Star Maa: స్టార్ మా మోస్ట్ రొమాంటిక్ రియాల్టీ షో ఇష్మార్ట్ జోడీ సీజన్ 3 వచ్చేస్తోంది.. కొత్త ప్రోమో చూశారా..-star maa super hit show ishmart jodi season 3 to start on 21st december ohmkar to host ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Maa: స్టార్ మా మోస్ట్ రొమాంటిక్ రియాల్టీ షో ఇష్మార్ట్ జోడీ సీజన్ 3 వచ్చేస్తోంది.. కొత్త ప్రోమో చూశారా..

Star Maa: స్టార్ మా మోస్ట్ రొమాంటిక్ రియాల్టీ షో ఇష్మార్ట్ జోడీ సీజన్ 3 వచ్చేస్తోంది.. కొత్త ప్రోమో చూశారా..

Hari Prasad S HT Telugu
Dec 17, 2024 07:42 AM IST

Star Maa: స్టార్ మా మోస్ట్ రొమాంటిక్ రియాల్టీ షో ఇష్మార్ట్ జోడీ మూడో సీజన్ తో వచ్చేస్తోంది. తాజాగా సోమవారం (డిసెంబర్ 16) రాత్రి కొత్త సీజన్ ప్రోమోను రిలీజ్ చేయడంతోపాటు టెలికాస్ట్ ప్రారంభమయ్యే తేదీని కూడా స్టార్ మా రివీల్ చేసింది.

స్టార్ మా మోస్ట్ రొమాంటిక్ రియాల్టీ షో ఇష్మార్ట్ జోడీ సీజన్ 3 వచ్చేస్తోంది.. కొత్త ప్రోమో చూశారా..
స్టార్ మా మోస్ట్ రొమాంటిక్ రియాల్టీ షో ఇష్మార్ట్ జోడీ సీజన్ 3 వచ్చేస్తోంది.. కొత్త ప్రోమో చూశారా..

Star Maa: స్టార్ మా అటు సీరియల్స్, ఇటు టీవీ షోలలో నంబర్ వన్ ఛానెల్. ఇప్పుడీ ఛానెల్లో సూపర్ హిట్ రియాల్టీ షో అయిన ఇష్మార్ట్ జోడీ కొత్త సీజన్ తో రానుంది. ఈ సీజన్ డిసెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆ ఛానెల్ వెల్లడించింది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆ ఛానెల్ సోమవారం (డిసెంబర్ 16) రిలీజ్ చేసింది.

ఇష్మార్ట్ జోడీ సీజన్ 3

ప్రముఖ నటుడు, డైరెక్టర్, టీవీ హోస్ట్ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ఇష్మార్ట్ జోడీ. 2020లో తొలిసారి టెలికాస్ట్ అయిన ఈ షో ఇప్పుడు మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త సీజన్ డిసెంబర్ 21 నుంచి ప్రసారం కానుందని చెబుతూ.. ప్రోమోను రిలీజ్ చేసింది స్టార్ మా ఛానెల్. "మీ చుట్టూ ప్రేమ నిండిపోయింది. ఇష్మార్ట్ జోడీ సీజన్ 3 రొమాన్స్ గ్రాండ్ సెలబ్రేషన్ కోసం వస్తోంది. ఓంకార్ హోస్ట్ చేస్తున్నాడు. డిసెంబర్ 21, రాత్రి 9 గంటలకు గ్రాండ్ లాంచ్ మిస్ కావద్దు. ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారం అవుతుంది. మ్యాజిక్ కోసం ఎవరు సిద్ధంగా ఉన్నారు" అనే క్యాప్షన్ తో ఈ కొత్త సీజన్ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.

ఇష్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రోమో

ఇష్మార్ట్ జోడీని మోస్ట్ రొమాంటిక్ రియాల్టీ షోగా చెబుతూ ఈ కొత్త సీజన్ ప్రోమోను స్టార్ మా లాంచ్ చేసింది. ఇందులో మొదట హోస్ట్ ఓంకార్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ సీజన్లో పాల్గొనబోయే జోడీలను పరిచయం చేశారు. ఇందులో రాకింగ్ రాకేష్, అతని భార్య సుజాత, సీనియర్ నటుడు ప్రదీప్ అతని భార్య సరస్వతి, అమర్, తేజు.. యాంకర్ లాస్య, మంజునాథ్ జోడీలాంటి వాళ్లు ఎంట్రీ ఇచ్చారు. మొత్తంగా ఈ ఇష్మార్ట్ జోడీ షోలో 12 జంటలు పోటీ పడతాయి.

ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో ఇప్పుడు మూడో సీజన్ తో రాబోతోంది. ఈ కొత్త సీజన్ ప్రోమో కూడా సరదాగా సాగిపోయింది. ముఖ్యంగా రాకింగ్ రాకేష్, సుజాత జోడీ ఎంట్రీతోనే నవ్వులు పూయించారు. ఇక ప్రోమో చివర్లో యాంకర్ లాస్య గురించి ఆమె భర్త మంజునాథ్ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. లాస్య కూడా కంటతడి పెట్టి ఈ షోకి కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఇష్మార్ట్ జోడీ సీజన్ 3 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ను వచ్చే శనివారం (డిసెంబర్ 21) రాత్రి 9 గంటలకు స్టార్ మాలో చూడొచ్చు.

Whats_app_banner