Brahmamudi November 16th Episode: బ్రహ్మముడి- శాపంగా మారిన తాతయ్య సలహా- కావ్య గదిలో రాజ్ దొంగతనం- కల్యాణ్‌కు చిన్నిల్లు!-brahmamudi serial november 16th episode seetharamayya advice to jagadeesh raj as thief star maa brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi November 16th Episode: బ్రహ్మముడి- శాపంగా మారిన తాతయ్య సలహా- కావ్య గదిలో రాజ్ దొంగతనం- కల్యాణ్‌కు చిన్నిల్లు!

Brahmamudi November 16th Episode: బ్రహ్మముడి- శాపంగా మారిన తాతయ్య సలహా- కావ్య గదిలో రాజ్ దొంగతనం- కల్యాణ్‌కు చిన్నిల్లు!

Sanjiv Kumar HT Telugu
Nov 16, 2024 07:36 AM IST

Brahmamudi Serial November 16th Episode: బ్రహ్మముడి నవంబర్ 16 ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో కావ్య రాజ్ గొడవపడుతుంటే జగదీష్ చూసి నిలదీస్తాడు. దాంతో కావ్య నడుముపై చేయి వేసి రొమాన్స్ చేస్తాడు రాజ్. దాంతో అందరూ తలదించుకుంటారు. అనంతరం సీతారామయ్యను జగదీష్ కలిసి రాజ్ కావ్య రొమాన్స్ గురించి చెబుతాడు.

బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 16 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 16 ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఆస్తి పంపకాలు జరగట్లేదని ధాన్యలక్ష్మీ బాధపడుతుందని దుగ్గిరాల ఫ్యామిలీ మాట్లాడుకుంటారు. ధాన్యలక్ష్మీకి సపోర్ట్‌గా మాట్లాడిన రుద్రాణికి స్వప్న పంచ్‌లు వేస్తుంది. నీ భార్య అలిగి భోజనం చేయకుండా ఉంటే ఎలా ఉన్నావ్ అని ప్రకాశంను రుద్రాణి అంటుంది.

చాటుగా వస్తుంది

అది అలిగిన ప్రతిసారి ఓదార్చాలి అంటే కొండమీది కోతిని కూడా తీసుకురమ్మంటుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తాం. నువ్ తిను అని ప్రకాశం అంటాడు. అరేయ్ అలా అంటావేంట్రా. కోడలు బాధపడుతుంటే ఎలా. వెళ్లి తీసుకురా అని సీతారామయ్య వారిస్తాడు. దానిగురించి నీకు తెలియదేమో గానీ నాకు తెలుసు నాన్న. అది ఆకలికి తట్టుకోలేదు. ఏ అర్థరాత్రో వచ్చి చాటుగా తింటుంది. ఎన్నిసార్లు చూడలేదు. శాంత గిన్నెలు కడగకుండా అలాగే ఉంచు అని ప్రకాశం అంటాడు.

దాంతో అంతా నవ్వుతారు. నీ భార్యను నువ్ అర్థం చేసుకున్నట్లు ఎవరు అర్థం చేసుకోలేదురా అని ఇందిరాదేవి అంటుంది. అది ఎన్ని తిట్టిన అక్కడే మర్చిపోతానుగా. అందుకే ఇంత ప్రశాంతంగా ఉన్నాను అని ప్రకాశం అంటాడు. ఆ ధాన్యలక్ష్మీని అయితే రెచ్చగొట్టగలిగాను కానీ, వీళ్లను రెచ్చగొట్టలేకపోతున్నా. లాభం లేదు ఆ ధాన్యలక్ష్మీకి డోస్ పెంచాలి. లేకపోతే వీళ్లు ఇలా కిల కిలా నవ్వుకుంటూ ఆస్తి పంచడం మర్చిపోతారు అని రుద్రాణి అనుకుంటుంది.

