Gunde Ninda Gudi Gantalu Today Episode: బెడిసికొట్టిన రోహిణి ప్లాన్- సొంత కారు కొనిచ్చిన సత్యం- మీనాపై చేయెత్తిన బాలు
Gunde Ninda Gudi Gantalu Serial December 5 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 5 ఎపిసోడ్‌లో వడ్డీ వ్యాపారిని మీనా అడగడం చూసిన రోహిణి ఇరికించాలని అనుకుంటుంది. సత్యంతో ఇంట్లో పంచాయితీ పెడుతుంది. కానీ, నిజం తెలిసి బాలు, మీనాలకు సపోర్ట్ చేస్తాడు సత్యం. మీనాపై చేయి ఎత్తుతాడు బాలు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గుడికి అని చెప్పి మీనా వెళ్తుంది. ట్రిప్ ఉందని, వేరే అతనికి డ్రైవర్‌గా చేరానని చెప్పి బాలు వెళ్లిపోతాడు. రోజు గుడికి వెళ్తుంది. నాకు ఏదో అనుమానంగా ఉంది అని ప్రభావతి అంటుంది. నీకు అనుమానం లేనిది ఎప్పుడు అని సత్యం తిడతాడు.
ఫేసియల్ చేయడానికి
రోహిణి ఒకరి ఇంటికి మేకప్ వేయడానికి వెళ్తుంది. వడ్డీ వ్యాపారి ఇంటికి మీనా వెళ్తుంది. వచ్చింది ఎవరో తెలియకుండా లోపలికి రానిస్తాడు వడ్డీ వ్యాపారి. ఏమ్మా నీతో మాట్లాడను అని చెప్పాను కదా. ఎందుకు వచ్చావ్ అని వడ్డీ వ్యాపారి అంటాడు. అది అని మీనా చెప్పబోతుంటే అక్కడ రోహిణని చూస్తుంది. రోహిణి వడ్డీ వ్యాపారి భార్యకు ఫేసియల్ చేయడానికి వెళ్తుంది.
రోహిణిని చూసిన మీనా షాక్ అవుతుంది. దాంతో సైలెంట్‌గా ఉండిపోతుంది. మీ ఆయనకు కారు ఇవ్వనని చెప్పాను కదా. పని లేకుండా ఖాలీగా ఉంటే తెలుస్తుంది అని అతను అంటాడు. సర్ అలా అనకండి. ఆయన చాలా కష్టపడుతున్నారు. ఎక్కడికి వెళ్లిన అవమానాలు పడుతున్నాడు అని మీనా అంటుంది. హో బాలుకు ఇప్పుడు పని లేదా. కారు ఓనర్ తీసుకెళ్లింది అబద్ధమా. ఈ మాత్రం హింట్ చాలు ఆ బాలు సంగతి చెబుతా అని రోహిణి అనుకుంటుంది.
వాడు ఏం చేశాడో తెలుసా. నిన్ను చూస్తే జాలి కలుగుతుంది. కానీ మీ ఆయనను చూస్తేనే ఒళ్లు మండిపోతుంది. వాడికి బాధ్యత లేదు. నాకు అద్దె ఇస్తే సరిపోదు. నేనంటే భయం ఉండాలి. నన్ను కాలర్ పట్టుకుని కొట్టడానికి వస్తే నా వాళ్ల ముందు భయం ఏముంటుంది అని వడ్డీ వ్యాపారి అంటాడు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ, ఆయన చేసింది తప్పే. ఆయనకు బదులు నేను క్షమాపణ చెబుతున్నాను అని మీనా అంటుంది.
దొరికిపోయారు ఇద్దరు
నేను మీ క్షమాపణ కోరట్లేదు. కానీ, మీ ఆయన్ను నా ఆఫీస్‌కు వచ్చి అందరిముందు క్షమాపణ చెప్పమను అని వడ్డీ వ్యాపారి అంటాడు. సర్ అది అని మీనా అంటే.. నువ్ మీ ఇంటికెళ్లి మీ ఆయన నువ్ బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి అని వడ్డీ వ్యాపారి వెళ్లిపోతాడు. దాంతో మీనా మౌనంగా వెళ్లిపోతుంది. దొరికిపోయారు ఇద్దరు. చెబుతా మీ పని అని రోహిణి అనుకుంటుంది. కట్ చేస్తే ఇంట్లో సత్యంతో పంచాయితీ పెడతారు.
వడ్డీ వ్యాపారి ఇంట్లో జరిగింది రోహిణి చెబుతుంది. బాలుకు ఉద్యోగం ఏం లేదు. కారు వెనక్కి ఇవ్వమని అతన్ని బతిమిలాడుకుంటుంది అని రోహిణి అంటుంది. కారు నడపడానికి అని చెప్పి ఏ పార్క్‌లోనో తిరిగి వస్తున్నాడు అని ప్రభావతి అంటే.. పార్క్‌లో ఎందుకు ఉంటాడు. బార్‌లో తాగుతూ ఉంటాడు. చూశావా నాన్న భార్యాభర్తలిద్దరు అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు అని మనోజ్ అంటాడు. ఇన్నిరోజులు మనోజ్ మోసం చేశాడని ఇన్సల్ట్ చేసేవారు. మరి ఇదేంటీ మోసం కాదా అని రోహిణి అంటుంది.
నేను ఆఫీస్‌కు వెళ్తుంటే నిజంగానే వెళ్తున్నావా అని అడిగాడు. ఇప్పుడు నిన్నేమనాలిరా అని మనోజ్ అంటే.. అడిగేవాళ్లు అడుగుతారు. నువ్వేందుకు ఆవేశపడుతున్నావ్ నాన్నా మనోజ్ అని సెటైర్లు వేస్తుంది ప్రభావతి. ఎన్నోసార్లు నన్ను మనోజ్‌ను అవమానించాడు. మరి ఇప్పుడు ఈ మోసానికి ఏం బదులు చెబుతాడు అని రోహిణి అంటాడు. ఆయనకు ఎవరిని మోసం చేసి బతకాల్సిన అవసరం లేదు. కారు లేదు ఖాళీగా ఉన్నారు. అంతవరకే నీకు తెలుసు. ఇంకేం నోరుజారిన నేను ఊరుకోను అని మీనా అంటుంది.
తినడానికి లెక్కలు
రోహిణి కాస్మోటిక్స్‌కు లెక్కలు చూసేవాడివి కదరా. ఇప్పుడు ఏ లెక్కలు చూస్తావురా. ఇప్పుడు ఇంటి ఖర్చులు మేమే చూసుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు తిండమే మానేస్తారా అని మనోజ్ అంటాడు. ఏం ఖర్చులు. తినడానికి లెక్కలు చూస్తున్నారా. ఆయనకు పని లేకున్నా ఖర్చులకు ఇచ్చారు కదా. ఏం మాట్లాడుతున్నారు మావయ్య. ఆరోజు నేను పిడికెడు ఎక్కువ తింటాను అని అత్తయ్య అన్నారు అని మీనా అంటుంది.
ఆరోజు అత్తయ్య అలా అనుండకూడదు. ఈరోజు మనోజ్ ఇలా అనకూడదు. కానీ, మేము మీలా లెక్కలు చూడలేదు మీనా అని రోహిణి అంటుంది. ఇక మీరు మాట్లాడటం ఆపుతారా. నేను బాలుతో మాట్లాడాలి. సొంత కారును నాకోసం అమ్మావ్. అద్దె కారుని ఎందుకు లాక్కున్నాడు అని సత్యం అడుగుతాడు. చిన్న గొడవ నాన్న అని బాలు అంటాడు. చిన్న గొడవ. ఆ ఫైనాన్షియర్‌ను కొట్టాడు మావయ్య. ఇంకెందుకు కారు ఇస్తాడు అని రోహిణి అంటుంది.
అని నీకు చెప్పాడా. ఇప్పటికే మా నాన్న ముందు బాగా ఇరికించావ్‌గా అని బాలు అంటుంది. తను అన్నదాంట్లో తప్పేముంది. ఇప్పుడు మీకు పనిలేదు. ఇంటిమీద పడి తింటారా. ఏమైనా పని చేస్తారా అని ప్రభావతి అంటుంది. వీడికి నాలుగు డిగ్రీలు ఉన్నాయని ఉద్యోగం ఇస్తారు. బార్‌లో పనిచేయరా. మందుకు మందు టిప్‌కు టిప్పు అని మనోజ్ అంటాడు. దాంతో చాలు ఆపండి. ఏంటా మాటలు. ఎందుకు ఆయన్ను ఇన్ని మాటలు అంటున్నారు అని మీనా ఫైర్ అవుతుంది.
ఆయన ఏం తప్పు చేశారు. ఇల్లు మింగారా, లక్షలు మింగారా. ఆయన ఖాళీగా ఉన్నారని తెలిస్తే మీరు బాధపడుతరాని మౌనంగా ఉన్నారు మావయ్య. ఇన్ని మాటలు అంటున్నా ఆయనెందుకు చేస్తున్న పని చెప్పట్లేదో తెలుసా అని మీనా అంటే.. చెప్పకుండా బాలు అడ్డుకుంటాడు. మిమ్మల్ని అంటే ఊరుకోను. ఒక నెల ఇచ్చి మిమ్మల్ని పోషిస్తున్నట్లు మాట్లాడుతున్న వీళ్లకు నిజం తెలియాలి అని మీనా అంటుంది. బాలు వారిస్తే.. సత్యం అడ్డుకుని ఏం పని అని అడుగుతాడు.
నా భర్త మగాడు
ఒక అపార్ట్‌మెంట్‌లో కారులు కడిగే పని చేస్తున్నాడు మావయ్య. అక్కడెక్కడో దొంగతనం అంటగడితే ఆ ఉద్యోగం కూడా పోతుందని మౌనంగా భరించారు. అదంతా చూడలేక ఆ కారు ఓనర్‌ని వెనక్కి ఇవ్వమని అడిగాను. ఇందులో ఎవరిని మోసం చేశారు మావయ్య. బాధపెట్టి నిజం దాచారు అంతే. అది మోసం కాదు. అబద్ధం కాదు అని మీనా ఆవేదనగా చెబుతుంది. ఇప్పుడు చెబుతున్నాను. మేమెం ఇంటి మీద పడి తినడానికి సిద్ధంగా లేము. ఎప్పటిలాగే ఇంటికి కావాల్సింది ఇస్తాం. నా భర్త మగాడు. ఒకరి సంపాదన మీద పడి బతకాల్సిన అవసరం లేదు అని మీనా అంటుంది.
మనోజ్ మాత్రం పట్టనట్లు ఉంటాడు. ఏరా ఎందుకురా నీ స్థాయిని మర్చిపోయి అలాంటి పనిలో చేరావ్ అని సత్యం అంటాడు. ఇదిగో ఇలాంటి మాటలు పడాల్సివస్తుందనే అని బాలు అంటాడు. నేను ఇంకా బతికే ఉన్నాను కదరా అని సత్యం అంటాడు. అలా అంటావేంటీ నాన్న. వాడు కాకపోతే ఇంకెవ్వడు కారు ఇవ్వడా అని బాలు అంటాడు. ఎవడు ఇవ్వలేకనే ఆ పనిలో చేరావు అని ప్రభావతి అంటుంది.
ఇన్నాళ్లు నాకంటే ఎక్కువగా కష్టపడింది వాడే. ఒక్క నెల పని లేకపోతే ఇంతపెద్ద పంచాయితీ పెట్టారే ఇన్నాళ్లు వాడి సంపాదనతోనే తిండికి లోటు లేకుండా బతికాం. నా కష్టార్జీతాన్ని అంతా దోచుకెళ్లి నా నోట్లో మట్టికొట్టాడు వాడు. అయినా ఈ ఇంట్లో చోటుచ్చాన కదా. ఎవరికి తెలియకుండా ఈ ఇల్లు తాకట్టుపెట్టావ్. అయినా నిన్ను క్షమించాను. అంతకంటే తక్కువైపోయాడా వీడు. మీ మాటలకే వాడు కాని పని చేస్తున్నారు. ఇప్పుుడు చెబుతున్నాను. వాడు వాడి భార్య కూర్చుని తింటారు. ఇదేంటీ అని అడిగే హక్కు ఎవరికి లేదు. అంతా వెళ్లిపోండి అని సత్యం కోప్పడతాడు.
దాంతో అంతా వెళ్లిపోతారు. ఈ ఇంటి కోసం ఎన్ని మాటలు పడతావురా. నీకు గౌరవం ఉన్న పని దొరికే వరకు ఎదురుచూడు అని ఆప్యాయంగా బాలుతో చెబుతాడు సత్యం. ఈ సీన్ ఎమోషనల్‌గా ఉంటుంది. పైకి వచ్చిన మీనాతో చేసిందంతా చేసి దర్జాగా కూర్చున్నావా. నీకు సంబంధం లేని దాంట్లో వేలు పెడతావ్ ఎందుకు. నా గురించి అందరికి తెలిసేలా చేయాలా అని మీనాపై బాలు కోప్పడుతాడు. ఎందుకు తిడుతున్నారు అని బాలు అంటాడు.
మనసు చచ్చిపోయిందండి
అసలు నువ్ ఏమనుకుంటున్నావే అని బాలు అంటే.. ఊరి మీద కోపం తీసుకొచ్చి పెళ్లాం మీద చూపించే ముళ్లకంప దొరికాడేంట్రా అనుకుంటున్నాను అని మీనా అంటుంది. అసలు ఆ ఫైనాన్షియర్ దగ్గరికి ఎందుకు వెళ్లావ్. నేను సహాయం చేయమని అడిగానా అని నిలదీస్తాడు బాలు. మీరెందుకు అడుగుతారు. ప్రపంచంలో ఎవరికీ లేని పౌరుషం మీకుందిగా. అవసరం అయితే చెరువులో బర్లను తోముతారు. ఎవరెవరివో కారు కడిగి పైనుంచి మాటలు కూడా పడతారు అని మీనా అంటుంది.
అడిగినదానికే సమాధానం చెప్పమన్నానా. మధ్యలో నీ సొంత అభిప్రాయాలు ఎందుకు లాక్కొస్తున్నావ్ అని బాలు అంటే.. ఛీ ఛీ పెళ్లానికి సొంత అభిప్రాయం ఉండటమేంటీ. అసలు అది మనిషి అయితే కదా అని మీనా అంటుంది. అసలు ఏమైందే నీకు అని బాలు అంటాడు. మనసు చచ్చిపోయిందండి అని మీనా అంటుంది. దాంతో బాలు ఎమోషనల్‌గా ఫీల్ అవుతాడు. మీరెప్పుడైనా దొంగతనం చేశారా. అలాంటిది మీపై దొంగతనం అంటగడితే అది చూసి నా మనసు చచ్చిపోయింది అని మీనా అంటుంది.
ఆ మాటలను సత్యం వింటాడు. సొంత కారులో దర్జాగా వెళ్లే మీరు ఇలా పరాయి వాళ్ల కార్లు కడుగుతుంటే అది చూడలేక నా మనసు చచ్చిపోయింది అని మీనా అంటాడు. నిన్ను ఎవరు చూడమన్నారు. ఎవరు రమ్మన్నారు. ఇప్పుడు ఆ ఫైనాన్షియర్ గాడు నేను చెబితేనే వెళ్లావనుకుంటాడు. పెళ్లాం రికమండేషన్‌తో పని చేయించుకునే చవటను చేశావ్ కదే అని బాలు అంటాడు. ఓ.. మీకు అలా అర్థమైందా. అందుకే నేను మిమ్మల్నే వెళ్లమన్నాను. తప్పు అయింది క్షమించమని అడగమన్నాను అని మీనా అంటుంది.
కారు కొనిచ్చిన సత్యం
నేను వెళ్లి క్షమించమని అడగాలా అని బాలు అంటాడు. అడిగితే ఏమవుతుంది. మీ కిరీటం పడిపోతుంది. కార్లు తుడవడం కంటే, దొంగతనం మోపితే మౌనంగా ఉండటం కంటే అద్వానంగా ఉంటుందా. ఈ పొగరుతోనే ఇన్ని సమస్యలు తెచ్చుకున్నారు అని మీనా అంటుంది. దాంతో కొట్టడానికి బాలు చేయి లేపి ఆగిపోతాడు. కట్ చేస్తే బాలుకు తన కారునే కొని గిఫ్టి ఇస్తాడు సత్యం. దాంతో ప్రేమగా సత్యంను హగ్ చేసుకుంటాడు బాలు. మీనా చేతులతో బాలుకు కారు కీస్ ఇప్పిస్తాడు సత్యం. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.
టాపిక్