TG Schools Holiday : కొనసాగుతున్న గ్రూప్ 2 పరీక్షలు- రేపు ఈ స్కూళ్లు, కాలేజీలకు సెలవు-tg schools colleges holiday on dec 16th where group 2 exam conducting centers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Schools Holiday : కొనసాగుతున్న గ్రూప్ 2 పరీక్షలు- రేపు ఈ స్కూళ్లు, కాలేజీలకు సెలవు

TG Schools Holiday : కొనసాగుతున్న గ్రూప్ 2 పరీక్షలు- రేపు ఈ స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Bandaru Satyaprasad HT Telugu
Dec 15, 2024 09:32 PM IST

TG Schools Holiday : తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. దీంతో గ్రూప్-2 పరీక్ష కేంద్రాలుగా ఉన్న 1368 స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ప్రకటించారు. మిగతా స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది.

 గ్రూప్ 2 పరీక్షలు- రేపు ఈ స్కూళ్లు, కాలేజీలకు సెలవు
గ్రూప్ 2 పరీక్షలు- రేపు ఈ స్కూళ్లు, కాలేజీలకు సెలవు

TG Schools Holiday : తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. దీంతో గ్రూప్-2 పరీక్ష కేంద్రాలుగా ఉన్న 1368 స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ప్రకటించారు. మిగతా స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది.

గ్రూప్-2 పరీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌ 2 పరీక్షలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు తొలి రోజు పేపర్-1 ప్రారంభమైంది. పరీక్షకు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి సెంటర్‌కు రావాలని టీజీపీఎస్పీ సూచించింది. చాలామంది అభ్యర్థులు సమయానికి సెంటర్‌కు చేరుకోగా... కొన్ని చోట్ల అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో నిమిషం నిబంధన మేరకు వారిని సిబ్బంది పరీక్షకు అనుమతించలేదు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఆదివారం ఉదయం పేపర్-I జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం పేపర్-II చరిత్ర, పాలిటీ అండ్ సొసైటీ పరీక్షలను టీజీపీఎస్సీ విజయవంతంగా నిర్వహించింది. తొలి రోజు పరీక్షలకు సంబంధించి తాత్కాలిక హాజరు వివరాలను టీజీపీఎస్సీ ప్రకటించింది.

తొలి రోజులు హాజరు

గ్రూప్-2 పరీక్షలకు మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేసుకోగా...74.96% మంది హాల్ టికెట్లు డౌన్ చేసుకున్నారు. వీరిలో తొలి రోజు పేపర్-1 పరీక్షకు 2,57,981 అంటే 46.75%, పేపర్-2కు 2,55,490 మంది అంటే 46.30% హాజరయ్యారు. నాలుగు పేపర్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొత్తం 783 పోస్టుల భర్తీకి గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

గ్రూప్‌-2 పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థి సెల్ ఫోన్‌తో పట్టుబడ్డడం కలకలం రేపుతోంది. ఈ ఘటన వికారాబాద్‌లోని శ్రీ సాయి డెంటల్ కాలేజీ పరీక్షా కేంద్రంలో జరిగింది. పరీక్ష ప్రారంభానికి ముందే అభ్యర్థి సెల్ ఫోన్ ను దుస్తుల్లో పెట్టుకుని ఎగ్జామ్ సెంటర్ లోపలికి వచ్చాడు. అనుమానంతో ఎగ్జామ్ చీఫ్‌ సూపరిండెంట్ అతడిని చెక్ చేశారు. దీంతో ఆ అభ్యర్థి వద్ద ఫోన్‌ దొరికింది. అభ్యర్థిని పరీక్ష రాయనివ్వకుండా పోలీసులకు అప్పగించారు. మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద అతనిపై చర్యలు తీసుకుంటామని టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం