Tollywood Heroes: ఒకే ఏడాదిలో 18 సినిమాలు చేసిన తెలుగు హీరో ఎవరంటే? - ఎన్టీఆర్, చిరంజీవికి సాధ్యం కానీ రికార్డ్
Tollywood Heroes: ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన తెలుగు హీరోగా సూపర్ కృష్ణ రికార్డును నెలకొల్పాడు. 1972 ఏడాదిలో కృష్ణ 18 సినిమాలు చేశాడు. ఈ ఏడాది రిలీజైన పండంటి కాపురం మూవీ నేషనల్ అవార్డును గెలుచుకోవడం గమనార్హం.
Tollywood Heroes: ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా కష్టంగా మారిపోయింది. మహేష్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ తోపాటు మరికొందరు హీరోలు రెండు, మూడేళ్లకు ఒక సినిమా చేస్తోన్నారు. మహేష్‌బాబు హీరోగా ఇప్పటివరకు 29 సినిమాలు మాత్రమే చేశాడు. ప్రస్తుతం రాజమౌళితో 30వ మూవీ చేయబోతున్నాడు. మహేష్‌బాబు 25 ఏళ్ల కెరీర్‌లో చేసిన సినిమాలను అతడి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కేవలం రెండేళ్లలోనే కంప్లీట్ చేయడం గమనార్హం.
1972లో 18 సినిమాలు...
1972 ఏడాదిలో సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా 18 సినిమాలు చేశాడు. ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన టాలీవుడ్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. కృష్ణ రికార్డును ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌తో పాటు చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు ఇప్పటివరకు బ్రేక్ చేయలేకపోయారు. ఇకపై చేయడం కూడా అసాధ్యమే.
గూడుపుఠానీ...కత్తుల రత్తయ్య
1972లో నెలకు ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కృష్ణ. మోసగాడొస్తున్నాడు జాగ్రత్త, రాజమహల్, గూడుపుఠానీ, కోడలు పిల్ల, పండటి కాపురం, నిజం నిరూపిస్తా, కత్తుల రత్తయ్య, ప్రజానాయకుడు, ఇల్లు ఇల్లాలుతో సహా 1972లో కృష్ణ నటించిన 18 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
నేషనల్ అవార్డ్...
ఆ ఏడాది కృష్ణ చేసిన పండటి కాపురం మూవీ ఏకంగా నేషనల్ అవార్డును గెలుచుకుంది. గూడుపుఠానీ, కత్తులరత్తయ్యతో పాటు పలు సినిమాలు కమర్షియల్ సక్సెస్‌లుగా నిలిచాయి.
ఎన్టీఆర్...
ఓ సినిమా షూటింగ్‌కు ప్యాకప్ చెప్పగానే...నేరుగా మరో సినిమా సెట్‌కు...ఇలా మూడు షిప్టుల్లో పనిచేశారు కృష్ణ. 1973లో 15, 1974లో కృష్ణ నటించిన పధ్నాలుగు సినిమాలు రిలీజ్ కావడం గమనార్హం.
కృష్ణ తర్వాత ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన టాలీవుడ్ హీరోగా ఎన్టీఆర్ నిలిచాడు. 1964లో ఎన్టీఆర్ 17 సినిమాలు చేశాడు. కృష్ణంరాజు (1974 లో 17 సినిమాలు), రాజేంద్రప్రసాద్ (1988లో 17 సినిమాలు)లతో ఎన్టీఆర్‌తో సమంగా నిలిచారు.
1980లో పధ్నాలుగు సినిమాలు...
వీరి తర్వాతి ప్లేస్‌లో చిరంజీవి ఉన్నాడు. 1980లో చిరంజీవి నటించిన 14 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. పున్నమినాగు, నకిలీ మనిషి, కాళి, లవ్ ఇన్ సింగపూర్‌తో పాటు ఆ ఏడాది పలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు చిరంజీవి. బాలకృష్ణ 1987లో ఏడు సినిమాలు చేశాడు. ఒకే ఏడాదిలో అతడు చేసిన అత్యధిక సినిమాలు ఇవే.