మరోవైపు అందరూ డిజైన్స్ ఇవ్వమని కావ్య అంటుంది. ఇంతలో రాజ్ వచ్చి సెటైర్లు వేస్తుంటాడు. అందరిని వెళ్లమంటాడు. కానీ, కావ్య అడ్డుకుంటుంది. ఇక్కడ కూర్చుంటే కుర్చీలు ఉండవు అని రాజ్ బెదిరిస్తాడు. కానీ, కావ్య మాత్రం కూర్చోమని చెబుతుంది. సీఈఓగా చెబుతున్నాను. మిమ్మల్ని కూర్చోమని ఆర్డర్ వేస్తున్నాను అని కావ్య అంటుంది. నేను దుగ్గిరాల అని రాజ్ అనబోతుంటే ఏంటీ మేనేజర్ అని కావ్య సెటైర్ వేస్తుంది.

డీల్ క్యాన్సిల్ చేసుకుంటే

కంత్రీ కళావతి నిన్ను అని రాజ్ అంటే.. ఏంటీ.. ఏంటీ అని ఇద్దరూ వాదించుకుంటారు. ఇంతలో జగదీశ్ వచ్చి నేను విన్నది నిజమే అయితే. మీరిద్దరు విడిపోయారు అని. మీ గొడవలతో కంపెనీ గురించి, కాంట్రాక్ట్స్ గురించి పట్టించుకోవట్లేదని మార్కెట్‌లో అందరూ అనుకుంటున్నారు. విడిపోయిన భార్యాభర్తలు కలిసి మరింత పాడు చేస్తున్నారు అందరూ అనుకుంటున్నారు అని జగదీష్ అంటాడు. ఈయన డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడంటే కళావతి సీఈఓ సీట్‌లో కూర్చుని ఆడేసుకుంటుంది అని రాజ్ అనుకుంటాడు.

తెగ నవ్వుతూ విచిత్రంగా ప్రవరిస్తాడు రాజ్. మేడమ్ సర్‌కి డీల్ పోతుందన్న భయంతో మతిస్థిమితం తప్పినట్లుంది అని శ్రుతి అంటుంది. దాంతో షటప్ అని కావ్య అరుస్తుంది. నన్నా అని రాజ్ అంటాడు. మీరు కాదండి. మీరు నవ్వండి. కానీ, ఎందుకు నవ్వుతున్నారో జగదీష్‌ గారికి చెప్పి నవ్వండి అని కావ్య అంటుంది. విడిపోయిన భార్యాభర్తలు ఒక్కచోటే ఎందుకు పని చేస్తారు. ఒక్క ప్రాజెక్ట్ కోసం ఎందుకు పనిచేస్తారు అని రాజ్ అంటాడు.

అంటే, నేను చూసింది అంతా అబద్ధం. మీరు గొడవపడట్లేదా అని జగదీష్ అంటాడు. అవును, తాడు, పాము అంటూ పిచ్చిగా వాగిన రాజ్ మేము గొడవపడట్లేదు. డిజైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం అని రాజ్ అంటాడు. దీన్ని డిస్కషన్ అంటారా అని జగదీష్ అంటే.. తలకాయలేనోడు ఎన్నో అనుకుంటాడు సార్ అని రాజ్ అంటాడు. దాంతో షాక్ అయిన జగదీష్ నాకు తలకాయ లేదంటావా అని అంటాడు. ఛీ ఛీ మీ గురించి కాదు సర్ అని కవర్ చేస్తాడు రాజ్.

డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి

ఇది కొత్త టెక్నిక్ సార్. మేము విడిపోలేదు. మేము విడిపోయి ఒక టీమ్‌గా మీ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాం అని రాజ్ అంటాడు. ఏమో నాకు చాలా గందరగోళంగా ఉంది. చెప్పేదానికి చూసేదానికి సంబంధం లేకుండా ఉందని జగదీష్ అంటాడు. ఇప్పుడు ఒక టీమ్‌గా చేస్తే కొన్ని డిజైన్స్ మాత్రమే వస్తాయి. కానీ, రెండు టీమ్స్‌గా చేస్తే చాలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అని రాజ్ అంటాడు. దాంతో ఆలోచనలో పడతాడు జగదీష్. నువ్ కూడా ఏమైనా చెప్పు అని కావ్య నడుము పట్టుకుని అడుగుతాడు రాజ్.

