Postal Suraksha Policy : పోస్టల్ సురక్ష స్కీమ్- నెలకు రూ.1400 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు-postal life insurance suraksha policy maturity benefits eligibility other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Postal Suraksha Policy : పోస్టల్ సురక్ష స్కీమ్- నెలకు రూ.1400 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు

Postal Suraksha Policy : పోస్టల్ సురక్ష స్కీమ్- నెలకు రూ.1400 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు

Bandaru Satyaprasad HT Telugu
Dec 11, 2024 02:03 PM IST

Postal Suraksha Policy : పోస్టల్ శాఖ లైఫ్ ఇన్యూరెన్స్ విభాగంలో సురక్ష పాలసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ పాలసీలో పాలసీదారుడు ప్రతి నెలా రూ.1400 చెల్లిస్తే మెచ్యూరిటీ సమయానికి రూ.35 లక్షలు పొందుతారు. ఈ స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పోస్టల్ సురక్ష స్కీమ్- నెలకు రూ.1400 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు
పోస్టల్ సురక్ష స్కీమ్- నెలకు రూ.1400 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు

Postal Suraksha Policy : ఆకర్షణీయమైన పెట్టుబడుల్లో పోస్టల్ లైఫ్ ఇన్యూరెన్స్ ఒకటి. పోస్టల్ ఇన్యూరెన్స్ హోల్ లైఫ్ అష్యూరెన్స్ లో భాగంగా 'సురక్ష' పాలసీ ప్రవేశపెట్టింది. తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడికి ఈ పాలసీ చక్కటి మార్గం. ఈ పథకంలో పాలసీదారుడు ప్రతి నెలా రూ.1500 క్రమం తప్పకుండా జమ చేయడం ద్వారా నిర్ణీత సమయం తర్వాత రూ.31-35 లక్షల ప్రయోజనం పొందుతారు. పాలసీదారుడు 80 ఏళ్ల వయస్సులో లేదా బీమా చేసిన వ్యక్తి మరణిస్తే నామినీకి బోనస్‌తో హామీ ఇచ్చిన మొత్తాన్ని చెల్లిస్తారు.

పోస్టల్ సురక్ష స్కీమ్ ముఖ్యాంశాలు

  • ఈ పాలసీ చేరేందుకు కనీస గరిష్ట వయస్సు: 19-55 సంవత్సరాలు
  • మినిమమ్ సమ్ అష్యూర్డ్ : రూ.20,000, గరిష్టంగా రూ. 50 లక్షలు
  • 4 సంవత్సరాల లోన్ సదుపాయం
  • 3 సంవత్సరాల సరెండర్ సదుపాయం
  • 5 సంవత్సరాల కంటే ముందు పాలసీ సరెండర్ చేస్తే బోనస్‌ లభించదు.
  • ప్రీమియం చెల్లింపు వ్యవధి 55, 58 లేదా 60 సంవత్సరాలుగా నిర్ణయించుకోవచ్చు.
  • పాలసీని సరెండర్ చేసినట్లయితే హామీ మొత్తంపై దామాషా బోనస్ చెల్లి్స్తారు.
  • చివరిగా ప్రకటించిన బోనస్- సంవత్సరానికి రూ. 1000 సమ్ అష్యూర్డ్ పై రూ. 76 బోనస్
  • ఈ పాలసీ ప్రీమియం చెల్లింపు- నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షికం
  • ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

ఈ పాలసీపై లోన్ సదుపాయం

సత్య 19 సంవత్సరాల వయస్సులో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో సురక్ష ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. అతడు రూ.10 లక్షల పాలసీని కొనుగోలు చేస్తే... నెలవారీ ప్రీమియం మొత్తం 55 సంవత్సరాలకు రూ.1515, 58 సంవత్సరాలకు రూ.1463, 60 సంవత్సరాలకు రూ.1411. పాలసీదారుడు మెచ్యూరిటీ ప్రయోజనం 55 సంవత్సరాలకు రూ.31.60 లక్షలు, 58 సంవత్సరాలకు రూ.33.40 లక్షలు, 60 సంవత్సరాలకు రూ.34.60 లక్షలు పొందుతారు. ప్రీమియం చెల్లింపు విత్ డ్రా తేదీ లేదా మెచ్యూరిటీ తేదీ నుంచి 1 సంవత్సరంలోపు కన్వర్షన్ తేదీ రాకపోతే, పాలసీదారుని 59 సంవత్సరాల వయస్సు వరకు ఈ పథకాన్ని ఎండోమెంట్ అష్యూరెన్స్ ప్లాన్‌గా మార్చుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం