తెలుగు న్యూస్ / ఫోటో /
Chandrababu And Pawan: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ..నాగబాబుకు ఇచ్చే శాఖ సహా కీలక అంశాలపై చర్చ
- Chandrababu And Pawan: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.పోలవరం పర్యటన ముగించుకుని సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు.నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోనున్న నేపథ్యంలో కేటాయించే శాఖపై చర్చించారు

(1 / 4)
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయనకు కేటాయించే శాఖలపై కూడా ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది.
(2 / 4)
చంద్రబాబుతో జరిగిన భేటీలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించి అంశాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. త్వరలో జరిగే సహకారం సంఘాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
(3 / 4)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికలు పూర్తవడం, కొత్త సభ్యులు కొలువుదీరిన నేపథ్యంలో నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయంపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది.
(4 / 4)
చంద్రబాబుతో జరిగిన భేటీలో నామినేటెడ్ పదవుల తుది జాబితాను ఖరారు చేయడంతో పాటు ఇతర అంశాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాబోయే సహకార ఎన్నికల్లోనూ ఇదే తరహా సమన్వయం కొనసాగించాలని ఇరువురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇతర గ్యాలరీలు