SIP Vs RD : నెలకు 10 వేలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సిప్ లేదా ఆర్‌డీలో ఎక్కువ రాబడి ఏది ఇస్తుంది?
SIP Vs RD : ఇటీవలికాలంలో ఇన్వెస్ట్ చేసే ఆసక్తి జనాల్లో పెరిగింది. దీంతో అనేక పెట్టుబడి పద్ధతుల గురించి చూస్తున్నారు. మీకు కూడా ఆసక్తి ఉంటే సిప్ లేదా ఆర్‌డీలో ఏది బెటర్ అని చూడండి.
ఇన్వెస్ట్ చేసేవాళ్లు రిస్క్ ఉన్నది, రిస్క్ లేని పథకాల గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఎందులో పెట్టుబడి పెట్టాలో నిర్ణయం తీసుకోవాలి. పెట్టుబడిదారులలో మ్యూచువల్ ఫండ్ SIP, RD చాలా ప్రసిద్ధ ప్లాట్‌ఫారమ్‌లు. మీరు నెలకు రూ. 10,000 పెట్టుబడి పెట్టాలనుకుంటే మ్యూచువల్ ఫండ్ సిప్ లేదా పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ మధ్య ఏది బెటర్ ఆప్షన్ అని తెలుసుకోవాలి. అప్పుడే సరిగా డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది. 5 సంవత్సరాల ఆధారంగా డబ్బులు పెట్టుబడి పెట్టడం గురించి చూద్దాం..
బ్యాంక్‌లో వివిధ కాలాల ప్రకారం ఆర్డీలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని చూస్తారు. కానీ మీరు పోస్టాఫీసు ద్వారా ఆర్‌డీలో పెట్టుబడి పెడితే మీకు నిర్దిష్ట సమయం ఉంటుంది. మీకు 5 సంవత్సరాల కాలపరిమితి ఎంపిక తీసుకున్నారు అనుకుందాం. పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మీకు మంచి రాబడి వస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో 6.7 శాతం వడ్డీని అందిస్తోంది.
మ్యూచువల్ ఫండ్ సిప్‌లో మార్కెట్ రిస్క్‌లు చూడాల్సి వస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో మార్కెట్ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. పోస్టాఫీసు ఆర్డీలో 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.10 వేలు పెట్టుబడి పెడితే మీ మొత్తం పెట్టుబడి రూ.6 లక్షలు అని అనుకుంటే మీరు 6.7 శాతం వడ్డీతో రూ. 1,13,659 పొందుతారు. మీరు మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 7,13,659 డబ్బును తీసుకుంటారు.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి సిప్ అనేది సులభమైన మార్గం. సిప్ మ్యూచువల్ ఫండ్‌లు.. పోస్టాఫీసు ఆర్డీ కంటే ఎక్కువ నష్టాన్ని కలిగి ఉంటుంది. మీరు 5 సంవత్సరాల పాటు మ్యూచువల్ ఫండ్ సిప్‌లో రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తే, మీ మొత్తం పెట్టుబడి రూ. 6 లక్షలు అవుతుంది. దీనిలో మీరు 12 శాతం కనీస రాబడి ప్రకారం రూ. 2,24,864 పొందుతారు. మీరు 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీగా రూ. 8,24,864 పొందుతారు.
హామీతో కూడిన రాబడిని కోరుకుంటే పోస్ట్ ఆఫీస్ ఆర్డీ బెటర్ ఆప్షన్. అదే సమయంలో గరిష్ట రాబడిని కోరుకుంటూ.. మార్కెట్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే మ్యూచువల్ ఫండ్ సిప్ బాగుంటుంది. మ్యూచువల్ ఫండ్ సిప్ లేదా పోస్ట్ ఆఫీస్ ఆర్డీ మీరు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.