Brahmamudi November 11th Episode: బ్రహ్మముడి- ఆస్తి పంపకాలకు ఒప్పుకున్న సీతారామయ్య- రాజ్ కావ్యకు సీఈవో పోటీ పెట్టిన తాత-brahmamudi serial november 11th episode seetharamayya accepts dhanyalakshmi demand star maa brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi November 11th Episode: బ్రహ్మముడి- ఆస్తి పంపకాలకు ఒప్పుకున్న సీతారామయ్య- రాజ్ కావ్యకు సీఈవో పోటీ పెట్టిన తాత

Brahmamudi November 11th Episode: బ్రహ్మముడి- ఆస్తి పంపకాలకు ఒప్పుకున్న సీతారామయ్య- రాజ్ కావ్యకు సీఈవో పోటీ పెట్టిన తాత

Sanjiv Kumar HT Telugu
Nov 11, 2024 07:38 AM IST

Brahmamudi Serial November 11th Episode: బ్రహ్మముడి నవంబర్ 11 ఎపిసోడ్‌లో కల్యాణ్ చీదరించుకుని ఇంటి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఆస్తిని ముక్కలు చేసి ఎవరి వాటా వారికి పంచాలని ధాన్యలక్ష్మీ పెద్ద రాద్దాంతం చేస్తుంది. దానికి రుద్రాణి సపోర్ట్ చేస్తుంది. దాంతో ఆస్తి పంపకాలకు టైమ్ ఇవ్వమని సీతారామయ్య అంటాడు.

బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 11 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 11 ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో దుగ్గిరాల ఇంట్లో అప్పును ధాన్యలక్ష్మీ అవమానిస్తుంది. అందుకు నేను కూడా ఈ ఇంటికి చచ్చేదాకా రాకూడదని అనుకున్నాను అని కల్యాణ్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ప్రకాశం ఎమోషనల్ అవుతూ వచ్చి ఏంట్రా కల్యాణ్ నువ్ అనేది అని అంటాడు.

తెగదెంపులు చేసుకున్నట్లే

అవును నాన్నా.. మీరిద్దరు వచ్చి మమ్మల్ని పిలిస్తే అప్పును కోడలిగా ఒప్పుకున్నట్లే అనుకున్నాను. కానీ, ఇప్పుడే అమ్మ మనసులో ఏముందో పూర్తిగా అర్థమైంది. ఇంకెప్పుడు ఈ ఇంటికి నన్నెవరు పిలవద్దు అని కల్యాణ్ అంటాడు. అరేయ్ నేను నీ మంచి కోసమే, భవిష్యత్ కోసమే చెబుతున్నాను. దీంతో ఉంటే నువ్ బాగుపడలేవురా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అయితే అనామికలాగా నాతో కూడా తెగదెంపులు చేసుకోమ్మని బోధిస్తున్నారా అని అప్పు అంటుంది.

ఇప్పుడు చెబుతున్నాను. ఇంతమంది పెద్దల ముందు చెబుతున్నాను. నీ కోట్ల ఆస్తి వద్దు. మీరు వద్దు. మీ కొడుకు గొడ్డు కారం వేసి పెట్టిన అమృతంలా తింటాను కానీ, కల్యాణ్‌ను విడిచిపెట్టను. ఇది రెండోసారి నన్ను పిలిచి అవమానించడం. ఇంకోసారి మీ కొడుకు వస్తానన్న నేను రానివ్వను అని అప్పు అంటుంది. దాంతో అంతా అవాక్కవుతారు. రా కవి అని కల్యాణ్‌ను తీసుకెళ్తుంది అప్పు. సంతోషంగా ఉందా అని ధాన్యలక్ష్మీని అంటాడు ప్రకాశం.

చిన్న విషయానికి ఇంతపెద్ద రాద్దాంతం చేశావ్. ఇద్దరిని బాధపెట్టి పంపించావ్. వాడు ఇక చచ్చినా రాను అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తావే అని ప్రకాశం అంటాడు. వాడు మన కన్నకొడుకు అండి. సరే వాడు దేంతోనైనా పోనివ్వండి. కానీ, వాడికి న్యాయం జరగాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది. న్యాయం అంటే ఏంటీ, ఏం కావాలని కోరుకుంటున్నావ్ అని అపర్ణ అడుగుతుంది. ఆస్తిని ముక్కలు చేయండి అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో నివ్వెరపోతారు. రుద్రాణి మాత్రం సంతోషిస్తుంది.

ఇందిరాదేవి ఫైర్

నా కొడుకు వాటా వాడికివ్వండి అని ధాన్యలక్ష్మీ అంటే.. ఏం మాట్లాడుతున్నావే నువ్వు. నోరు మూసుకోని వెళ్లు అని ప్రకాశం అంటాడు. ఇంకా నోరు మూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతమంది ఆస్తిని అనుభవిస్తుంటే నా కొడుకు ఆటో నడుపుకుంటాడు. వాడికి రావాల్సిన ఆస్తి వాడికి వస్తే దర్జాగా బతుకుతాడు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దానికి నోర్మూయ్ అని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. నోర్మూయ్ ధాన్యలక్ష్మీ. ఏం పిల్లల ఆటలు అనుకున్నావా. ఇది ఉమ్మడి ఆస్తి. దీన్ని ముక్కలు చేయమనే అధికారం ఎవరికీ లేదని అంటుంది.

అవునమ్మా.. నువ్ ఒప్పుకోవు. ఇంట్లో ఎవరు ఒప్పుకోరు. రాజ్ మాత్రం వారసుడిగా బతకలా. కల్యాణ్ మాత్రం పేదవాడిలా బతకలా. ఎందుకింత వివక్షత నీకు. ధాన్యలక్ష్మీ మాట్లాడినదాంట్లో తప్పులేదు. ఆస్తిని ముక్కలు చేసి ఎవరి వాటా వారికివ్వండి. కల్యాణ్, రాహుల్ ఎవరి దారిలో వారు బతుకుతారు అని రుద్రాణి అంటుంది. ఓహో.. రాహుల్‌కు కూడా కల్యాణ్‌తోపాటు ఆస్తి పంచాలా. అదా నీ ఆలోచన. అందుకా నువ్ ధాన్యలక్ష్మీని ఎగదోసేది అని ఇందిరాదేవి అంటుంది.

అసలు నువ్వేవరు. నీకు ఈ ఇంటికి ఏం సంబంధం, నీకు నీ కొడుక్కి ఏం సంబంధం. ఇన్నాళ్లు తల్లికొడుకులను పోషించిందే ఎక్కువ. ఇప్పుడు నీ అసలు బుద్ధి బయటపడింది. ఆస్తిలో వాటా అడిగేదాకా వచ్చావంటే మెడపట్టి గెంటేస్తా. నా ఇంటి ఆస్తి నుంచి నీకు చిల్లి గవ్వ కూడా రాదు. పో అవతలికి అని ఇందిరాదేవి అంటుంది. ఏంటీ చిల్లిగవ్వ రాదా. నన్ను మీరు పెంచుకోలేదా. ఇన్నాళ్లు మిమ్మల్నే నమ్ముకున్నాను. ఇప్పుడు చెబుతున్నాను. ఆస్తిని ముక్కలు చేయాల్సి వస్తే ఆడబిడ్డగా నాకు ఓ ముక్క ఇవ్వాల్సిందే అని రుద్రాణి తెగేసి చెబుతుంది.

ఇంట్లో ఉండను

చెరొక చిప్ప చేతికి ఇస్తాం అడుక్కుతినండి. మధ్యలో నీ గొడవ ఏంటీ. ఆపు అని ప్రకాశం అంటుంది. ఏంటీ ఇదంతా. వాడిని ఇంటికి రమ్మని ఒప్పుకున్నాం. వాడు ధాన్యలక్ష్మీ నోరుకు భయపడి రానంటే ఆస్తిని ఎందుకు పంచాలి అని సుభాష్ అంటాడు. ఇలాగే నా నోరు మూయించండి. ఎలాగైనా ఆస్తిని సమ భాగాలుగా పంచాల్సిందే. కల్యాణ్ వాటా కల్యాణ్‌కు ఇవ్వాల్సిందే. లేకుంటే నేను కూడా ఇంట్లో ఉండను. బయటకు వెళ్లి నా బతుకు బతుకుతాను అని ధాన్యలక్ష్మీ అంటుంది.

వెళ్లు.. వెళ్లవే.. సంతోషంగా వెళ్లు. నీకు చాతకాకపోతే నేనే మెడపట్టి గెంటేస్తాను అని ప్రకాశం అంటాడు. తప్పు. ఏం మాట్లాడుతున్నావురా. మనం ప్రయాణికులం కాదు. కుటుంబం సభ్యులం. కొడుకు దీనస్థితి చూసి తల్లిగా ధాన్యలక్ష్మీ మాట్లాడటంలో తప్పులేదు. టీవీలో చూశావుగా. చీలికలు మొదలు అయినట్లు అంటున్నారు. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాల్సిందే అని సీతారామయ్య అంటాడు. ఆస్తిని ముక్కలు చేయడం అంత సులువా అని ప్రకాశం అంటాడు.

మీరు ఆపండి. మిమ్మల్ని నమ్ముకుంటే నా కొడుకు ఆటో డ్రైవర్‌లాగే బతకాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది. చిన్నత్తయ్య ఎందుకు మీకు ఇలాంటి బుద్ధి పుట్టింది. రక్తసంబంధం కాదనుకుని మీ కొడుకు ఎంతదూరం బయట ఉంటాడు అని కావ్య అంటుంది. నువ్వేవరు నాకు చెప్పడానికి, భర్త, అత్తిల్లు వదులుకుని వెళ్లినదానివి నీకేం హక్కు ఉందని ధాన్యలక్మీ అంటుంది. దాంతో అపర్ణ వారిస్తుంది. బంధాలను ముక్కలు చేయాలనుకున్నప్పుడే అర్థమైంది నీ బుద్ది. నువ్ ఈ కుటుంబాన్ని ఎంత దూరం తీసుకెళ్తావో చూసేందుకు పెద్దవాళ్లు ఉన్నారు అని అపర్ణ అంటుంది.

ఆస్తి పంచుతాడా

అది చూస్తాను. నా కొడుక్కి న్యాయం జరక్కపోతే ఈ ఇంటికి ఒకే కోడలు ఉంటుంది. నేను ఉండను అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇవన్నీ ఇప్పటికిప్పుడు పరిష్కారం కావు. నేను ఆలోచించి పరిష్కరిస్తాను అని సీతారామయ్య అంటుంది. సరే మావయ్య గారు అని లోపలికి వెళ్తుంది ధాన్యలక్ష్మీ. కట్ చేస్తే మరోవైపు అనామిక తెగ నవ్వుతుంది. కంగ్రాట్స్ డార్లింగ్, అనుకుంది అనుకున్నట్లు సాధించావ్. కానీ, ఆ ముసలోడు ఆస్తి పంచుతాడంటావా అని సామంత్ అంటాడు.

చచ్చినా పంచడు. కాబట్టి నా మాజీ అత్త ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మొదలు అవుతుంది అసలైన రణరంగం. నేను ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టుకు దుగ్గిరాల కుటుంబం సమాధానం చెప్పాలి అని అనామిక అంటుంది. మరి ఇందులో నాకు వచ్చే లాభం ఏంటీ అని సామంత్ అంటాడు. ఇంత తెలివితక్కువగా మాట్లాడతావేంటీ సామంత్. దాంతో ఆ కంపెనీ పడిపోతుంది. షేర్లు పడిపోతాయి. అప్పుడు నువ్వే ఆ కంపెనీనే తక్కువ ధరకు కొనొచ్చు అని అనామిక అంటుంది.

అప్పుడు నేనే నెంబర్ వన్ అని సామంత్ అంటాడు. మరోవైపు ఇందుకే ఆటో నడిపొద్దు అన్నాను అని అప్పు అంటుంది. నువ్ కూడా నన్నే తప్పుపడుతున్నావా అని కల్యాణ్ అంటాడు. చెప్పింది అర్థం చేసుకో. నేను పిజ్జా డెలీవరీ చేస్తే మా ఇంట్లోవాళ్లకు వచ్చే అవమానం ఏం లేదు. నేను మొదటి నుంచి అదే చేశాను. కానీ, కోట్ల వారసుడిగా ఉన్న నువ్ ఆటో నడిపితే ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు. ఇంకోదారి లేకుంటే ఆటో నడపొచ్చు అంతేకానీ గెలవడం కోసం ఫ్యామిలీ పరువు తీస్తున్నావని తెలిసినప్పుడు అదే చేస్తావా అని అప్పు అంటుంది.

