభాష్ అంటాడు. ఇచ్చేద్దాం డాడ్. పెట్టేద్దాం. తగ్గేదే లే అని కావ్యను చూస్తూ అంటాడు రాజ్. కానీ, ఎప్పటివరకు అరెంజ్ చేస్తారు అని స్టెల్లా అంటుంది. రేపటి వరకు అరెంజ్ చేస్తాను. ఇవాళ్టీకి అడ్జస్ట్ చేసుకో అని రాజ్ అంటాడు.
నో నో అసిస్టెంట్స్ లేనిదే వంట చేయను అని స్టెల్లా అంటుంది. దాంతో మేమున్నాం కదా అని రాహుల్ అంటాడు. దాంతో రాహుల్, ప్రకాశం, రాజ్ ముగ్గురు స్టెల్లాకు అసిస్టెంట్స్‌గా మారుతారు. మా రాజ్‌కు కూడా నిక్‌నేమ్ పెట్టొచ్చు కదా అని ప్రకాశం అంటే.. చెర్రీ పండులా ఉన్నాడు కాబట్టి చెర్రీ అని స్టెల్లా అంటుంది. నడుము తిప్పడమేనా గరిట తిప్పేది ఏమైనా ఉందా. మా పులిహారను తీసుకెళ్లు. అంట్లు బాగా కడుగుతాడు అని ధాన్యలక్ష్మీ అంటుంది.
మా డెలిషియస్‌ను కూడా తీసుకెళ్లు. సింగిల్‌గా వచ్చినదానివి డబుల్‌గా వెళ్తావ్ అని స్వప్న అంటుంది. అంటే కడుపు చేసి పంపిస్తాడని స్వప్న సెటైర్ వేస్తుంది. దాంతో ఏంటీ. అలా ఎలా అని స్టెల్లా అడిగితే.. ముందు ముందు అర్థం అవుతుందని స్వప్న అంటుంది. ఈ చెర్రీని కూడా తీసుకెళ్లు. ఆల్ రౌండర్. కావాలంటే బూత్ బంగ్లాకు కూడా తీసుకెళ్తాడు అని కావ్య సెటైర్ వేస్తుంది. పద మనం వెళ్దాం. నడుము బిగించి కలిసికట్టుగా వంట చేద్దాం. బయట ఫుడ్ అవసరం లేదని మా నానమ్మ తాతయ్యకు తెలిసిరావాలి అని రాజ్ అంటాడు.
క్లీన్‌గా ఉంటేనే
స్టెల్లాకు కిచెన్ చూపించడానికి ప్రకాశం, రాహుల్ పోటీ పడతారు. ఇద్దరు స్టెల్లా చెరో చేయి పట్టుకుని కిచెన్‌కు తీసుకెళ్తారు రాహుల్, ప్రకాశం. నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో చూశావా అని కావ్యతో రాజ్ అంటే తొందరగా వెళ్లండి. మీ గార్జియస్‌ను వాళ్లు కొరుక్కుతినేలా ఉన్నారు. వాళ్ల శీలాన్ని కాపాడే కర్తవ్యం మీపైనే ఉందని కావ్య అంటుంది. దాంతో రాజ్ కిచెన్‌లోకి వెళ్తాడు. కిచెన్ ఇంత డర్టీగా ఉంది. ఎవరు క్లీన్ చేస్తారని స్టెల్లా అంటే.. ప్రకాశం, రాహుల్ క్లీన్ చేస్తారు.
క్లీన్ చేశామని రాహుల్ చెబుతాడు. ఇప్పుడు మూడ్ వస్తుందిగా వంట చేయడానికి. వంట మొదలుపెట్టు అని రాజ్ అంటే.. మరి వెజిటేబుల్స్ ఎవరు కట్ చేస్తారు చెర్రీస్ అని స్టెల్లా అంటుంది. రాజ్ చేస్తాడని రాహుల్ అంటాడు. సరే నేను చేస్తాను అని రాజ్ అంటాడు. ఏరోజు అయినా నాకు ఇలా హెల్ప్ చేశారా ఈ చెర్రీస్ అని కావ్య అంటుంది. వాడు పంతానికి పోయి పళ్లు రాలగొట్టించుకున్నాడులే అని ఇందిరాదేవి అంటుంది.
ప్రకాశం ఓవర్‌గా బిల్డప్ ఇస్తుంటే స్టెల్లా ఉండి డిష్ వాష్ చేయమని చెబుతుంది. డిష్ వాష్ కంటే వెజిటేబుల్స్ కట్ చేయడం బెటర్ కదా. అందుకే కకృత్తి పడొద్దు అని రాజ్ అంటాడు. చూశావా స్వప్న వీళ్లు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారో అని ధాన్యలక్ష్మీ అంటే.. కావాలనే చేస్తున్నారు అని స్వప్న అంటుంది. ప్రకాశం డిష్ వాష్ చేస్తుంటే రాజ్ వెజిటేబుల్స్ కట్ చేస్తాడు. కానీ, ఇలా కాదు కట్ చేయాల్సింది. స్టార్ హోటల్ రేంజ్‌లో కట్ చేయాలి. మళ్లీ వెజిటేబుల్స్ తీసుకొచ్చి కట్ చేయమని చెబుతుంది స్టెల్లా.
