Bigg Boss Winner Nikhil: బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ యాభై ఐదు లక్షల్లో నిఖిల్‌కు దక్కింది సగమే - కారణం ఇదే
Bigg Boss Winner Nikhil: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్‌గా నిఖిల్ నిలిచాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో రామ్‌చరణ్ చేతులు మీదుగా నిఖిల్ బిగ్‌బాస్ ట్రోఫీని అందుకున్నాడు. విన్నర్‌గా నిలిచిన నిఖిల్ యాభై ఐదు లక్షల ప్రైజ్‌మనీలో సగమే దక్కించుకున్నట్లు సమాచారం. కారణం ఏమిటంటే?
Bigg Boss Winner Nikhil: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్‌గా నిఖిల్ మలియాక్కల్ నిలిచాడు. ఫైనల్ వరకు నిఖిల్‌కు గౌతమ్ కృష్ణ గట్టి పోటీ ఇచ్చాడు. చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. నిఖిల్, గౌతమ్‌తో పాటు నబీల్, ప్రేరణ, అవినాష్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌గా గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చారు.
అవినాష్...ప్రేరణ...
గ్రాండ్ ఫినాలేలో తొలుత అవినాష్ ఎలిమినేట్ కాగా...ఆ తర్వాత ప్రేరణ హౌజ్ నుంచి బయట అడుగుపెట్టింది. టాప్ త్రీలో నబీల్, నిఖిల్, గౌతమ్‌లకు సూట్‌కేస్ చూపించాడు నాగార్జున. అందులో ఎంత మొత్తం ఉన్నది చెప్పకుండా ఆ సూట్‌కేస్ తీసుకొని ఒకరు ఎలిమినేట్ కావచ్చునని ఆఫర్ ఇచ్చాడు.
కానీ సూట్‌కేస్ తీసుకోవడానికి ముగ్గురు అంగీకరించలేదు. టాప్ త్రీలో నుంచి నబీల్ ఎలిమినేట్ కావడంతో గౌతమ్, నిఖిల్ మిగిలిపోయారు. ఈ ఇద్దరిలో నిఖిల్‌ను విన్నర్‌గా నాగార్జున ప్రకటించారు. రామ్‌చరణ్ చేతుల మీదుగా బిగ్‌బాస్ 8 ట్రోఫీని నిఖిల్ అందుకున్నాడు.
యాబై ఐదు లక్షలు...
బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన నిఖిల్‌కు యాభై ఐదు లక్షల ప్రైజ్‌మనీతో పాటు ఓ కారు బహుమతిగా దక్కింది. బిగ్‌బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ ప్రైజ్‌మనీ అందుకున్న విన్నర్‌గా నిఖిల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ ప్రైజ్‌మనీలో నిఖిల్‌కు సగం కంటే తక్కువే దక్కినట్లు సమాచారం.
బిగ్‌బాస్ విన్నర్స్ ప్రైజ్‌మనీలో యాభై శాతం జీఎస్‌టీతో పాటు ఇతర టాక్స్‌ల రూపంలోనే కట్ అవుతూ వస్తోంది. నిఖిల్ ప్రైజ్‌మనీలో నుంచి 30 లక్షల వరకు టాక్సులు రూపంలో కోత విధించినట్లు సమాచారం. యాభై ఐదు లక్షల ప్రైజ్‌మనీలో టాక్సులు పోను అతడికి 25 లక్షల వరకు మాత్రమే దక్కినట్లు చెబుతోన్నారు.
రెమ్యునరేషన్ మాత్రం భారీగానే...
టాక్సులు కారణంగా ప్రైజ్ మనీలో దాదాపు సగం నష్టపోయినా రెమ్యునరేషన్ రూపంలో అతడికి లక్ కలిసివచ్చినట్లు చెబుతోన్నారు.
వారానికి రెండులక్షల ఇరవై ఐదు వేల రెమ్యునరేషన్‌తో బిగ్‌బాస్ హౌజ్‌లోకి నిఖిల్ ఎంట్రీ ఇచ్చినట్లు చెబుతోన్నారు. ఫైనల్ వరకు మొత్తం పదిహేను వారాలు హౌజ్‌లో ఉన్న నిఖిల్‌కు 34 లక్షల వరకు రెమ్యునరేషన్ దక్కినట్లు చెబుతోన్నారు.
బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికంటే ముందు తెలుగులో గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ, ఊర్వశివో రాక్షసివోతో పాటు మరికొన్ని సీరియల్స్ చేశాడు నిఖిల్.