Keerthy Suresh Wedding Pics: ఆంటోనీ తాటిల్‌తో రొమాంటిక్ ఫొటోలను షేర్ చేసిన కీర్తి సురేశ్.. లిప్ లాక్
Keerthy Suresh Wedding Pics: కీర్తి సురేశ్ తన భర్తతో కలిసి రొమాంటిక్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. మూడు రోజుల క్రితం గోవాలో పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్..?
హీరోయిన్ కీర్తి సురేష్ తన పెళ్లికి సంబంధించిన మరికొన్ని ఫొటోలను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది. డిసెంబరు 12న తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ను గోవాలో కీర్తి సురేశ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆరోజు హిందూ సంప్రదాయంలో కీర్తి, ఆంటోని పెళ్లి చేసుకోగా.. తాజాగా కీర్తి సురేశ్ షేర్ చేసిన ఫొటోల్లో ఈ జంట క్రిస్టియన్ పద్ధతిలో వెడ్డింగ్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఆంటోనీ తాటిల్, కీర్తి సురేశ్ ముద్దు పెట్టుకుంటున్న ఫొటో కూడా ఇందులో ఉంది. నూతన వధూవరులను వరుణ్ ధావన్, హన్సిక , సమంత తదితరులు సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో ఆశీర్వదించారు. ఈ వివాహానికి చెన్నై నుంచి తమిళ్ హీరో విజయ్ కూడా వెళ్లిన విషయం తెలిసిందే.
కీర్తి సురేశ్ షేర్ చేసిన ఫొటోల్లో ఆంటోనీ కారులో పెళ్లికి రావడం, కీర్తి తన తండ్రితో కలిసి నడుచుకుంటూ వేదిక వద్దకి రావడం, వధూవరులు ఉంగరాలు మార్చుకోవడం, అలానే తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్ చేస్తూ వధూవరులు పెళ్లిని సెలబ్రేట్ చేసుకుంటున్నవి కూడా ఉన్నాయి. అలానే తమ పెంపుడు శునకంతో కలిసి కూడా ఈ వధూవరులు ఫొటోలు తీసుకున్నారు.
కీర్తి సురేశ్ ఫొటోలపై తొలుత ఆమెతో కలిసి ప్రస్తుతం సినిమా చేస్తున్న వరుణ్ ధావన్ స్పందించాడు. 'సో బ్యూటిఫుల్' అంటూ కామెంట్ చేశాడు. అలానే ఓ అభిమాని 'వావ్… చాలా అందంగా కనిపిస్తున్నారు... అభినందనలు’ అని కామెంట్ చేయగా.. మరొకరు "కంప్లీట్ లవ్" అని రాసుకొచ్చారు. ఒక నెటిజన్ ‘ది లవ్లీ కపుల్’ అని ఆశీర్వదించారు.