పులిహార కంగ్రాట్స్
ఇప్పుడు మళ్లీ కొత్త వెజిటేబుల్స్ తేవాలా అని రాజ్ అంటాడు. అలా లేకుంటే నేను వంట చేయలేనని స్టెల్లా అంటుంది. ఇంట్లో వాళ్లు చూస్తున్నారని పరువు పోతుందని అలాగే అంటాడు రాజ్. ప్రకాశం వచ్చి డిష్ వాష్ చేసినట్లు చెబుతాడు. దాంతో మీరు ముగ్గురు బాగా పని చేస్తున్నారు. మీరే అసిస్టెంట్స్‌గా ఉండొచ్చుగా. ఇంకెవరు ఎందుకు అని స్టెల్లా అంటుంది. అసిస్టెంట్ పోస్ట్ వచ్చినందుకు కంగ్రాట్స్ పులిహార అని ధాన్యలక్ష్మీ అంటుంది.
తర్వాత ప్రకాశం, రాహుల్, రాజ్‌ను ముప్పుతిప్పలు పెట్టి వాళ్లతోనే వంట చేయిస్తుంది స్టెల్లా. ఈ వంటను డైనింగ్ టేబుల్‌పై పెట్టుకుని మీరే వడ్డించుకుని తినండి అని స్టెల్లా అంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. మేము మోసుకెళ్లి వడ్డించుకోవాలా అని రాజ్ అంటాడు. నువ్వే కొసరికొసరి వడ్డిస్తావని అనుకున్నా స్టెల్లా అని ప్రకాశం అంటాడు. కుకింగ్ సెషన్ మాత్రమే నేను చూసుకుంటాను. మిగతావి ఎవరి వైఫ్‌తో వారు వడ్డించుకుంటారు అని స్టెల్లా అంటుంది.
ఏంటీ నీకు చాకిరి అంతా చేసి, నువ్ గరిట తిప్పినందుకు నీకు లక్ష రూపాయలు ఇవ్వాలా. ఏం అవసరం లేదు అని రాజ్ అంటాడు. రేయ్ రాజ్. అలా అనంటే తను మానేస్తుంది అని రాజ్‌ను వద్దని అంటారు రాహుల్, ప్రకాశం. ఏదోటి ఏడవండి అని రాజ్ వెళ్లిపోతే.. కిచెన్‌లో స్టెల్లాతో రాహుల్, ప్రకాశం సెల్ఫీలు దిగుతుంటారు. అది చూసి మా కాపురాలు ముక్కలు చేయడానికి లక్ష రూపాయలు ఇచ్చి ఒకదాన్ని తీసుకొచ్చావా రాజ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది.
నోటితో తిందాంరా
మనం ఇప్పుడు తొందరపడకూడదు. ఏం చేయాలన్నది నేను చూసుకుంటాను అని స్వప్న అంటుంది. తర్వాత కిచెన్ నుంచి డైనింగ్ టేబుల్‌కు రాజ్ వంట మోసుకుని వెళ్తాడు. స్వప్న హెల్ప్ చేయొచ్చు కదా అని రాజ్ అంటే.. లక్ష పెట్టి పనిమనిషిని పెట్టావ్. నేనెందుకు చేస్తాను అని స్వప్న అంటుంది. రాజ్ వాటర్ మర్చిపోతాడు. ప్రకాశంను పిలిచి అక్కడ కళ్లతో తినింది చాలు ఇక్కడ నోటితో తిందాం రా అని రాజ్ అంటాడు.
తర్వాత అంతా తినడానికి కూర్చుంటారు. ఏరా వంట ఆ తిప్పులాడి చేసిందా. మీరు చేశారా అని ఇందిరాదేవి అంటుంది. వీళ్లతోనే వంట చేయించింది అని స్వప్న అంటుంది. ముగ్గురు అసిస్టెంట్లలా వెళ్లి మూర్ఖులు అయి వచ్చారన్నమాట అని సుభాష్ అంటాడు. మీతో వంట చేయించడానికి లక్ష పెట్టి తీసుకొచ్చావా అని సీతారామయ్య అంటాడు. స్టార్ హోటల్ చెఫ్‌లు అలాగే ఉంటారు. దొంగకోళ్లు పట్టేవాళ్లలా అన్ని చేయరు అని రాజ్ అంటాడు.
కరెక్ట్‌గా చెప్పావ్ చెర్రీస్. త్వరగా పదినిమిషాల్లో తినండి. లేకుంటే తర్వాత బాగుండవు. వేస్ట్ అవుతుంది. నేను వాడిన ఇంగ్రీడియన్స్ అలాంటివి. పదినిమిషాల్లో పాడైపోతాయ్ అని స్టెల్లా అంటుంది. ఇంత కష్టపడింది పది నిమిషాల్లో తినాలా అని రాజ్ షాక్ అవుతాడు. తర్వాత స్టెల్లాను దువ్వడం ఆపి తినండి. లేకుంటే పాచిపోతుంది అని స్వప్న అంటుంది. స్టార్ హోటల్‌లో ఇన్‌స్టాంట్‌గానే ఇస్తాం అని స్టెల్లా అంటుంది.
కాస్ట్‌లీ ఫుడ్
భార్యను పక్కన పెట్టి ఇల్లును హోటల్ చేశావ్ కదరా. పదినిమిషాల్లో పాచిపోయే ఆ తిండి నాకెందుకురా అని సీతారామయ్య అంటాడు. ఇలాంటి కాస్ట్‌లీ ఫుడ్ తినాలంటే అదృష్టం ఉండాలని రాజ్ అంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్