Karthika Deepam Today December 10: జ్యోత్స్నకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన దీప.. వార్నింగ్ కూడా, మరింత రగిల్చిన కార్తీక్
Karthika Deepam Today Episode December 10th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జ్యోత్స్న ప్లాన్ వల్ల అర్జెంట్‍గా ఆఫీస్‍కు వెళతాడు కార్తీక్. అక్కడ జ్యోత్స్నకు కౌంటర్లు వేస్తాడు. ఆ తర్వాత దీప సడెన్ ట్విస్ట్ ఇస్తుంది. కార్తీక్ మాటలతో రగిలిపోతుంది జ్యోత్స్న. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 10) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న అర్జెంట్‍గా అఫీస్‍కు రమ్మందని కార్తీక్‍కు ప్రభాకర్ చెబుతాడు. దీంతో తినకుండా ఆఫీస్‍కు వెళ్లేందుకు డిసైడ్ అవుతాడు కార్తీక్. తల్లి కాంచన పిలిస్తే.. మీరు భోజనం చేయండి.. నేను ఆఫీస్‍కు వెళ్లాలని కార్తీక్ అంటాడు. “ప్లేట్‍లో రైస్ పెట్టాక తర్వాత తింటానని అంటారేంటిటి బాబు.. తినేసి వెళ్లండి” అని దీప అంటుంది. తాను వెళ్లకపోతే జ్యోత్స్న వస్తుందని, పెద్ద గొడవ అవుతుందని మనసులో అనుకొని ఆఫీస్‍కు వెళ్లేందుకు కార్తీక్ నిర్ణయించుకుంటాడు. అందరికీ చెప్పి ఆఫీస్‍కు వెళ్లిపోతాడు. తన మీద కోపంతో కార్తీక్‍ను జ్యోత్స్న ఇబ్బంది పెడుతోందని మనసులో అనుకుంటుంది దీప.
జ్యోత్స్నపై కార్తీక్ పంచ్‍లు
ఆఫీస్‍లో కోపంగా అడుగుపెడతాడు కార్తీక్. “ఏం సీఈవో గారు ఇది ఆఫీస్ అనుకున్నారా.. స్కూల్ అనుకున్నారా. నేను రావడం ఐదు నిమిషాలు లేట్ అయిన మీరు ఇంటికి వస్తారా. అవతలి వాళ్ల ఎమర్జెన్సీ అర్థం చేసుకోరా. ఇంటి మీద పడతారా” అని జ్యోత్స్నపై కార్తీక్ ఫైర్ అవుతాడు. కూల్ బావ అని జ్యోత్స్న అంటే.. ఆఫీస్‍లో వరుసలు ఏంటి, ఉద్యోగిగానే వచ్చానని కార్తీక్ అంటాడు. మాజీ సీఈవో అయిన నీవు ఉన్నప్పుడు జరిగిన అకౌంట్స్ కాబట్టి నిన్ను రమ్మన్నానంటూ కవర్ చేస్తుంది జ్యోత్స్న.
దీంతో కార్తీక్ మరింత కోప్పడతాడు. ప్రభాకర్‌ను పిలిచి అరుస్తాడు. ఇన్‍డైరెక్ట్‌గా జ్యోత్స్నపై పంచ్‍లు వేస్తాడు. ఇవి నార్మల్ అకౌంట్స్ అని, డౌట్ ఉండే ఫోన్ చేయాల్సిందని, మేడం చెప్పిందని ఆఫీస్‍కు పిలుస్తావా అంటూ ఫైర్ అవుతాడు. “అవతలి వాళ్లు ఎలాంటి పని ఉన్నారో అర్థం చేసుకొని పిలవాలి” అని జ్యోత్స్నను చూస్తూ అంటాడు కార్తీక్. “భోజనం చేయకుండా వచ్చాను. ఇలాంటి చిన్నచిన్న విషయాలు కూడా అర్థం చేసుకోలేని అసమర్థులు మన ఆఫీస్‍లో ఎవరూ లేరు కదా. మేడంకు అన్ని అకౌంట్లు వివరించు. డౌట్ వస్తే నా దగ్గరికి రా” అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్.
