Lava Blaze Duo 5G : రెండు డిస్‌ప్లేలతో వచ్చిన లావా ఫోన్.. 64ఎంకీ కెమెరా, అందుబాటు ధరలోనే దొరుకుతుంది!
Lava Blaze Duo 5G Launched : లావా నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రత్యకత ఏంటంటే ఇందులో రెండు డిస్‌ప్లే ఉంటాయి. లావా బ్లేజ్ డ్యూయో 5జీ గురించి తెలుసుకుందాం..
లావా డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్ లావా బ్లేజ్ డ్యూయో 5జీని లాంచ్ చేసింది. ఈ ఫోన్ సెకండరీ అమోఎల్ఈడీ రియర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనిని కంపెనీ ఇన్స్టాస్క్రీన్ అని పిలుస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో లావా అగ్ని 3 5జీ లాంచ్ అయిన తర్వాత డ్యూయల్ డిస్‌ప్లేతో లావాకు ఇది రెండో స్మార్ట్‌ఫోన్. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 3డీ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. లావా బ్లేజ్ డ్యూయో 5జీ ధర, ఫీచర్లు చూద్దాం...
లావా బ్లేజ్ డ్యూయో 5జీ రెండు రంగుల్లో లభిస్తుంది. సెలెస్టియల్ బ్లూ, ఆర్కిటిక్ వైట్. 128 జీబీ స్టోరేజ్‌తో 6 జీబీ, 8 జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. లావా బ్లేజ్ డ్యూయో 5జీ.. 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.17,999గా నిర్ణయించారు. డిసెంబర్ 20 నుంచి అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్ కార్డుతో ఈ లావా ఫోన్‌ను రూ.2000 ఇన్ స్టంట్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.
లావా బ్లేజ్ డ్యూయో 5జీ వెనుక భాగంలో 1.58 అంగుళాల సెకండరీ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది లావా బ్లేజ్ 4 5జీ 1.74 అంగుళాల సెకండరీ ఇన్‌స్టాస్క్రీన్ కంటే కొంచెం చిన్నది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ఎస్ఓసీ ప్రాసెసర్‌రై ఈ ఫోన్ పనిచేయనుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు.
బ్లోట్ వేర్ లేకుండా ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ త్వరలోనే ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. లావా బ్లేజ్ డ్యూయో 5జీ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో యూనిట్ ఉన్నాయి. ముందువైపు బ్లేజ్ డ్యూయో 5జీలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ ఫోన్ సెకండరీ అమోఎల్ఈడీ రియర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనిని కంపెనీ ఇన్స్టాస్క్రీన్ అని పిలుస్తుంది. కాల్స్ స్వీకరించడానికి, సందేశాలను వీక్షించడానికి, సెల్ఫీలను షూట్ చేయడానికి, మ్యూజిక్ ప్లేయర్, స్టెప్స్ అండ్ క్యాలరీ ట్రాకర్, వాయిస్ రికార్డర్, టైమర్, స్టాప్‌వాచ్ వంటివాటిని ఉపయోగించడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. 5,000mAh, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఉంటుంది.
టాపిక్