అలా నడుముపై చేయి వేసి అడగవే.. ఏదోటి చెప్పవే అంటూ అంటాడు రాజ్. కానీ, కావ్య మాత్రం షాక్ అయి సైలెంట్‌గా ఉంటుంది. కావ్య నడుమును రాజ్ తాకడం చూసి స్టాఫ్ అంతా సిగ్గుతో పక్కకు తల తిప్పుకుంటారు. నువ్వేం మాట్లాడవేంటీ అని రాజ్ అంటే.. నడుముపై చేయి వేస్తే మాటలు ఉండవు అని కావ్య అంటుంది. దాంతో దెబ్బకు రాజ్ చేయి తీస్తాడు. అలా ఆఫీస్‌లో అందరిముందే రాజ్, కావ్య రొమాన్స్ నడుస్తుంది.

మేము రెండు టీమ్స్‌గా విడిపోయి కొట్టుకుని, తిట్టుకుని మంచి అవుట్ పుట్ ఇచ్చేది సీఈఓ సీటు కోసమే అని అసలు విషయం బయటపెడుతుంది కావ్య. దాంతో జగదీష్ మరింత షాక్ అవుతాడు. దాంతో నవ్వుతూ సీఈవోగా కంపెనీ బాధ్యత నిలబెట్టాలి కదా అని రాజ్ అంటాడు. ఇంతలో కావ్యను కావాలని పడేసినట్లు చేసి పట్టుకుంటాడు రాజ్. అలా ఇద్దరు చూసుకుంటారు. అంతా పక్కకు చూస్తుంటారు. నీకేమైనా అయిందా అని కావాలనే ప్రేమ నటిస్తాడు రాజ్.

నటిస్తే తప్పు లేదు

ప్రపంచం ఏమైనా సరే నా భార్యను కాపాడుకోవాలనుకుని పట్టుకున్నాను అని రాజ్ అంటాడ.ు అది చూసి నమ్ముతాడు జగదీష్. మీరు ఏదోటి చేసి మంచి డిజైన్స్ ఇవ్వండి. జరిగింది చూసి డీల్ క్యాన్సిల్ చేయాలని అనుకున్నాను. బాగా చర్చించుకోండి అని జగదీష్ వెళ్లిపోతాడు. హమ్మయ్యా.. డీల్ క్యాన్సిల్ అయ్యేది. ఈ పనికిమాలిన టీమ్‌ను పంపించి మనల్ని కూర్చోమనండి. జరుగు అని కావ్యపై చిరాకు పడుతూ వెళ్లిపోతాడు.

అంతా షాక్ అవుతారు. తర్వాత రాజ్ దగ్గరికి వెళ్లి కావ్య నిలదీస్తుంది. నడుముపై చేయి వేయడమేంటీ. డీల్ కోసం అందరిముందు అలా చేయి వేస్తారా అని గొడవపడుతుంది కావ్య. రాజ్ వివరణ ఇస్తుంటాడు. నమ్మించడం కోసం నటిస్తారా. తప్పు కాదా అని కావ్య అంటుంది. ఏ కాదు అని రాజ్ అంటాడు. నమ్మించడం కోసం నటిస్తే తప్పు లేదా. మరి ఆరోజు మా అమ్మ క్యాన్సర్ అని నటిస్తే ఎందుకు అంతా ఎగిరిపడ్డారు. మీరు తప్పు చేయకుంటే మా అమ్మ కూడా తప్పు చేయనట్లే అని కావ్య అంటుంది.

