Venus Transit: రాశి మార్చుకోనున్న శుక్ర గ్రహం.. ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం, విజయం-venus transit into aquarius brings huge luck and prosperity for these zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Venus Transit: రాశి మార్చుకోనున్న శుక్ర గ్రహం.. ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం, విజయం

Venus Transit: రాశి మార్చుకోనున్న శుక్ర గ్రహం.. ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం, విజయం

Ramya Sri Marka HT Telugu
Dec 13, 2024 05:00 PM IST

Venus Transit: సంపద కారకుడు శుక్రుడు త్వరలో తన రాశి చక్రాన్ని మార్చుకోనున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి తిరుగులేని అదృష్టాన్ని, విజయాన్ని తెచ్చిపెట్టబోతుంది. 2024 డిసెంబర్ చివరిలో శుక్రుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఏ రాశి వారికి కలిసొస్తుందో ఇక్కడ తెలుసుకోవచ్చు.

రాశి మార్చుకోనున్న శుక్ర గ్రహం.. ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం, విజయం
రాశి మార్చుకోనున్న శుక్ర గ్రహం.. ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం, విజయం

వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని సంపద, శ్రేయస్సు, విలాసం, ప్రేమ, వివాహం, అందం, సౌకర్యాల కారక గ్రహంగా పరిగణిస్తారు. తొమ్మిది గ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహంగా కూడా చెబుతారు. జాతకంలో శుక్రుడు అనుకూలంగా ఉంటే జీవితంలో శ్రేష్ఠత, ఊహ, దుబారాలను నియంత్రిస్తుంది. సంగీతం, కవిత్వం, పెయింటింగ్, గానం, నటన, నాటకం, ఒపెరా వంటి వినోదాలు, అలంకారాల వైపు ఆసక్తి చూపేలా చేస్తుంది. శుక్రుడి సంచారంలో మార్పు కచ్చితంగా వ్యక్తుల జీవితం మీద పడుతుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం.. శుక్రుడు నెలకు ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు. అతని సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఒక రాశిలో శుక్రుడు ఉన్నతంగా ఉంటే వారికి అన్ని రకాల యోగాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 2 024 చివరి నెల అయిన డిసెంబర్ చివరిలో అంటే డిసెంబర్ 28న శుక్రుడు కుంభ రాశికి వెళ్తాడు. తిరిగి జనవరి 28 వరకూ అదే రాశిలో సంచరిస్తాడు. శుక్రుడి కుంభ రాశి ప్రయాణం 2025 కొన్ని రాశుల వారికి శుభారంభం కానుంది. ఏయే రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

yearly horoscope entry point

కుంభ రాశి:

శుక్రుడు కుంభ రాశి వారికి మొదటి స్థానంలో సంచరిస్తున్నారు. ఇది మీకు చాలా లాభదాయకమైన సమయం. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితంలోని అన్ని సమస్యలు తగ్గుతాయి. కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీకు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.

మేషరాశి:

మేష రాశి వారికి శుక్రుడి సంచారంలో 11వ స్థానంలో జరుగుతుంది. ఫలితంగా మీ చిరకాల కోరికలు నెరవేరుతాయి. అన్ని రకాలుగా సంతోషాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ డబ్బు సంపాదించే పరిస్థితులు ఉంటాయి. గౌరవం, మర్యాద పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య మంచి ప్రేమ, అనుబంధం వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. జీవితంలో సంతోషం పెరుగుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.

మిథున రాశి:

మిథున రాశి వారికి శుక్రుడు 9వ స్తానంలో సంచరిస్తాడు. ఇది వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి. పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి.అవివాహితులకు వివాహం జరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. డబ్బు సంపాదించే అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. మీరు పనిచేసే చోట పదోన్నతి, వేతన పెంపును పొందవచ్చు. ఉన్నతాధికారులు మీకు అనుకూలంగా పనిచేస్తారు. శత్రువుల వల్ల కలిగే సమస్యలన్నీ తగ్గుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner