Andhra Pradesh News Live December 16, 2024: Amaravati CRDA Meeting : అమరావతిలో రూ.24657 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం, సీఎం చంద్రబాబు అధ్యక్షతన బెటినేట్ సమావేశం
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 16 Dec 202405:39 PM IST
Amaravati CRDA Meeting : అమరావతి రాజధానిలో రూ.24276 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. సీఆర్‌డీఏతో జరిగిన మూడు సమావేశాల్లో కలిపి మొత్తంగా రూ.45,249 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపారు.
Mon, 16 Dec 202402:28 PM IST
- TTD Arjitha Seva: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 మార్చి నెల కోటాను డిసెంబరు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
Mon, 16 Dec 202402:17 PM IST
- Minister Narayana: అమరావతి మాస్టర్ ప్లాన్ ను గతంలో చెప్పిన విధంగానే అమలు చేస్తామని, వచ్చే 9 తొమ్మిది నెలల్లో అధికారులు అమరావతిలో ఉండేలా వారికి నివాసాలు సిద్దం చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. నీరుకొండలో భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
Mon, 16 Dec 202401:06 PM IST
- Pithapuram Hospital: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 100పడకలను మంజూరు చేసింది.
Mon, 16 Dec 202412:28 PM IST
AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్పపీడనం ఎఫెక్ట్ తో రేపు, ఎల్లుండి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Mon, 16 Dec 202411:07 AM IST
- Nuzivid TDP : జోగి రమేష్ వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. టీడీపీ నేతలను విమర్శించాలన్న.. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయాలన్నా.. వైసీపీ జోగి రమేష్‌ను మీడియా ముందుకు పంపేదనే అభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి లీడర్‌తో టీడీపీ మంత్రి, ఎమ్మెల్యే, ఇతర కీలక నేతలు వేదిక పంచుకున్నారు. దీనిపై నారా లోకేష్ సీరియస్ అయ్యారు.
Mon, 16 Dec 202410:10 AM IST
- Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు.. ఇండియన్ రైల్వే అలర్ట్ ఇచ్చింది. ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే గుంతకల్లు డివిజన్‌లో సేఫ్టీ పనులు కారణంగా.. ఆరు రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి, సహకరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
Mon, 16 Dec 202409:32 AM IST
Polavaram Project : 2004లో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కి సాగుతోంది. ఏపీలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ 2027 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతోంది. అసలు పోలవరం నిర్మాణం జాప్యానికి కారణాలేంటో తెలుసుకుందాం.
Mon, 16 Dec 202406:10 AM IST
- AP Aadhaar Camps: ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీల్లో రేపటి నుంచి ఆధార్ నమోదు కోసం ప్రత్యేక క్యాంపులను నిర్వహించనున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12లక్షల మంది చిన్నారులకు ఆధార్ కార్డులు లేకపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం చిన్నారులకు ఆధార్ కార్డుల జారీకి ప్రత్యేక క్యాంపుల్ని నిర్వహిస్తోంది.
Mon, 16 Dec 202405:38 AM IST
- Manchu Manoj : మంచు ఫ్యామిలీ ఇష్యూ రచ్చ రచ్చ అయ్యింది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కి.. కోర్టు వరకు వెళ్లింది. అక్కడి నుంచి ఆసుపత్రికి చేరింది. తాజాగా.. రాజకీయాల వరకు వచ్చింది. అవును.. మంచు ఫ్యామిలీ మెంబర్స్ కొందరు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Mon, 16 Dec 202404:28 AM IST
- Palnadu Cruel Sister: పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.తండ్రి ఆస్తితో పాటు పెన్షన్ మీద కన్నేసిన యువతి అందుకు అడ్డుగా ఉన్న అన్న,తమ్ముడిని కడతేర్చింది.యువతి చేతిలో హత్యకు గురైన వారిలో ఒకరు పోలీస్ కానిస్టేబుల్… విధులకు హాజరు కాకపోవడంతో అనుమానించి ఆరా తీసిన పోలీసులు నిజం తెలిసి షాక్ అయ్యారు.
Mon, 16 Dec 202403:40 AM IST
- Kurnool Crime: కర్నూలు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. తల్లికి తెలియకుండానే మైనర్‌ను ఒక యువకుడు పెళ్లాడాడు. తాను కర్ణాటకలో ఉద్యోగం చేస్తున్నానంటూ బాలిక మేనమామకు నిందితుడు మాయమాటలు చెప్పాడు. దీంతో కర్ణాటక తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.
Mon, 16 Dec 202401:59 AM IST
- AP Rains Update: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడటం లేదు. వారం పదిరోజులకో అల్పపీడనాలతో కోస్తా జిల్లాలను ఈ ఏడాది వర్షాలు వెంటాడుతున్నాయి. గత ఆగస్టు నుంచి ప్రతి నెలలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లతో కోస్తా జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. తాజాగా నేడు మరో అల్పపీడనం ఏర్పడనుంది.
Mon, 16 Dec 202412:55 AM IST
- ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ జాతర తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 23 నుంచి జనవరి 29 వరకు జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో కొలువైన శంబర పోలమాంబ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరపనున్నారు.