అది వేరు ఇది వేరు. మీ అమ్మ నన్ను మోసం చేసింది. నువ్ చేశావ్. అది ఇది ఒక్కటి కాదు అని రాజ్ అంటాడు. ఎందుకు కాదు. రెండు ఒక్కటే. మనల్ని కలపడానికి మా అమ్మ నటించింది అని కావ్య అంటుంది. నువ్ ఈ డీల్ పోవాలని అనుకుంటున్నావ్ కదా. డీల్ పోతే సీఈఓ సీట్‌లో కూర్చోవచ్చు అని చూస్తున్నావ్. నా కంఠంలో గోల్డ్ చైన్ ఉన్నంతకాలం అది జరగదని రాజ్ అంటాడు. ఎప్పటికైనా స్వరాజ్ గ్రూప్‌కు ఎండీనే నేనే, సీఈవో నేనే అని రాజ్ అంటాడు.

కావ్యపై చేతులు వేయడాలు

మిస్టర్ డ్యామేజర్ ఇప్పటివరకు నేను అనుకోలేదు. కానీ, ఇప్పుడు చెబుతున్నాను. మిమ్మల్ని ఓడించేవరకు వదిలిపెట్టను. నా కంఠంలో మంగళసూత్రం ఉన్నంతవరకు మీరు అనుకుందని జరగనివ్వను అని ఛాలెంజ్ చేసి వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు సీతారామయ్యను జగదీష్ కలుస్తాడు. నువ్ చెబితే నమ్మలేదు కానీ. నీ మనవడు మాములోడు కాదు. నన్ను నమ్మించడానికి కావ్యపై చేతులు వేయడాలు, పట్టుకోవడాలు. అన్ని నీ పోలికలే అని జగదీష్ అంటాడు.

స్ట్రిక్‌గా ఉండి రమ్మంటే కాంప్రమైజ్ అయి వచ్చావా. ఇంకా భయపెట్టాల్సింది అని సీతారామయ్య అంటాడు. నేను ఎంత భయపెట్టాలని చూసిన రాజ్ మాత్రం తగ్గలేదు. కావ్య అయితే జీవించేసింది అని జగదీష్ అంటాడు. లేదురా. కావ్య నటించదు. తనకు నిజంగానే భర్తతో జీవించాలని ఉందని సీతారామయ్య అంటాడు. మరెందుకు అంతమంచి భార్యను రాజ్ దూరం పెడుతున్నాడని జగదీష్ అడుగుతాడు. ఎందులోను తగ్గకూడదని చిన్నప్పటినుంచి రాజ్‌కు చెప్పాను (సలహా). ఇప్పుడు అదే వారికి శాపంగా మారిందని సీతారామయ్య అంటాడు.

ఆ సూత్రాన్ని కాపురంలో కూడా పాటిస్తున్నాడు. ఇప్పుడు నువ్ వచ్చావ్‌గా. నీ కాంట్రాక్ట్ తర్వాత వాళ్లు కలిస్తే చాలు అని సీతారామయ్య అంటాడు. అయినా, నీ కంపెనీకి బయట శత్రువులు చాలా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి. నా దగ్గరికి అనామిక వచ్చింది కాబట్టి తెలిసింది. కానీ, రానివాళ్లు ఎంతమంది ఉన్నారో అని జగదీష్ అంటాడు. నా మనవడు, మనవరాలు కలిస్తే నా కంపెనీని ఎవరు టచ్ చేయలేరురా అని సీతారామయ్య అంటాడు. అది జరుగుతుంది లేరా. పదా లోపల పెగ్ వేద్దాం అని జగదీష్ అంటాడు.

చిన్నిల్లు ఏమైనా ఉందా

అన్ని మానేసానురా. ఇప్పుడు మన వయసేంటీ అని సీతారామయ్య అంటాడు. ఇప్పుడు నువ్ ఆరోగ్యంగా ఉండి ఒలంపిక్స్‌కు వెళ్లాల. పద అని తీసుకెళ్తాడు జగదీష్. మరోవైపు పొట్టి నీకు గుడ్ న్యూస్ అని కల్యాణఅ అంటే.. నువ్ తండ్రివి కాబోతున్నావా అని అప్పు అంటుంది. నీ ప్రమేయం లేకుండా ఎలా అవుతాను అని కల్యాణ్ అంటాడు. ఏమో ఎవరికి తెలుసు. మీ పెదనాన్న లాగా చిన్నిల్లు ఏమైనా ఉందేమో అని అప్పు అంటుంది.

