Action OTT: ఓటీటీలోకి శివరాజ్‌కుమార్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Action OTT: శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరతి రణగల్ డిసెంబర్ నెలాఖరున ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్‌లో క్రిస్మక్ వీక్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరుగుతోంది. తెలుగులో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు.
Action OTT: శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరతి రణగల్ థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శివరాజ్‌కుమార్, శ్రీ మురళి హీరోలుగా 2017లో రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మఫ్తీకి ప్రీక్వెల్‌గా భైరతి రణగన్ మూవీ తెరకెక్కింది. నార్తన్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
అమెజాన్ ప్రైమ్ వీడియో...
భైరతి రణగల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. డిసెంబర్ నెలాఖరున క్రిస్మిస్ వీక్‌లో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 25 లేదా 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు. త్వరలోనే భైరతి రణగల్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. ఓటీటీలో కన్నడంతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ కానుంది.
రుక్మిణి వసంత్ హీరోయిన్...
భైరతి రణగల్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. రాహుల్ బోస్ విలన్‌గా కనిపించాడు. 21 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 30 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. భైరతి రణగల్ మూవీకి శివరాజ్‌కుమార్ సతీమణి గీతా శివరాజ్‌కుమార్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు.
భైరతి రణగల్ కథ...
రోనాపురం ఊరి ప్రజలు పడుతోన్న కష్టాలను పరిష్కరించే క్రమంలో భైరతి (శివరాజ్‌కుమార్) జైలుపాలవుతాడు. అక్కడే కష్టపడి చదివి లాయర్ అవుతాడు. రోనాపురం భూముల్లో కోట్ల విలువైన ఖనిజాలు బయటపడతాయి. మైనింగ్ బిజినెస్ పేరుతో ఊరిలోని భూములను బిజినెస్‌మెన్ పరండే (రాహుల్ బోస్) ఆక్రమించుకోవడం మొదలుపెడతాడు.
పరండే అక్రమాలను కోర్టు ద్వారా అడ్డుకోవాలని చూస్తాడు. కానీ పరండే అధికారం, డబ్బు ముందు భైరతి ఓడిపోతాడు. ఆ తర్వాత ఏమైంది. రోనాపురాన్ని పరండే బారి నుంచి భైరతి ఎలా కాపాడాడు? ఈ పోరాటంలో అతడికి అండగా నిలిచిన వైశాలి (రుక్మిణి వసంత్) ఎవరు అనే అంశాలతో యాక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు.
తెలుగులో నిల్...
నవంబర్ 29న కన్నడం, తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో థియేటర్లలో రిలీజైంది భైరవతి రణగల్ మూవీ. కన్నడంలో భారీగా వసూళ్లను రాబట్టిన ఈ మూవీ తెలుగులో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ప్రస్తుతం శివరాజ్‌కుమార్ తెలుగులో ఓ మూవీ చేస్తోన్నాడు. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో రూపొందుతోన్న ఆర్‌సీ 16 మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.