జ్యోత్స్న భోజనం ప్లాన్
తనపై కౌంటర్లు వేసినా సరే ఆఫీస్‍కు రప్పించి దీప నుంచి దూరం చేశానని సంతోషిస్తుంది జ్యోత్స్న. తినకుండా వచ్చానని కార్తీక్ చెప్పడంతో కొత్త ప్లాన్ చేస్తుంది. కార్తీక్‍తో కలిసి తినేందుకు డైనింగ్ టేబుల్ వద్ద ఏర్పాట్లు చేయాలని ప్రభాకర్‌కు చెబుతుంది. బావ నిన్ను దగ్గర చేసుకునేందుకే ఇవన్నీ అని జ్యోత్స్న అనుకుంటుంది. “పాపం దీప.. భోజనం చేయకుండా వెళ్లిపోయాడని నిన్ను తలచుకొని.. బాధపడుతూ ఉంటుంది. ఈరోజు నుంచి రోజూ బాధపడుతూనే ఉంటావు దీప. ఎందుకంటే బావ రోజూ నాతో కలిసి తింటాడు. దీపకు చూపించేందుకు సెల్ఫీ తీసి పెట్టుకోవాలి” అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. జ్యోత్స్న కావాలనే ఇలా చేసిందని ఆలోచిస్తుంటాడు కార్తీక్. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ వద్దకు రావాలని కార్తీక్‍ను ప్రభాకర్ పిలుస్తాడు.
మళ్లీ కౌంటర్లు
డైనింగ్ టేబుల్ వద్దకు కార్తీక్ వెళతాడు. భోజనం చేస్తూ మాట్లాడుకుందామని జ్యోత్స్న అంటుంది. ఎందుకే పిలిచావా అని కార్తీక్ అంటే.. భోజనం చేయలేదని తర్వాత తెలిసిందని, నువ్వు తినకపోతే నా మనసు ఎంత బాధపడుతుందో చెప్పు అని జ్యోత్స్న అంటుంది. ఇంటికి వెళ్లొచ్చా అని కార్తీక్ అంటే.. కూడదు అంటుంది జ్యోత్స్న. పిలిచిన పని ఇంకా పూర్తి కాలేదని, అది వెంటనే పూర్తి కాదని, అంత వరకు మీరు ఆకలితో ఉంటే నాకు ఆకలేస్తుందని జ్యోత్స్న అంటుంది. “ఇది కాస్త ఎక్కువైంది” అని కౌంటర్ ఇస్తాడు కార్తీక్. కావాల్సినంతే తిను అని జ్యోత్స్న పంచ్ వేస్తుంది.
నాతో కలిసి భోజనం చేయడం ఇష్టం లేదా అని జ్యోత్స్న అంటే.. “నాకో ఇల్లు ఉంది. వండిపెట్టే పెళ్లాం ఉంది. ఇంటికెళ్లి తింటాను” అని కార్తీక్ అంటాడు. తినాలని జ్యోత్స్న మళ్లీ అడిగినా వద్దంటాడు కార్తీక్. “నీ కోసం ఎవరైనా ఫుడ్ తీసుకొస్తారని అనుకుంటున్నావా. ఈ క్షణం నీ కోసం ఆలోచించే మనిషిని నేను తప్ప ఎవరూ లేరు బావ” అని జ్యోత్స్న అంటుంది. నువ్వు తినకపోతే నేను తినలేనని జ్యోత్స్న అంటే.. వెళ్లి డాక్టర్‌కు చూపించుకోవాలని కౌంటర్ వేస్తాడు కార్తీక్. అది జబ్బు కాదు.. ప్రేమ అని అంటుంది జ్యోత్స్న. అలాంటి ప్రేమ చూపించేందుకు వేరే మనిషి ఉందిలే అని కార్తీక్ అంటాడు. ఇలా చిటికేస్తే ఆ మనిషి వస్తుందా అని జ్యోత్స్న అంటుంది.
అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన దీప
అంతలోనే ఆఫీస్‍కు భోజనం క్యారేజ్ పట్టుకొచ్చి జ్యోత్స్నకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ ఇస్తుంది దీప. చేతిలో క్యారేజ్ చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. దీపే వారసురాలు అని దాసు చెప్పిన మాటలను మరోసారి గుర్తు చేసుకుంటుంది. మీ కోసం భోజనం తీసుకొచ్చానని కార్తీక్‍తో దీప అంటుంది. “ఒక్కోసారి మనం చిటికె వేయక్కర్లేదు జ్యోత్స్న. తలుచుకుంటే చాలు దేవుడు తదాస్తు అంటాడు” అని కార్తీక్ అంటాడు. ఏమైందని దీప అడిగితే.. ఇలా క్యారేజ్ తెస్తావని అనుకోలేదని, అందుకే సర్‌ప్రైజ్ అయ్యానని అంటాడు. “జ్యోత్స్న నీకు ఎలా ఉంది” అని దీప అడుగుతుంది. నీకు మాత్రం అడగాలనిపించలేదా అని కార్తీక్‍ను జ్యోత్స్న ప్రశ్నిస్తుంది.
