Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ని ట్రాక్​ చేయండి..-stocks to buy today 16th december 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ని ట్రాక్​ చేయండి..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ని ట్రాక్​ చేయండి..

Sharath Chitturi HT Telugu
Dec 16, 2024 08:10 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 843 పాయింట్లు పెరిగి 82,133 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 220 పాయింట్లు పెరిగి 24,768 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 367 పాయింట్లు పెరిగి 53,584 వద్దకు చేరింది.

నిఫ్టీ50 ఇండెక్స్ 24,700 పైన క్లోజ్ కావడంతో భారత స్టాక్ మార్కెట్ మూడ్ మెరుగుపడిందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అభిప్రాయపడ్డారు. 50 షేర్ల ఇండెక్స్ సమీపకాలంలో 25,200కు చేరుకుంటుందని ఛాయిస్ బ్రోకింగ్ నిపుణుడు తెలిపారు. ఫ్రంట్ లైన్ ఇండెక్స్​కు 24,300 వద్ద కీలక సపోర్ట్​ ఉందని బగాడియా తెలిపారు. స్టాక్ స్పెసిఫిక్ విధానాన్ని పాటించాలని, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్రేకౌట్​ స్టాక్స్​ని పరిశీలించాలని ఆయన డే ట్రేడర్లకు సూచించారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2335.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 732.2 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

డిసెంబర్​​ నెల​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 11,706.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4672.49 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.20శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ ఫ్లాట్​గా ముగిసింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.12శాతం స్వల్పంగా వృద్ధిచెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

క్రిసిల్: రూ.5890 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.6222, స్టాప్ లాస్ రూ.5650;

మేషం ఆగ్రో: రూ.387.90 వద్ద కొనండి, టార్గెట్ రూ.415, స్టాప్ లాస్ రూ.375;

పీడీఎస్: రూ.611.05 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.650, స్టాప్ లాస్ రూ.588;

ఏడీఎఫ్ ఫుడ్స్: రూ.343.55 వద్ద కొనండి, టార్గెట్ రూ.365, స్టాప్ లాస్ రూ.330;

లుమాక్స్ ఆటోటెక్నాలజీస్: రూ.606 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.650, స్టాప్ లాస్ రూ.585.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం