Lord Rama: సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన శ్రీరాముడి మంత్రాలు, వాటి అర్థాలు
Lord Rama: హిందూ ఆచార వ్యవహారాల్లో శ్రీరాముడికి ప్రాధాన్యత ఎక్కువ. శ్రీరాముని అనుగ్రహంతో సత్ప్రవర్తన, సద్బుద్ధి కలగడంతో పాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవచ్చు. ఆయన ఆశీర్వాదం పొందడానికి మీకు సహాయపడే అత్యంత శక్తిమంతమైన మంత్రాలు ఇక్కడ ఉన్నాయి.
యుగానికే ఆదర్శ పురుషుడిగా వెలుగొందుతున్న శ్రీరామ చంద్రుడ్ని స్మరించుకుంటే కలిగే ప్రయోజనాలెన్నో.. మానసికంగా అనేక సమస్యలను ఛాలెంజ్ చేయగలిగేంత సమర్థత తెచ్చిపెట్టడమే కాకుండా బలవంతులుగా కూడా మారతామని పురాణాలు చెబుతున్నాయి. 'రామ' అనే పదం వినగానే అంతరాత్మ మేల్కొని మెదడుకు సానుకూల ఆలోచనలు కలిగిస్తుంది. శ్రీరామ అనే పదం వింటే రక్త సరఫరా మెరుగై శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో ఉండే ఏడు చక్రాలలో రెండైన 'రా', 'ఓం'లు కలయికతో ఏర్పడే రామ్ అనే పదం వినగానే శరీరంలోని అంతర్గత శక్తి మేల్కొని అద్భుతాలు సృష్టిస్తుంది.
రాముని పట్ల భక్తితో ఉండటం ఆయన అనుసరించిన నియమాలను పాటించడం అంటే పరిపూర్ణమైన ఆధ్మాత్మికతతో జీవిస్తున్నట్లే. ఇంకా ఆయనను స్మరించుకుంటూ ఈ మంత్రాలను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే మీ కష్టాలను తుడిచేసి, సంపన్నులుగా మారుస్తాడని శాస్త్రం చెబుతుంది.
నిత్యం పఠించాల్సిన ఎనిమిదో మంత్రాలు:
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే,
రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమహ
ఈ మంత్రం పఠించడం వల్ల సదా శ్రీరాముని దయ మనపై ఉండి మనస్సులో ప్రశాంతత నెలకొంటుంది. అంతేకాకుండా సన్మార్గంలో నడిపిస్తాడు.
ఓం క్లీం నమో భగవతే రామచంద్రాయ సకలజన వశ్యం కరాయ స్వాహా
ఈ మంత్రం పఠించడం ద్వారా శ్రీరాముడు మహిమను అనుభవించడమే కాకుండా ఆయన గుణాలను అలవరచుకోవచ్చు.
ఓం దాశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహీ, తన్నో రామ ప్రచోదయాత్
రామ గాయత్రీ మంత్రం సీతమ్మ తల్లిని ధ్యానించే సందర్భంలో ఉపయోగిస్తారు. శ్రీరామునికి పవిత్రమైన సీతమ్మ తల్లిని తలుచుకున్న వెంటనే మెదడులో ఆలోచనలు స్థిరత్వాన్ని సంతరించుకుంటాయి.
శ్రీ రామ జయ రామ కోదండ రామ
రామ, కోదండ అనే పదాలు తిరుగులేని గుణాన్ని, అత్యున్నతమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. ఈ మంత్రం పఠించడం వల్ల విజయం ప్రాప్తించడం, ఆందోళనల నుంచి ఉపశమనం కలుగుతుంది.
హీన్ రామ్ హీన్ రామ్
ఆధ్మాత్మిక అవగాహన ప్రయత్నంలో ఉన్న వారికి ఈ మంత్రం మార్గదర్శినిలా పనిచేస్తుంది.
రామాయ నమహ
భక్తుడికి ఈ మంత్రం చదివితే తాను చేయాలనుకున్న పనిపై స్పష్టత పెరుగుతుంది. అంతేకాకుండా అపవిత్రంగా ఉన్న మనస్సును శుద్ధి చేస్తుంది.
శ్రీ రామ శరణం మమహ
ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం వల్ల శారీరకంగానూ, మానసికంగానూ వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు. దాంతోపాటు భౌతిక గాయాల నుంచి ఉపశమనం కలిగించి శరీరానికి సాంత్వన కలిగిస్తుంది.
శ్రీ రామచంద్రాయ నమహ
ఈ మంత్రం పఠించడం వల్ల చంద్ర భగవానుడితో పాటు శ్రీరాముడిని స్మరించినట్లు అవుతుంది. ఈ మంత్రోచ్ఛారణతో కలిగే ప్రతిధ్వనుల ఫలితంగా మానసికంగా ఉపశమనం కలిగి ప్రశాంతతను అందజేస్తాయి.