Rudraksha Rituals: రుద్రాక్షలను మహిళలు కూడా ధరించవచ్చా.? ఎటువంటి నియమాలతో ధరిస్తే శుభఫలితాలుంటాయి?
Rudraksha Rituals: మహాదేవుడు అనుగ్రహం పొందడానికి చాలా మంది రుద్రాక్షలను జపమాలగా, మెడలో మాలగా వాడుతుంటారు. ఇవి కేవలం మగవారు మాత్రమే వేసుకోవాలా..? మహిళలు ధరించకూడదా అనే అపోహ మీకూ ఉందా? అయితే నివృతి చేసుకుందాం రండి.
హిందువుల నమ్మకాల ప్రకారం, ఎంతో పవిత్రంగా భావించే రుద్రాక్షలు.. దుష్టశక్తుల నుంచి రక్షణ కల్పిస్తుంటాయి. ఉదాహరణకు మన చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఉంటే అది మనసులో ఆందోళనలు రేకెత్తించడంతో పాటు ఏ విషయంపైనా ధ్యాస ఉండనీయకుండా చికాకులు కలిగిస్తుంది. అటువంటి సమయాల్లో ప్రతికూల శక్తులు రుద్రాక్ష మెడలో ఉన్న వారికి దరికి రాకుండా కాపాడుతుంది. అంతేకాదు చెడు అలవాట్లు, వ్యసనాలకు కూడా దూరంగా ఉంచుతుంది.
మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా?
చాలా ఆచారాలు మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిలో రుద్రాక్ష వేసుకోవడం సంగతేంటి? ఈ చర్చకు సులువైన పరిష్కారం ఉంది. రుద్రాక్ష వేసుకునేందుకు మహిళలకు, మగాళ్లకు ఇద్దరికీ అనుమతి ఉంది. ఈ విషయంలో ఆ పరమశివుడు ఎటువంటి తారతమ్యాలు చూపించడు. తొలినాళ్లలో కేవలం మగవాళ్లు మాత్రమే వేసుకునే రుద్రాక్షలను కాలక్రమేణా మహిళలు కూడా ధరిస్తూ వస్తున్నారు. రుద్రాక్షలు ధరించిన పురుషులకు, మహిళలకు ఆ శివానుగ్రహం దివ్యంగా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
రుద్రాక్ష ధరించడంపై అపోహలు - వాస్తవాలు
రుద్రాక్షలు మహిళలు ధరించడంపై చాలా అపోహలు ఉన్నాయి. బోలెడు దుష్ప్రభవాలు ఉంటాయని, భారీ నష్టం వాటిల్లుతుందని చెప్తుంటారు. పార్వతీ దేవి శివుడి కళ్లను మూసినప్పుడు విశ్వం మొత్తం అంధకారం కమ్ముకుంటుంది. ఆ సమయంలో తాను చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు కంచికి వెళ్లి పరిహారం చేసుకుంటుంది. ఆ సమయంలో పార్వతీ దేవి రుద్రాక్షను ధరించే ఉన్నారు. దీనిని బట్టే తెలుస్తుంది మహిళలు రుద్రాక్షలు ధరించడంలో ఎటువంటి నిషేదాజ్ఞలు లేవని. ఇంకా ఆడవారు రుద్రాక్షలు ధరించడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. మహిళలు ఇవి ధరించడం వల్ల ఆధ్మాత్మిక శక్తి వ్యాపిస్తుంది. వారితో పాటు ఉన్న స్త్రీలు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. రుద్రాక్షలు శరీరంలోకి సానుకూల శక్తులు ప్రభావితం చేసేలా ప్రేరేపిస్తాయి.
రుద్రాక్షల ప్రాముఖ్యత:
హిందూ నమ్మకాల ప్రకారం, ఎంతో శక్తిమంతంగా భావించే శక్తి లేదా పార్వతీ దేవీ శివునిలో భాగమే. అర్ధనారీశ్వర రూపంతో సాక్షాత్ ఆ శివుడు కూడా తెలియజేసేది అదే. పురుషులు, మహిళలు సమానమని ఈ రూపమే చెప్తుంది. అందుకే మహిళలు కూడా రుద్రాక్షలు ధరించి ఆ మహిమలను, దైవిక శక్తిని అందుకోవచ్చని పురాణాలు సూచిస్తున్నాయి.
రుద్రాక్ష మాల కొనుగోలు చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సినవి:
- నమ్మకస్తుల దగ్గర్నుంచే రుద్రాక్షలు లేదా రుద్రాక్ష మాలను కొనుగోలు చేయాలి.
- జపమాల అనేది బాగా బిగుతుగా ఉండకూడదు. అందులోని రుద్రాక్షలు చక్కటి అమరికతో పొందుపరిచి ఉండాలి.
- జపమాలలో సుమేరు రుద్రాక్షలు కూడా ఉండేలా చూసుకోవాలి. ఒక్కొక్క మాలలో మొత్తం 109 రుద్రాక్షలు ఉండాలి.
రుద్రాక్షమాలను వాడే విధానం..
- రుద్రాక్ష మాలను స్వచ్ఛమైన నీటితో కడగాలి.
- ఆరబెట్టిన తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడవాలి.
- ఒక రాత్రి మొత్తం నెయ్యిలో మాలను నానబెట్టాలి.
- ఆ తర్వాత ఆవు పాలలో 24గంటల పాటు ఉంచాలి.
- మరుసటి రోజు పూజ చేసి శివ మంత్రం జపిస్తూ రుద్రాక్షను మెడలో వేసుకోవాలి.
- ఒకవేళ ఆవు పాలు, ఆవు నెయ్యి దొరకని పక్షంలో నూనెను వాడుకోవచ్చు.
- మాలను నానబెట్టేందుకు గాజు పాత్రలు వినియోగించుకోకూడదు. తప్పకుండా లోహపు పాత్రను మాత్రమే వాడాలి. రుద్రాక్షను వేసుకునే ముందు సున్నితంగా నుదుటికి ఆనించుకుని శివనామస్మరణ చేయాలి.
రుద్రాక్షను ధరించే సమయంలో నియమాలు
1. ఉదయ సమయంలో రుద్రాక్ష ధరిస్తే, రుద్రాక్ష ఉద్భవ మంత్రాన్ని 9 సార్లు పఠించండి.
2. ధరించి పక్కకు పెట్టే సమయంలో రుద్రాక్షను పూజా గృహంలో ఉంచండి.
3. ఉదయ సమయంలో శుభ్రంగా ఉన్నప్పుడు రుద్రాక్ష ధరించడం ఉత్తమం. ఇది ధరిస్తున్నప్పుడు మంత్రం పఠించండి.
4. రుద్రాక్షను పూజించేటప్పుడు, అగరుబత్తిని లేదా హారతిని ఇవ్వండి.
5. రుద్రాక్షను ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. దుమ్ము, మురికి రుద్రాక్షల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. కాబట్టి నిత్యం శుభ్రం చేస్తుండాలి.
6. దారాన్ని మారుస్తూ ఉండండి. అది మురికిగా లేదా బలహీనంగా ఉన్నట్లయితే. శుభ్రపరిచిన తర్వాత, దానిని స్వచ్ఛమైన నీటితో లేదా పాలతో కడగండి.
7. శుభ్రపరిచిన తర్వాత బీడ్స్ కు నూనెలో ఉంచండి. దీర్ఘకాలం పాటు ఉపయోగించే ఆలోచన లేకపోతే శుభ్రమైన, పవిత్రమైన స్థలంలో ఉంచండి.
8. రుద్రాక్ష రూపం, పరిమాణం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు కొనుగోలు చేసే ముఖి కచ్చితంగా, సహజమైనది. విరగకుండా ఉంటే చాలు.
9. రుద్రాక్ష స్వభావం శక్తివంతమైనది కావడంతో, ప్రతి వ్యక్తి దీన్ని ధరించలేరు. కొంతమందిలో అలర్జిక్ లక్షణాలు రావచ్చు. అలాంటి వారు రుద్రాక్షను పూజా గృహంలో ఉంచి దాన్ని పూజించవచ్చు.
10. మాలలో 108 లేదా 54 బీడ్స్ ఉంటాయి. 27 బీడ్స్ తో కూడిన జపమాల కూడా ఉపయోగించవచ్చు. ప్రతి మాలకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఉంటుంది. కాబట్టి జప మాలలను, మెడలో వేసుకునే మాలలను ఒకదాని బదులు ఒకటి ఉపయోగించవద్దు.
11. రుద్రాక్ష మాలను శివాలయంలోకి తీసుకెళ్లి రుద్రాభిషేకం చేయించండి. తరువాత శివ మంత్రాన్ని కనీసం 3 సార్లు పఠించండి.
12. బీడ్స్ ను వెండి గిన్నెలో వేయడం ఉత్తమం. ఎందుకంటే ఇది పవిత్రమైన, దివ్యమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. బంగారం, వెండి, కృష్ణవర్ణ లేదా నలుపు గిన్నె కూడా ఉపయోగించవచ్చు.
13. స్నానం చేసే సమయంలో రుద్రాక్షలను తీసేయాలి.
14. రుద్రాక్షను ప్రేమ, విశ్వాసం, గౌరవంతో ధరించాలి. అన్ని వయస్సుల వారు, గోత్రాలు, లింగం, సంస్కృతి, మతం, స్థలంపై పరిమితులు లేకుండా రుద్రాక్ష ధరిస్తారు.
15. రుద్రాక్ష చాలా విలువైనది. దానిని శక్తివంతంగా చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. సోమవారం శివుని కోసం ప్రత్యేకమైన రోజు కావడంతో, రుద్రాక్ష ధరించడం అత్యంత శుభవంతమైనది. కానీ మీరు సరైన పూజలు చేసిన తర్వాత ఎలాంటి రోజులోనైనా రుద్రాక్ష ధరించవచ్చు.