కలిసి తిన్న కార్తీక్, దీప.. రగిలిపోయిన జ్యోత్స్న
ఆఫీస్‍లో డైనింగ్ టేబుల్ వద్ద.. జ్యోత్స్న కళ్ల ముందే కలిసి భోజనం చేస్తారు కార్తీక్, దీప. భార్య అంటే ఇలా ఉండాలంటూ జ్యోత్స్నకు మరింత రగిలేలా మాట్లాడాడు కార్తీక్. “నన్ను ఏడిపించడానికే నువ్వు ఇలా మాట్లాడుతున్నావని తెలుసు బావ” అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. తన ప్లాన్ బెడిసికొట్టినందుకు చిరాకు పడుతుంది. గుత్తి వంకాయ కర్రీ నాకు ఇష్టమని మా అవిడ ప్రేమతో తన సుహస్తాలతో చేసిందని జ్యోత్స్నకు మరింత ఉడికిస్తాడు కార్తీక్. అదృష్టం ఉండాలని కార్తీక్ అంటే.. దీప చస్తే కానీ తనకు అదృష్టం రాదని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
తిన్నావా అని కార్తీక్ అడిగితే.. తిన్నానని దీప చెబుతుంది. అయితే అమ్మకు ఫోన్ చేసి అడుగుతానంటాడు కార్తీక్. తినలేదని దీప చెప్పేస్తుంది. తనతో కలిసి తినాలని దీపను కార్తీక్ అడుగుతాడు. ఇంట్లో తినానని అంటే.. అలా కాదని చెబుతాదు. దీంతో కార్తీక్, దీప కలిసి తింటారు. ఒకే ప్లేట్ ఉందని దీప అంటుంది. ముద్దలు కలిపి ఇస్తాడు కార్తీక్. ఇదంతా చూసి జ్యోత్స్న రగిలిపోతూనే ఉంటుంది.
ఇంత కంటే బ్యాడ్ డే ఉంటుందా..
నాకేంటి ఈ నరకం.. వీళ్ల కోసం నేను ప్లాన్ చేసినట్టు ఉందని జ్యోత్స్న అనుకుంటుంది. తన లైఫ్‍లో ఇంత కంటే బ్యాడ్ డే ఇంత కంటే ఉంటుందా అని మదనపడుతుంది. “దీపా.. బావ నిన్ను పెళ్లి చేసుకున్నాడనే కోపం ఒక పక్క.. నువ్వే అసలైన వారసురాలివి అని తెలిశాక.. నిజం అందరికీ తెలిస్తే నేను ఏమైపోతానోనన్న భయం ఓ పక్క. ఇవన్నీ కలిసి మనశ్శాంతిగా ఉండలేకపోతున్నా దీప. ఇప్పుడేం చేయాలి” అని జ్యోత్స్న ఆలోచిస్తుంది.
ఎత్తుకొని తిరిగే వాడిని.. అరిచేసిన జ్యోత్స్న
దీప వండిన గుత్తి వంకాయ కూర అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తాడు కార్తీక్. ఇదే ఇళ్లు అయి ఉంటే ఎత్తుకొని తిప్పేవాడనని అంటాడు. రోజూ తన కోసం భోజనం తీసుకురావాలని అంటాడు. ఇదంతా చూస్తూ జ్యోత్స్న కోపం కట్టలు తెంచుకుంటుంది. “ఇక చాలు ఆపండి. ఇది మీ ఇళ్లు అనుకున్నారా.. ఆఫీస్ అనుకుంటున్నారా. మాకేంటిది. ఏదో ఇంట్లో మీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మీ ఇద్దరే ఉన్నట్టు ఈ మాటలు ఏంటి” అని జ్యోత్స్న అరుస్తుంది. భార్యాభర్తలు అన్నాక ఇలాగే ఉంటారని కార్తీక్ బదులిస్తాడు.
