Palnadu Cruel Sister: తండ్రి ఆస్తి, పెన్షన్ కోసం అన్న, తమ్ముడిని చంపేసిన యువతి, మృతుల్లో ఒకరు కానిస్టేబుల్
Palnadu Cruel Sister: పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.తండ్రి ఆస్తితో పాటు పెన్షన్ మీద కన్నేసిన యువతి అందుకు అడ్డుగా ఉన్న అన్న,తమ్ముడిని కడతేర్చింది.యువతి చేతిలో హత్యకు గురైన వారిలో ఒకరు పోలీస్ కానిస్టేబుల్… విధులకు హాజరు కాకపోవడంతో అనుమానించి ఆరా తీసిన పోలీసులు నిజం తెలిసి షాక్ అయ్యారు.
Palnadu Cruel Sister: పల్నాడులో ఓ యువతి కిరాతకం పోలీసుల్నే షాక్‌కు గురి చేసింది. ఆస్తితో పాటు తండ్రి పెన్షన్‌కు అడ్డు తగులుతున్నారనే అక్కసుతో ఓ యువతి అన్న, తమ్ముడిని కిరాతకంగా హతమార్చింది. శవాలను కూడా మాయం చేసింది.
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పక్షవాతంతో మృతిచెందిన తండ్రికి వచ్చే పెన్షన్, ఆర్ధిక ప్రయోజనాలు మొత్తం కాజేయాలనే ఉద్దేశంతో అడ్డుగా ఉన్న అన్న, తమ్ముడిని చంపేసింది. కొద్దిరోజులుగా విధులకు హాజరు కాకపోవడంతో అరా తీసిన పోలీసులు ఆస్తి కోసం తోడబుట్టిన వారిని యువతి చంపేసిందని తెలిసి షాక్ అయ్యారు.
ఆంధ్రప్రదేవ్‌లోని పల్నాడు జిల్లా నకరికల్లు యానాది కాలనీకి చెందిన పౌలిరాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆయనకు ముగ్గురు సంతానం ఉన్నారు. పౌలిరాజు భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయారు.నకరికల్లు గిరిజన సుక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపా ద్యాయుడిగా పనిచేస్తుండగా పక్షవాతంతో ఈ ఏడాది జనవరిలో మృతిచెందారు.
పౌలిరాజు పెద్ద కుమారుడు గోపీకృష్ణ, బొల్లాపల్లి మండలు, బండ్లమోటు పోలీస్ స్టేషన్‌లో కాని స్టేబుల్‌గా పనిచేసేవారు. , రెండో సంతానమైన కుమార్తె కృష్ణవేణి పెళ్లైన తర్వాత కుటుంబ కలహాలతో భర్తను వదిలి పుట్టింట్లో ఉంటోంది. మూడో సంతానం దుర్గా రామకృష్ణకు వివాహమైనా కుటుంబ కలహాలతో భార్య విడిచి పెట్టింది. పెద్ద కొడుకు గోపికృష్ణ భార్య కూడా అతడిని విడిచిపెట్టడంతో ముగ్గురు తండ్రి దగ్గరే ఉండేవారు. ఈ క్రమంలో తండ్రి చనిపోయిన తర్వాత అతని ఆస్తికోసం ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఆస్తితో పాటు ఆర్థిక ప్రయోజనాల కోసం ముగ్గురు సంతానం ఘర్షణ పడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని తానే చూసుకున్నందున తండ్రి డబ్బు మొత్తం తనకే దక్కాలని కుమార్తె గొడవ పడుతోంది. అందుకు సోదరులు అంగీకరించకపోవడంతో అన్న, తమ్ముడిని కిరాతకంగా హతమార్చింది. మృతదేహాలను ఏమి చేసిందనే విషయం ఇంకా స్పష్టత రాలేదు.
కృష్ణవేణి నకరికల్లులో ఓ వ్యక్తితో సంబంధం ఉన్నట్టు గుర్తించారు. కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు విషయంలో ఘర్షణల నేపథ్యంలో అతని సాయంతో హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. కానిస్టేబుల్ గోపీకృష్ణ బండ్లమోటు పీఎస్‌కు విధులకు హాజరు కాకపోవడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
ముందస్తు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరు కావడంతో బండ్లమోటు ఎస్సై బాల కృష్ణ అతని మెమో జారీ చేశారు. దానికి కూడా సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసులు అరా తీశారు. గోపీకృష్ణకు మద్యం తాగే అలవాటు ఉంది. డిసెంబర్ 10న అన్నకు అతిగా మద్యం తాగించి మెడకు చున్నీ బిగించి హత్యచేసినట్లు పోలీసులకు చెప్పడంతో వారు ఖంగుతిన్నారు. తమ్ముడిని నవంబరు 26న కాల్వలో తోసేసి చంపేసింది. రెండు శవాలను ఇంత వరకు గుర్తంచలేదు. ఈ హత్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో మిస్టరీ వీడుతుందని చెబుతున్నారు.