మరింత డబ్బు సంపాదించాలనుకుంటే ఈ సైడ్ ఇన్‌కమ్‌ల గురించి ఆలోచించండి!-business idea if you want to earn more money know these side income tips ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మరింత డబ్బు సంపాదించాలనుకుంటే ఈ సైడ్ ఇన్‌కమ్‌ల గురించి ఆలోచించండి!

మరింత డబ్బు సంపాదించాలనుకుంటే ఈ సైడ్ ఇన్‌కమ్‌ల గురించి ఆలోచించండి!

Anand Sai HT Telugu
Dec 15, 2024 09:30 PM IST

Business Idea : కొంతమంది ఉద్యోగం చేస్తూనే సైడ్ బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటారు. అలాంటివారు ఎక్కువగా ఇబ్బందిపడకుండా పనిచేసేందుకు కొన్ని పనులు ఉన్నాయి. సైడ్ ఇన్‌కమ్‌తో మీ ఖర్చులను చూసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ఖర్చులు అధికంగా పెరిగాయి. దీంతో ఒక ఉద్యోగంతో వచ్చే జీతం మీద బతకడం చాలా మందికి కష్టమైంది. అందుకే అనేక మంది సైడ్‌కి ఏదైనా పని చేయాలనుకుంటారు. ఒక ఉద్యోగంలో వచ్చే జీతం సరిపోక, మరో ఉద్యోగం వెతుక్కునే వారు చాలా మంది ఉన్నారు. సైడ్ ఇన్‌కమ్ అనేది చాలామందికి అవసరమైపోయింది.

yearly horoscope entry point

మీరు ఆదాయాన్ని సంపాదించడానికి వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంటే పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఖాళీ సమయంలో ఆదాయాన్ని పొందగలుగుతారు. రోజువారీ ఖర్చులను తీర్చడానికి ఉత్తమ ఆదాయ వనరులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ కొన్ని సైడ్ ఇన్‌కమ్ ఐడియాలు ఉన్నాయి..

వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న వ్యాపారం. ప్రతి సంవత్సరం ఇ కామర్స్ విభాగంలో దుస్తుల పరిశ్రమ విజయవంతంగా అభివృద్ధి చెందుతోంది. ప్రింట్ ఆన్ డిమాండ్ మోడల్‌ని ఉపయోగించడం ద్వారా ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. ఈ వ్యాపారంలో మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేయవచ్చు. కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో ఆర్డర్లు చేస్తారు. వారి డిమాండ్‌కు అనుగుణంగా కస్టమర్‌లకు ప్రొడక్ట్ అందించవచ్చు.

ఫోటోగ్రఫీ వ్యాపారాన్ని ప్రారంభించండి. మీకు ఫోటోగ్రఫీ పట్ల మక్కువ ఉంటే మీ స్థానిక ప్రాంతంలో ఫోటోగ్రాఫర్‌గా పని చేయవచ్చు. ఒక్కో ఫోటోషూట్‌కి 2-5 వేల రూపాయలు సంపాదించవచ్చు. దీని ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. మీరు మీ చిత్రాలను ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయవచ్చు. ఎవరైనా మీ ఫోటోలను డౌన్‌లోడ్ చేసినప్పుడు లేదా విక్రయించినప్పుడు మీకు కమీషన్ కూడా లభిస్తుంది. లేదంటే మీ దగ్గర కెమెరా ఉంటే.. ఈవెంట్‌లకు కూడా వెళ్లవచ్చు. మీకు వీలుకాకపోతే వేరే వ్యక్తిని కూడా పంపవచ్చు.

ఈ రోజుల్లో ఈవెంట్ ప్లానర్స్ డిమాండ్ పెరుగుతోంది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ పెద్ద వ్యాపారంగా కొనసాగుతోంది. ఆదాయాన్ని సంపాదించడానికి ఇది ఉత్తమ మార్గాలలో ఒకటి. పుట్టినరోజు, పెళ్లి, వార్షికోత్సవం, మరే ఇతర సందర్భం అయినా ఈవెంట్ ప్లానర్‌లు అవసరం. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. మీరు టీమ్ పెట్టుకుంటే మరింత ఫ్రీగా పని చేసుకోవచ్చు.

మీకు ఏదైనా నైపుణ్యం ఉంటే ఆ నైపుణ్యాన్ని ఉపయోగించి మీరు ఫ్రీలాన్సింగ్ పని చేసుకోవచ్చు. రాయడం, ఎడిటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్ ఇతర పనుల ద్వారా వర్క్ చేయవచ్చు. మీరు గంటకు ఛార్జ్ చేయవచ్చు. లేదంటే ప్రాజెక్ట్ మెుత్తానికి మాట్లాడుకోవచ్చు.

ఉబర్, ఓలా, ర్యాపిడో మొదలైన వాటికి రైడర్‌గా పార్ట్ టైమ్ పని చేయవచ్చు. Zomato, Swiggy మొదలైన ఫుడ్ డెలివరీ కంపెనీలో కూడా పని చేయవచ్చు. మీరు రైడర్‌గా పని చేస్తే.. ఆఫీస్‌కు వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో వాడుకోవచ్చు. మీకు కూడా ఖర్చులు కలిసి వస్తాయి.

Whats_app_banner