అది నా అత్తిల్లే

ఆటో నడపడం ఆపి రైటర్‌గానే చేయమని అప్పు అంటుంది. మరి తినడానికి తిండి ఎలాగా అని కల్యాణ్ అంటాడు. నేను ఉన్నా కదా అని అప్పు అంటుంది. అంటే దీనికోసం నీ గోల్ వదిలేస్తావా. వాళ్లు అన్నారని నువ్ కూడా అనడం బాగా లేదు. ఎవరేం అనుకున్నా నేను ఆటో నడుపుతున్నా. నువ్ పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నావ్ అని కల్యాణ్ చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు కావ్య ఇంట్లో కల్యాణ్ గురించి చర్చ జరుగుతుంది.

నేను ఏదో ఒక పరిష్కారం చూడకపోతే ఆస్తులు పంచమంటారు. ఎవరికి వారు వేరే కాపురం పెడతారు అని కావ్య అంటుంది. అల్లుడు గారు జోక్యం చేసుకోవద్దని చెప్పినప్పుడు నువ్ చేస్తే తప్పు అవుతుంది కదా అని కృష్ణమూర్తి అంటాడు. ఆయన వెళ్లిపోమ్మన్నంత మాత్రానా మా బంధం పోతుందా. ఆయన కాదన్నంత మాత్రానా నేను ఆ ఇంటి కోడలిని కాకుండా పోతానా. ఇప్పటికీ ఎప్పటికీ అది నా అత్తారిల్లే నేను ఆ ఇంటి కోడలినే. ఆ ఇంట్లో ఉన్న ప్రతి మనిషి నా మనిషే, అది నా సమస్య. దాన్ని నేనే పరిష్కరిస్తాను అని తేల్చి చెప్పి వెళ్లిపోతుంది కావ్య.

మరోవైపు రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఆలోచిస్తుంటారు. ఇన్నాళ్లకు నేను కోరుకుంది ధాన్యలక్ష్మీ చేస్తుంది. తనను వెనుకడుగు వేయనివ్వొద్దు అని అనుకుంటుంది రుద్రాణి. మా నాన్న ఆస్తి ముక్కలు చేసి పంచుతాడని అనుకుంటున్నావా అని రుద్రాణి అంటే.. అలా చేయకుంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా. ఇన్ని రోజులు వేరు. నా కొడుకు ఇలా ఉన్నాడని తెలిసి మౌనంగా ఉంటే తల్లిగా నేను చచ్చిపోయినట్లే అని ధాన్యలక్ష్మీ అంటుంది.

కావ్య అడ్డుపడుతుంది

దాంతో రుద్రాణి మరింత రెచ్చగొడుతుంది. ఇది నాకు కష్టం కాదు. అవమానం. అందరూ ఆస్తిని దర్జాగా అనుభవిస్తుంటే నా కొడుకు అలా ఉండాలా అని ధాన్యలక్ష్మీ అంటుంది. నేను కావ్య అడుగుపెట్టినప్పుడే వాటా అడిగితే నన్నే విలన్‌గా చూశారు అని రుద్రాణి అంటుంది. కానీ, ఇది జరగకుండా కావ్య అడ్డుపడుతుందని చెబుతున్నాను అని రుద్రాణి అంటుంది.

మరోవైపు జగదీష్ చంద్రప్రకాశ్ గారి ప్రాజెక్ట్‌ను ఇద్దరు విడివిడిగా మనకు వచ్చేలా చేయండి. ఎవరు అయితే టైమ్‌కు పూర్తి చేసి మెప్పించి. అది మనకు వచ్చేలా చేస్తారో వారే కంపెనీకి సీఈఓగా ఉంటారు అని రాజ్, కావ్యకు పోటీ పెడతాడు సీతారామయ్య. నువ్ గనుక ఓడిపోతే కావ్యను భార్యగా మనస్ఫూర్తిగా అంగీకరించి ఇంటికి తీసుకురావాలి అని రాజ్‌కు మెలిక పెడతాడు సీతారామయ్య. దాంతో రాజ్, కావ్య ఇద్దరూ షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner