(1 / 5)
1. ఉమా మహేశ్వరి మంత్రం
"ఓం నమః నమస్తే దేవేశ్ ఉమాధ్ర్ధ ధారక మహాదేవి నమస్తస్తు హర్యకార్థవాసిని ||
అర్థం: "ఓం, ఆది దంపతులకు నమస్కరిస్తున్నాను. దాంపత్య జీవితంతో విశ్వపు సమతుల్యతను కాపాడుతున్న మిమ్మల్ని వేడుకుంటున్నాను."
(2 / 5)
2. మహాదేవ మంత్రం
"ఓం గౌరీపతి మహాదేవాయ మమ ఇచ్చిత వర్ శీగ్ర అతి శీగ్ర ప్రాప్త్యర్థం గౌర్యై నమ: ॥"
అర్థం:
ఆ మహాదేవుని, పార్వతీ మాతను కరుణించమని కోరుతూ మా కోరికలను త్వరగా తీర్చమని వేడుకోవడానికి ఈ మంత్రాన్ని పఠిస్తారు.
(3 / 5)
3. శివ గౌరీ మంత్రం
"ఓం సర్వ మంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే
అర్థం: ఓం, పరమేశ్వరా.. సకల మంగళకార్యాలలో నాకు తోడుగా ఉండి ఆ పనులలో విజయం చేకూర్చు. పార్వతీ దేవి, పరమశివునికి నమస్కారాలు.
(4 / 5)
4. శివ ధ్యాన మంత్రం
"కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం।
విహితం విహితం వా సర్వ మేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ॥"
అర్థం: "నానా రీతులలో నేను చేసిన పాపాలను, నా చేతులతో చేసిన పనులను, నా మాటలు ద్వారా జరిగిన తప్పులను, నా చెవులతో వినిన అన్యాయాలను, నా మనసులో తిట్టుకున్న తప్పులనన్నింటినీ క్షమించు. శంభో మహాదేవా, ఎల్లప్పుడూ నన్ను కాపాడు"
(5 / 5)
5. పంచాక్షరీ శివ మంత్రం
"ఓం నమః శివాయ ||"
ఓం, మహాదేవునికి నమస్కారాలు.
అర్థం: పరమేశ్వరుని మంత్రాలను జపించడం వల్ల సంతోషకరమైన, చక్కటి సమన్వయంతో కూడిన వివాహమయ్యేందుకు దోహదపడుతుంది. తమ జీవితాల్లోకి దైవిక శక్తిని ఆహ్వానించడం ద్వారా, వ్యక్తులు తమ వివాహాన్ని ఆలస్యం చేసే అడ్డంకులు, సవాళ్లను త్వరగా అధిగమించగలుగుతారు. ఈ శక్తివంతమైన మంత్రాలను నిరంతరం జపించడం వల్ల మనసు, శరీరం, ఆత్మ శుద్ధి అవుతాయి.
ఇతర గ్యాలరీలు