OTT Today Telugu Releases: ఓటీటీలోకి ఈరోజు వచ్చిన తెలుగు సినిమాలు ఇవే.. ఒకటి హారర్, మరొకటి బోల్డ్ రొమాంటిక్ కామెడీ
OTT Today Telugu Releases: ఓటీటీలోకి ఈ రోజు రెండు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి తమిళ డబ్బింగ్ హారర్ మూవీ కాగా.. మరొకటి తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ మూవీ కావడం విశేషం.
OTT Today Telugu Releases: ఓటీటీలో ఈ వీకెండ్ కోసం గురువారమే (డిసెంబర్ 12) రెండు తెలుగు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. రెండు వేర్వేరు జానర్లకు చెందిన ఈ మూవీస్ ఇప్పుడు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అందులో ఒకటి ఈ మధ్యే వచ్చిన బోల్డ్ రొమాంటిక్ కామెడీ మూవీ రోటీ కపడా రొమాన్స్ కాగా.. మరొకటి తమిళ డబ్బింగ్ హారర్ మూవీ 7/జీ ది డార్క్ స్టోరీ.
ఈటీవీ విన్ ఓటీటీలోకి రోటీ కపడా రొమాన్స్
ఓటీటీలోకి గురువారం (డిసెంబర్ 12) రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు అడుగుపెట్టాయి. ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేసింది రోటీ కపడా రొమాన్స్ మూవీ. థియేటర్లలో రిలీజైన 15 రోజుల్లోనే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. విక్రమ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ బోల్డ్ కంటెంట్ తో యువతను ఆకట్టుకునేలా తెరకెక్కించినా.. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేదు. స్నేహం, ప్రేమ అనే రొటీన్ కాన్సెప్ట్ తోనే ఈ రోటీ కపడా రొమాన్స్ మూవీ కూడా వచ్చింది.
లవ్, ఫ్రెండ్‌షిప్ విషయంలో నేటితరం ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి? తొందరపాటుతో సరైన మెచ్యూరిటీ లేకుండా తీసుకునే నిర్ణయాల వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? రిలేషన్‌షిప్స్‌లో ఉండే అభిప్రాయభేదాలు, వాటి వల్ల వచ్చే కన్ఫ్యూజన్స్‌ను నాలుగు కథలతో ఈ మూవీలో చూపించారు దర్శకుడు విక్రమ్ రెడ్డి. అందరికి తెలిసిన సింపుల్ కథలనే ఎక్కడ బోర్ కొట్టకుండా కామెడీతో చివరి వరకు నడిపించడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు.
నలుగురు కుర్రాళ్లుగా సందీప్ సరోజ్, హర్ష నర్రా, తరుణ్, సుప్రజ్ రంగా తమ పాత్రలకు న్యాయం చేశారు. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే ఈ సినిమాకు ఓటీటీలో ఎంత మేర ఆదరణ లభిస్తుందో చూడాలి.
ఆహా ఓటీటీలోకి 7/జీ ది డార్క్ స్టోరీ
ఇక గురువారమే (డిసెంబర్ 12) ఆహా వీడియో ఓటీటీలోకి తమిళ హారర్ మూవీ 7/జీ ది డార్క్ స్టోరీ తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది. 20 ఏళ్ల కిందట 7/జీ బృందావన్ కాలనీ మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైన సోనియా అగర్వాలే ఈ హారర్ సినిమాలోనూ లీడ్ రోల్ పోషించింది.
ఈ ఏడాది జులైలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఐదు నెలల తర్వాత ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది. 7/జీ ది డార్క్ స్టోరీ మూవీలో సోనియా అగర్వాల్ ఓ దెయ్యం పాత్ర పోషించింది. హరూన్ డైరెక్ట్ చేసిన ఈ హారర్ మూవీ ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. ఐఎండీబీలోనూ 6.6 రేటింగ్ మాత్రమే ఉంది. అయితే హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఈ 7/జీ ది డార్క్ స్టోరీ మూవీకి ఆహా వీడియోలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.