సిగ్గుందా అన్న జ్యోత్స్న.. మాస్ వార్నింగ్ ఇచ్చిన దీప
ఇలా కలిసి తినేందుకు సిగ్గు ఉందా అని జ్యోత్స్న అంటే.. కోపంగా అరిచి లేచేందుకు సిద్ధమవుతాడు కార్తీక్. మీరు ఆగండి కార్తీక్ బాబు అని ఆపుతుంది దీప. “నా రెండూ నాకు ఇస్తేనే కానీ పల్లకి ఎక్కను అందంట పెళ్లి కూతురు. జ్యోత్స్న కూడా అలాంటిదే. రెండు తగిలిస్తే మాట.. మనిషి రెండూ సరిఅయిపోతాయి” అని కొడతాననేలా చేతులు సర్దుకుంటూ వార్నింగ్ ఇస్తుంది దీప. నా ఆఫీస్‍కు వచ్చి నన్నే అరుస్తావా అని జ్యోత్స్న అంటే.. “నా గురించి తేడాగా మాట్లాడితే నీ ఆఫీస్‍లోనే కాదు. నీ ఇంటికి వచ్చి అరుస్తాను. అది నువ్వు తట్టుకోలేవు” అని దీప అంటుంది.
మేనేజర్‌కు చెంప దెబ్బ
దిగజారి మాట్లాడుతున్నావని జ్యోత్స్న అంటే.. మేం భోజనం చేయడం ఇష్టం లేదంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కార్తీక్ అంటాడు. గొడవ చేయవద్దని చెబుతాడు. ఎవరు గొడవ చేసేది.. నేను ఈ ఆఫీస్ సీఈవోను అని అరుస్తుంది జ్యోత్స్న. ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ మీరు ప్రపంచాన్ని మరిచిపోయి పరవశిస్తుంటే నేను చూస్తు ఊరుకోవాలా అని జ్యోత్స్న అంటుంది. నీ భర్తకు క్యారేజ్ ఇవ్వాలని అనుకుంటే బయటే ఇచ్చి వెళ్లాలని, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అంటుంది జ్యోత్స్న. దీప, కార్తీక్‍పై కోపం మేనేజర్‌పై చూపిస్తుంది. నన్ను అడగకుండా ఎవరిని పడితే వారిని ఆఫీస్‍లోకి రానిస్తావా, అని ప్రభాకర్‌ను చెంప దెబ్బ కొడుతుంది.
నా భార్య జోలికి వస్తే..
భోజనం చేసి చేతులు కడుకున్నాక.. దీప చీర కొంగుకు చేయి తుడిచేస్తాడు కార్తీక్. తిరిగి ఏమీ అనలేడనే కదా, నా మీద ఉన్న కోపంతో ప్రభాకర్‌ను కొట్టావని కార్తీక్ అంటే.. అద నీ మీద ఉన్న కోపం కాదు అంటూ దీపవైపు జ్యోత్స్న చూస్తుంది. “నేనూ నా భార్య ఒకటే. నన్ను అన్నా.. నా భార్యను అన్నా ఒక్కటే. ఇద్దరం వేరు కాదు” అని కార్తీక్ అనడంతో జ్యోత్స్నకు మరింత ఉడికిపోతుంది. నువ్వు ఇంటికెళ్లు దీప.. సాయంత్రం త్వరగా వస్తాలే అని కార్తీక్ చెబుతాడు. ఏదైనా అనాలంటే నన్ను అను.. దీపను కాదు అని జ్యోత్స్నకు కార్తీక్ చెబుతాడు. జాగ్రత్తగా వెళ్లు అని కార్తీక్ అంటే.. ఇది చూసి తట్టుకోలేకపోతుంది కార్తీక్. “నా భార్య జోలికి వస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. భోజనం చేయండి సీఈవో గారు” అని జ్యోత్స్నకు కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు.
పారిజాతంను భయపెట్టేసిన జ్యోత్స్న
దీపను ఏం చేయలేకున్నానని, చంపేసేందుకు కూడా కుదరడం లేదు అనుకొని.. గ్రానీ అని అరుస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఇంటి బయట ఫోన్ మాట్లాడుతున్న పారిజాతం వైపు వేగంగా కారు తీసుకొస్తుంది జ్యోత్స్న. దీంతో అమ్మో అని కేక పెడుతుంది పారిజాతం. ఆ స్పీడ్ ఏంటే.. పొరపాటును బ్రేక్ పడకపోతే.. కారు గుద్ది నేను చచ్చిపోతాను కదా అని పారిజాతం అంటుంది. మన శత్రువు.. మన కళ్ల ముందు కూర్చొని నవ్వుతూ ఉంటే.. ఎవడో లోపల నరాలు కట్ చేస్తున్న ఫీలింగ్ అని కసిగా అంటుంది జ్యోత్స్న. మళ్లీ ఏం జరిగిందా అని చూస్తుంది పారిజాతం. దీంతో కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 10) ఎపిసోడ్ ముగిసింది.