తెలుగు న్యూస్ / ఫోటో /
Rythu Bharosa Update : రైతు భరోసాపై కీలక అప్డేట్- ఎవరెవరికి, సీలింగ్ పై సిఫార్సులిలా
Rythu Bharosa Update : సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనేదానిపై ప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రైతు భరోసా లిమిట్, ఇతర అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
(1 / 6)
సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని తెలంగాణ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనేదానిపై ప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రైతు భరోసా లిమిట్, ఇతర అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
(2 / 6)
రైతు భరోసా నిధులు పక్క దారి పట్టకుండా ఉండేందుకు కేబినెట్ సబ్ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని సూచించింది. రైతు భరోసా అమలుపై చేపట్టిన అభిప్రాయ సేకరణ ప్రకారం... ఎపెట్టుబడి సాయంపై పరిమితి పెట్టాలని సూచనలు వచ్చాయని తెలిపింది. మెజార్టీ రైతులు ఏడు, ఏడున్నర ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని తెలిపింది. మరికొంత మంది 10 ఎకరాలు, ఇంకొంత మంది 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని సూచించారని సబ్ కమిటీ తెలిపింది.
(3 / 6)
రాష్ట్రంలోని భూకమతాల్లో 5 ఎకరాల వరకు ఉన్న చిన్న, సన్నకారు రైతులు 90 శాతం ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయని కేబినెట్ సబ్ కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ మేరకు 7 నుంచి 10 ఎకరాల వరకు రైతు భరోసా సాయం అందించాలని రైతులు అభిప్రాయపడ్డారని తెలిపింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు గ్రూప్-1 ఆఫీసర్లకు రైతు భరోసా పెట్టుబడి సాయం ఇవ్వనవరసం లేదని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది.
(4 / 6)
ఎన్నికల హామీ మేరకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉందని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. గతంతో రైతు బంధు కింద ఎకరాకు రూ.5 వేలు చొప్పున అందించారు. కొండలు, గుట్టులు, చెట్టుపుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు, భూసేకరణ భూములకు కూడా గతంలో రైతు బంధు జమ చేసింది. దీంతో ఏటా వేల కోట్లి వృథా అయ్యాయని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది.
(5 / 6)
రైతులు ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు సాగు చేస్తున్నారో ఏఈఓలు ఆన్ లైన్ లో నమోదు చేశారని కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం సాగైన భూములకు ఎకరాకు రూ.7,500 చొప్పున రైతు భరోసా జమ చేస్తే ప్రతి సీజన్ కు దాదాపు రూ.10 వేల కోట్లు అవసరమని ఆర్థిక శాఖ చెబుతోంది. సీలింగ్పెట్టినా, ప్రజాప్రతినిధులు, అధికారులు, ట్యాక్స్కట్టే వాళ్లను మినహాయిస్తే ఈ మొత్తం తగ్గనుంది.
ఇతర గ్యాలరీలు