Vastu Yantra: ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నారంటే డబ్బుకు కొదవ ఉండవు, ప్రతికూల శక్తులను రానివ్వదు, చాలా పవర్ ఫుల్!-this powerful vastu yantra helps you to attract money and to avoid negative energies ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Yantra: ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నారంటే డబ్బుకు కొదవ ఉండవు, ప్రతికూల శక్తులను రానివ్వదు, చాలా పవర్ ఫుల్!

Vastu Yantra: ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నారంటే డబ్బుకు కొదవ ఉండవు, ప్రతికూల శక్తులను రానివ్వదు, చాలా పవర్ ఫుల్!

Ramya Sri Marka HT Telugu
Dec 12, 2024 07:45 AM IST

Vastu Yantra: వాస్తు శాస్త్రం ప్రకారం పేదరికం, దురదృష్టాన్ని దూరం చేసుకోవడానికి కొన్ని యంత్రాలు, వస్తువులు చాలా బాగా సహాయపడతాయి. వీటి ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పెంచి, దురదృష్టాన్ని నివారించుకోవచ్చు. ధనాన్ని ఆకర్షించవచ్చు.

శ్రీయంత్రం
శ్రీయంత్రం (pinterest)

ఇంటిని నిర్మించిన దర్వాత వాస్తు దోషాలు ఉంటే ఆ ఇంట్లో నివసించే వారికి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయి. అటువంటి సందర్భాల్లో ఇంటి నిర్మాణాన్ని తిరిగి చేపట్టలేం కనుక సమస్యలను తొలగించుకనేందుకు కొన్ని సాధారణ నియమాలు ఉన్నాయి. ఇంట్లో నిర్దిష్ట వాస్తు యంత్రాన్ని అమర్చడం ద్వారా ఈ సమస్యలను సరిచేయవచ్చు. ఇది ఇంట్లో శక్తి ప్రవాహాన్ని మెరుగుపరిచి శ్రేయస్సు, శాంతిని, పెంచుతుంది.సానుకూలతను ఆకర్షించి, అడ్డంకులను తొలగిస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో శక్తి ప్రవాహాన్ని సానుకూలంగా మార్చేందుకు వాస్తు యంత్రాలు ఉపయోగపడతాయి. ఇవి ఇంట్లోని ఇబ్బందులు, అశుభాలను, దురదృష్టాలను తొలగించి సానుకూల శక్తులను, ధనాన్ని, ఆరోగ్యాన్ని ఆకర్షిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి యంత్రం లేదా వస్తువు ప్రత్యేక వక్తి స్రవాహాన్ని సృష్టించి, ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, శుభఫలితాలను కలిగిస్తాయి. వీటిని ఇంట్లో పెట్టుకోవడం లేదా వాటిని ఉపయోగించడం శుభఫలితాలు కలిస్తయి. అలాగే పూజలు, ప్రత్యేక సందర్భాల్లో ఎప్పటికప్పుడు వీటిని పూజించడం, ఉపయోగించడం అదృష్టాన్ని తెస్తుంది. ప్రతికూల శక్తులు తొలగిపోయిన సకల ఐశ్వర్యాలు సిద్ధించాలంటే ఇంట్లో లేదా కార్యాలయంలో ముఖ్యంగా ఉండాల్సిన యంత్రం శ్రీ యంత్రం. దీని ప్రత్యేకత, ఎలా ప్రతిష్టించాలి, ఎప్పుడు ప్రతిష్టించాలి వంటి వివరాలను తెలుసుకుందాం.

శ్రీ యంత్రం ప్రత్యేకత:

శ్రా యంత్రం అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన యంత్రం. ఇది లక్ష్మీదేవి విశ్వరూపానికి ప్రతీకగా చెబుతారు. లక్ష్మీ సంపద, శ్రేయస్సులకు దేవత. ఈ యంత్రానకి అద్భుత శక్తులు ఉన్నాయని, శీఘ్ర ఫలితాలను ఇవ్వగల సామర్థ్యం ఉందని వాస్తు శాస్త్రం నమ్ముతుంది. హిందూ విశ్వాసాల ప్రకారం శ్రీ యంత్రం కలియుగంలో కామధేనువు వంటిది. ఇంట్లో లేదా కార్యాలయంలో ఈ యంత్రాన్ని పెట్టి పూజించడం వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుంది. దురదృష్టం దూరమవుతుంది.

శ్రీ యంత్రం ప్రయోజనాలు:

శ్రీ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో మీకు తిరుగు ఉండదు. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా పొందవచ్చు.వాస్తు దోషాలు కూడా తొలగిపోయి ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది.వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో సామరస్యం, ఆనందం దక్కుతాయి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా అశాంతితో, ఏకాగ్రతలోపంతో ఇబ్బంది పడుతుంటే ఈ యంత్రం ప్రతిష్టించిన తర్వాత ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటారు.

శ్రీ యంత్రాన్ని ఎక్కడ ప్రతిష్టించాలి?

ఇంట్లో లేదా ఆఫీసులోని పూజ గదిలో లేదా ఈశాన్య ఉంచాలి. ఇది లోపలికి సానుకూల శక్తులను ఆకర్షించి శ్రేయస్సు, సమృద్ధిని కలిగిస్తుంది.

శ్రీ యంత్రాన్ని ఎలా ప్రతిష్టించాలి?

ఈ యంత్రాన్ని ప్రతిష్టించే ముందు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పంచామృతం లేదా గంగాజలంలో యంత్రాన్ని కడిగి శుభ్రం చేయండి. తరువార ఈశాన్య మూలలో ఎర్రటి వస్త్రానని పరిచి శ్రీ యంత్రాన్ని అందులో అమర్చండి. తరువాత దీపం వెలిగించి యంత్రానికి పూలు సమర్పించండి. లక్ష్మీ దేవికి సంబంధించిన మంత్రాలను జపించండి. ఇలా పండుగలు ప్రత్యేక సమయాల్లో ఇంటిని కార్యాలయాన్ని శుద్ధి చేసినప్పుడల్లా యంత్రాన్ని కూడా శుద్ధి చేసి తిరిగి ప్రతిష్టించి పూజలు చేయడం అవసరం. ఇది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులను రాకుండా అడ్డుకోవడమే కాకుండా లక్ష్మీ దేవతను ఆకర్షించి సకల ఐశ్వర్యాలు సిద్ధించేలా చేస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner