Mutual Funds SIP : రూ.10 వేల నెలవారీ సిప్‌లో ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే 5 కోట్లకు చేరుకుంటుంది
Mutual Funds SIP : మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయి. అయితే మీరు చేసే ఇన్వెస్ట్‌తో 5 కోట్ల రూపాయలు కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఇక్కడ చూడండి.
మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ అయినా.. దీర్ఘకాలిక పెట్టుబడి మంచి రాబడిని ఇస్తుందని నిపుణులు చెప్పే మాట. ఈ మధ్యకాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ మీరు మంచి వడ్డీ పొందుతారు. 12 శాతం సగటు రాబడితో రూ.5 కోట్లకు చేరుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఇక్కడ చూద్దాం..
స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్‌లు ఉంటాయి. నిజానికి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, గోల్డ్ బాండ్‌లు వంటి సాంప్రదాయ పెట్టుబడి పథకాలు రిస్క్ లేనివి. హామీ ఆదాయాన్ని అందిస్తాయి. కానీ స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలికంగా మంచి రాబడిని అందజేస్తాయని నిపుణులు అంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ మీద జనాలు ఆసక్తి చూపడానికి కారణం ఇక్కడ పొందే వడ్డీ.
చాలా మ్యూచువల్ ఫండ్స్ సగటు రాబడి 12 శాతం కంటే ఎక్కువ. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు మీరు మునుపటి సంవత్సరాల రాబడిని చూడాలి. ఆర్థిక నిపుణుల సలహా తీసుకుంటే ఇంకా మంచిది. సరైన దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యంగా సిప్‌లు, దీర్ఘకాలంలో అద్భుతమైన రాబడిని అందిస్తాయి.
సిప్‌లో కనిష్టంగా రూ. 500 నుండి పెట్టుబడి పెట్టవచ్చు. మీ ఆదాయాన్ని బట్టి పెంచుకోవచ్చు. ఏడాదికి సగటున 12 శాతం రాబడిని ఆశించి, సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.లక్ష వరకు పెట్టుబడి పెడితే, రూ. 5 కోట్లు సంపాదించాలంటే ఎంత కాలం పడుతుందో చూద్దాం..
నెలవారీ రూ. 10,000 సిప్ చేస్తే సంవత్సరానికి 12 శాతం చొప్పున రూ. 5 కోట్లకు పెరగడానికి 32 సంవత్సరాల 11 నెలల సమయం పడుతుంది. నెలకు రూ. 20 వేల సిప్ చేస్తే 27 సంవత్సరాల 3 నెలల్లో రూ.5 కోట్లు సంపాదించవచ్చు. నెలవారీ రూ.25 వేలు సిప్ చెల్లిస్తే రూ.5 కోట్లు రావాలంటే 25 ఏళ్ల 6 నెలల సమయం పడుతుంది. నెలవారీ రూ.30,000 సిప్‌తో 24 ఏళ్లు పడుతుంది. 40,000 నెలవారీ ఇన్వెస్ట్‌తో 21 సంవత్సరాల 9 నెలల వరకు పడుతుంది. రూ. 50,000 నెలవారీ సిప్ 12 శాతం వార్షిక రేటుతో 20 సంవత్సరాలు అవుతుంది. నెలకు రూ. రూ.75,000 సిప్ లెక్కింపుపై 5 కోట్లు సంపాదించడానికి 17 సంవత్సరాలు పడుతుంది. లక్ష పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో రూ.5 కోట్లు పొందవచ్చు. నెలవారీ సిప్ మీకు మంచి రాబడులను అందిస్తుంది.
గమనిక : మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందని చెప్పలేం. భవిష్యత్తులో మారుతూ ఉండవచ్చు. ఆర్థిక నిపుణుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టండి.