దాంతో అప్పు చెవి మెలిపెట్టిన కల్యాణ్ మీ ఇంట్లో అందరూ ఇంతేనా. ఇలా దెప్పిపొడుస్తారు. మా వదిన కూడా ఇలాగే అని కల్యాణ్ అంటాడు. ఊరికే అన్నానులే. గుడ్ న్యూస్ ఏంటో చెప్పమని అప్పు అంటుంది. చెప్పను. చిన్నిల్లు అన్నావ్ కదా దానికి చెబుతాను అని కల్యాణ్ అంటాడు. లేకుంటే పాతిల్లుకు చెప్పు. నీ మాజీ భార్య అనామిక ఉన్న ఇల్లు అని అప్పు అంటుంది. నేను గుడ్ న్యూస్ చెప్పాలని వస్తే అలాంటిదాన్ని గుర్తుచేసి మూడ్ అంతా పాడుచేశావ్ అని కల్యాణ్ వెళ్లిపోతాడు.

దాంతో కల్యాణ్‌ను అప్పు బతిమిలాడుతుంది. కవిగారి మూడ్ ఎలా సెట్ చేయాలో నాకు బాగా తెలుసు అని రొమాంటిక్‌గా చూస్తూ కల్యాణ్ చెంపపై ముద్దు పెడుతుంది అప్పు. దాంతో కల్యాణ్ తెగ సంతోషపడతాడు. నాకు లక్ష్మీకాంత్ దగ్గర అసిస్టెంట్‌గా ఉద్యోగం దొరికిందని కల్యాణ్ చెబుతాడు. అయితే ఆటో నడపవా అని అప్పు అంటుంది. లేదు. ఆయన దగ్గరే పనిచేస్తాను. ఆయనే పాటలు రాసినందుకు మనీ ఇస్తానన్నారు అని కల్యాణ్ అంటాడు.

రాజ్ దొంగతనం

త్వరలోనే అసిస్టెంట్ రైటర్‌గా చేస్తూ పరిచయాలు పెంచుకుని ప్రొడ్యూసర్స్‌ను కలుస్తావ్. అక్కడ వాళ్లు కూడా కలుస్తారు. మన ఫ్యామిలీ అంతా కలిసిపోతాం అని అప్పు అంటుంది. తర్వాత ఆ రైటర్ చాలా కమర్షియల్ అన్నావ్. అంతా ఈజీగా ఎలా పెట్టుకున్నాడు. నువ్వేమైనా అగ్రిమెంట్ చేశావా అని అప్పు అడుగుతుంది. దాంతో కల్యాణ్ భయపడిపోతాడు. అగ్రిమెంట్ గురించి చెప్పకూడదని ఫిక్స్ అవుతాడు. అప్పు అడుగుతుంటే ఏం లేదని భోజనానికి తీసుకెళ్తాడు.

మరోవైపు ఆఫీస్‌లో కావ్య ఛాంబర్‌లో డిజైన్స్ ఫొటోలు తీసుకుంటాడు. ఇది దొంగతనం కాదు తస్కరించుట అని రాజ్ అంటాడు. ఇంతలో హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను అని ఛాంబర్‌లోకి కావ్య వస్తుంది. దాంతో టేబుల్ కింద దాక్కుంటాడు రాజ్. డిజైన్స్ చూసి ఇక్కడికి ఎవరో వచ్చారు అని కావ్య అనుమానించి ముందుకు నడుస్తుంది. దాంతో రాజ్ భయపడిపోతాడు. అక్కడితే నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner