Bigg Boss Winner Nikhil: నిఖిల్‌ను విన్నర్‌గా ప్రకటించిన నాగార్జున- ట్రోఫీ అందజేసిన రామ్ చరణ్- గౌతమ్ రన్నరప్ (హైలెట్స్)-bigg boss telugu 8 grand finale highlights live blog today winner and runner up prize money gautham nikhil ram charan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Winner Nikhil: నిఖిల్‌ను విన్నర్‌గా ప్రకటించిన నాగార్జున- ట్రోఫీ అందజేసిన రామ్ చరణ్- గౌతమ్ రన్నరప్ (హైలెట్స్)

బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్‌ నిఖిల్‌కు ట్రోఫీ అందజేసిన రామ్ చరణ్(Disney Plus Hotstar)

Bigg Boss Winner Nikhil: నిఖిల్‌ను విన్నర్‌గా ప్రకటించిన నాగార్జున- ట్రోఫీ అందజేసిన రామ్ చరణ్- గౌతమ్ రన్నరప్ (హైలెట్స్)

05:36 PM ISTDec 15, 2024 10:41 PM Sanjiv Kumar
  • Share on Facebook
05:36 PM IST

  • Bigg Boss Telugu 8 Winner And Runner Up Today Grand Finale Highlights: బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరో ఇవాళ (డిసెంబర్ 15) జరిగే గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో తేలిపోనుంది. బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్, ప్రైజ్ మనీ, రెమ్యునరేషన్, గ్రాండ్ ఫినాలే గెస్ట్, వచ్చే స్టార్ సెలబ్రిటీలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

Sun, 15 Dec 202405:21 PM IST

రామ్ చరణ్‌తో ట్రోఫీ అందజేత- తల్లికి డెడికే

బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్‌గా నిఖిల్‌ను నాగార్జున చేయి ఎత్తి ప్రకటించారు. అనంతరం నిఖిల్‌కు రామ్ చరణ్ ట్రోఫీ అందజేశారు. ఇక రన్నరప్‌గా గౌతమ్ నిలిచాడు. అనంతరం ట్రోఫీని తన తల్లికి డెడికేట్ చేస్తున్నట్లుగా నిఖిల్ చెప్పాడు.

Sun, 15 Dec 202404:50 PM IST

చిరంజీవిని ఇమిటేట్ చేసిన అవినాష్

రామ్ చరణ్ ముందు చిరంజీవిని ఇమిటేట్ చేశాడు అవినాష్. దాంతో మా ముందే చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తావా. సాయి కుమార్‌ది ఓకే అని నాగార్జున అనడంతో.. అలాగే చేశాడు అవినాష్. తర్వాత రాజశేఖర్ గొంతుతో ఇమిటేట్ చేశాడు అవినాష్.

Sun, 15 Dec 202404:20 PM IST

రామ్ చరణ్ ఎంట్రీ

బిగ్ బాస్ స్టేజీ మీదకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చారు. చెర్రీ అయ్యప్ప మాల, దుస్తుల్లో బిగ్ బాస్ స్టేజీపైకి వచ్చాడు. అనంతరం మెహబూబ్‌ గురించి నాగార్జున చెప్పగానే పలకరించాడు రామ్ చరణ్

Sun, 15 Dec 202404:18 PM IST

రోహిణికి ముద్దు పెట్టిన విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి వెళ్తుండగా.. రోహిణి స్టేజీపైకి వచ్చి హగ్ చేసుకుంది. దాంతో రోహిణి చేతిపై విజయ్ సేతుపతి ముద్దు పెట్టాడు. దాంతో సంతోషపడిన రోహిణి మక్కల్ సెల్వన్‌ కాళ్లకు నమస్కారం చేసింది.

Sun, 15 Dec 202404:17 PM IST

ఓరుగల్లు బిడ్డ ఎలిమినేట్

బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన విజయ్ సేతుపతి, మంజు వారియర్ టాప్ 3 కంటెస్టెంట్‌గా నబీల్‌ను ఎలిమినేట్ చేసి స్టేజీపైకి తీసుకొచ్చారు. ఓరుగల్లుకు చెందిన నబీల్ ఒక యూట్యూబర్.

Sun, 15 Dec 202404:06 PM IST

విజయ్ సేతుపతి ఎంట్రీ

హౌజ్‌లోకి తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మంజు వారియర్ ఎంట్రీ ఇచ్చారు.

Sun, 15 Dec 202403:55 PM IST

టాప్ 4లో ప్రేరణ ఎలిమినేట్

టాప్ 4 కంటెస్టెంట్‌గా ప్రేరణను ఎలిమినేట్ చేసి హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బయటకు తీసుకొచ్చింది. రెడ్ డ్రెస్ వేసుకున్నప్పుడే డౌట్ వచ్చింది, ఎందుకు వేసుకున్నా అని బాధపడింది ప్రేరణ. అలాగే, నబీల్ కూడూ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు. తర్వాత వచ్చేది నువ్వే అని ఫన్ చేసింది ప్రేరణ.

Sun, 15 Dec 202403:51 PM IST

నభా నటేష్ డ్యాన్స్

బిగ్ బాస్ స్టేజీపై నభా నటేష్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసింది. పుష్ప 2 పీలింగ్స్, గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి పాటలకు అదిరిపోయే స్టెప్పులేసింది.

Sun, 15 Dec 202403:29 PM IST

అవినాష్ అవుట్

బిగ్ బాస్ నుంచి టాప్ 5 కంటెస్టెంట్‌గా అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. అవినాష్‍ను ఉపేంద్ర బయటకు తీసుకొచ్చారు.

Sun, 15 Dec 202403:17 PM IST

ఉపేంద్ర ఎంట్రీ

స్టేజీ మీదకు కన్నడ స్టార్ ఉపేంద్ర ఎంట్రీ ఇచ్చాడు. యూఐ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఉపేంద్ర అడుగుపెట్టాడు. ఉపేంద్ర ఎంట్రీతో ఎలిమినేషన్ కంటెస్టెంట్స్‌ అంతా అరుస్తూ గోల చేశారు.

Sun, 15 Dec 202403:16 PM IST

ట్రోఫీ రివీల్

బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ట్రోఫీని నాగార్జున రివీల్ చేశారు. 8 ఆకారంతోపాటు కన్ను సింబల్ వచ్చి.. ఇన్ఫినిటీ గుర్తు చూపిస్తూ ట్రోఫీ ఉంది.

Sun, 15 Dec 202403:06 PM IST

ఫేవరెట్ రూమ్ బాత్రూమ్

బిగ్ బాస్ హౌజ్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఫేవరెట్ ప్లేస్‌లు ఏంటొ ఒక్కొక్కరిగా చెబుతున్నారు. అవినాష్ మాత్రం బాత్రూమ్ చెప్పాలని అనుకుని ఆగిపోయాడు.

Sun, 15 Dec 202402:51 PM IST

అధికారికంగా ప్రకటించాలి

విన్నర్ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించి షూటింగ్ పూర్తి అయిపోయింది. కానీ, విజేతను అధికారికంగా ఎపిసోడ్‌లో ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఎపిసోడ్‌లో విన్నర్ అయితే కంటెస్టెంట్స్ స్పీచ్ ఎలా ఉంటుందో అవినాష్ చేసి చూపిస్తున్నాడు.

Sun, 15 Dec 202402:11 PM IST

బిగ్ బాస్ విన్నర్ నిఖిల్

బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్‌గా నిఖిల్ మలియక్కల్ నిలిచినట్లు బీబీ వర్గాల నుంచి సమాచారం అందింది. ఇక రన్నరప్‌గా గౌతమ్ కృష్ణ నలిచినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విన్నర్‌గా నిఖిల్‌ను రామ్ చరణ్ ప్రకటించినట్లు సమాచారం.

Sun, 15 Dec 202401:59 PM IST

కంటెస్టెంట్స్ డ్యాన్స్

టాప్ 5 కంటెస్టెంట్స్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చూపిస్తున్నారు. పుష్ప 2 టైటిల్ సాంగ్‌పై గౌతమ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. డబుల్ ఇస్మార్ట్ శంకర్ పాటపై నబీల్ డ్యాన్స్ చేశాడు.

Sun, 15 Dec 202401:51 PM IST

టేస్టీ తేజకు నాగార్జున డ్రెస్

బిగ్ బాస్ ఫినాలే కోసమే స్పెషల్‌గా డ్రెస్ డిజైన్ చేసుకుని వచ్చానని టేస్టీ తేజ అన్నాడు. దానికి వైట్ కలర్, హారిజాంటల్ లైన్స్ లావుగా ఉన్నవాళ్లకు సూట్ కావు. ముందు పెళ్లి చేసుకో అప్పుడు నేను నీకు ఏం వేసుకోవాలో చెబుతాను అని నాగార్జున అన్నాడు.

Sun, 15 Dec 202401:45 PM IST

తేజ పోహా వల్లే ఆరోగ్యం పాడైంది

బిగ్ బాస్ ఫినాలేకి వచ్చిన ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి గురించి చెప్పుకున్నాారు. టేస్టీ తేజ పెట్టిన పోహా వల్లే ఆరోగ్యం పాడైందని బిగ్ బాస్ గంగవ్వ చెప్పింది. అది నాగార్జునకు అర్థం కాకపోవడంతో రోహిణి అర్థమయ్యేలా వివరించింది.

Sun, 15 Dec 202401:35 PM IST

ఎలిమినేట్ కంటెస్టెంట్స్ ఎంట్రీ

బగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ప్రారంభం అయింది. హోస్ట్ నాగార్జునతోపాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చారు.

Sun, 15 Dec 202412:51 PM IST

రామ్ చరణే స్పెషల్ గెస్ట్

ఎన్నో రూమర్స్ తర్వాత బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు గెస్టుగా రామ్ చరణ్ వస్తున్నాడని కన్ఫర్మ్ అయింది. వీడియో రిలీజ్ చేసి మరి గ్లోబల్ స్టార్ బిగ్ బాస్ ఫినాలే గెస్ట్ అని చెప్పేసింది స్టార్ మా.

Sun, 15 Dec 202412:24 PM IST

300 మంది పోలీసుల బందోబస్తు

బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే రోజున జరిగిన పల్లవి ప్రశాంత్ ఎఫెక్ట్‌తో ఇవాళ పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్ లోని అన్నపూర్ణయ స్టూడియో వద్ద ఆంక్షలు విధిస్తూ 300 మంది పోలీసులను బందోబస్త్‌గా ఉంచారు. ఇవాళ బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌ను ప్రకటించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

Sun, 15 Dec 202411:33 AM IST

పోలీసుల వార్నింగ్

బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్‌ను ప్రకటించిన తర్వాత ఎలాంటి సెలబ్రేషన్స్, ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. విన్నర్ అయినా రన్నరప్ అయిన డిసెంబర్ 16 ఉదయం మూడు గంటలకు బయటకు పంపించున్నారని సమాచారం.

Sun, 15 Dec 202411:12 AM IST

ప్రైజ్ మనీకి పడని ప్రేరణ

శనివారం (డిసెంబర్ 14) జరిగిన బిగ్ బాస్ తెలుగు 8 ఫినాలే ఎపిసోడ్ షూటింగ్‌లో టాప్ 4 కంటెస్టెంట్ స్థానంలో ప్రేరణను హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొచ్చింది. బిగ్ బాస్ ప్రైజ్ మనీలోని రూ. 15 లక్షలు ఆశ చూపించిన ప్రేరణ తీసుకోలేదు. దాంతో ఎలిమినేట్ అయింది ప్రేరణ.

Sun, 15 Dec 202410:44 AM IST

అవినాష్ ఎలిమినేట్

బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ కొంత భాగం శనివారం నాడే జరిగింది. అందులో టాప్ 5 కంటెస్టెంట్‌గా అవినాష్‌ ఎలిమినేట్ అయ్యాడు. అవినాష్‌ను కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర బయటకు తీసుకొచ్చారని సమాచారం.

Sun, 15 Dec 202410:35 AM IST

బిగ్ బాస్ ప్రైజ్ మనీ

బిగ్ బాస్ తెలుగు 8 ప్రైజ్ మనీ రూ. 55 లక్షలు అని ఇవాళ విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున చెప్పారు. అంతేకాకుండా ఏ తెలుగు సీజన్‌లోను లేనంతగా ఈ సీజన్‌లో ప్రైజ్ మనీ ఉంది. ఇప్పటివరకు ప్రతి సీజన్‌లో రూ. 50 లక్షల వరకు మాత్రమే ప్రైజ్ మనీ ఉండేది.

Sun, 15 Dec 202410:28 AM IST

టాప్ 2 కంటెస్టెంట్స్

టాప్ 5 ఫైనలిస్ట్స్‌గా అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ ఉన్నారు. ఇవాళ వీరి నుంచి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ టాప్ 2 కంటెస్టెంట్స్ ను ఉంచనున్నారు.

Sun, 15 Dec 202410:00 AM IST

6వ వారం నుంచి ఎలిమినేషన్స్

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చాక.. బిగ్ బాస్ తెలుగు 8 నుంచి మొదటగా కిర్రాక్ సీత, ఆ తర్వాత నయని పావని, మెహూబబ్ దిల్ సే, నాగ మణికంఠ, గంగవ్వ, హరితేజ, టేస్టీ తేజ, పృథ్వీరాజ్, రోహిణి, విష్ణుప్రియ ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు.

Sun, 15 Dec 202409:56 AM IST

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ

బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అదే వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా కొత్తగా 8 మంది హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వారిలో

1. హరితేజ

2. టేస్టీ తేజ

3. నయని పావని

4. మెహబూబ్ దిల్ సే

5. జబర్దస్త్ రోహిణి

6. గౌతమ్ కృష్ణ

7. జబర్దస్త్ అవినాష్

8. గంగవ్వ ఉన్నారు.

Sun, 15 Dec 202409:56 AM IST

అల్లు అర్జున్‌కు బదులుగా

బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్‌గా రానున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, మొదటగా అల్లు అర్జున్‌ను చీఫ్ గెస్ట్‌గా వస్తారని ప్రచారం జరిగింది. కానీ, అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్ నేపథ్యంలో బన్నీ స్థానంలో రామ్ చరణ్‌ను బీబీ నిర్వహాకులు సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. మరి బిగ్ బాస్ ఫినాలేకు ఎవరు గెస్ట్‌గా రానున్నారో ఇవాళ రాత్రి 7 గంటల వరకు ఆగాల్సిందే.

Sun, 15 Dec 202409:28 AM IST

బిగ్ బాస్ ఎలిమినేషన్స్

బిగ్ బాస్ తెలుగు 8 నుంచి నాలుగో వారం సోనియా ఆకుల ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. నిఖిల్‌తో ఆమె వ్యవహరించిన తీరు చాలా నెగెటివిటీ తీసుకొచ్చింది. ఇక ఐదో వారం మిడ్ వీక్‌లో భాగంగా ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత అదే వారం వీకెండ్‌‌లో నైనిక ఎవిక్షన్‌కు గురి అయింది.

Sun, 15 Dec 202409:28 AM IST

మూడో వారం ఎలిమినేట్ ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో నాలుగో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. బిగ్ బాస్‌ను, బీబీ టీమ్‌ను అనవసరంగా తిట్టి నోరు జారాడు. దాంతో ఆడియెన్స్ బుద్ధి చెప్పినట్లుగా ఎలిమినేట్ చేశారు.

Sun, 15 Dec 202409:27 AM IST

బిగ్ బాస్ రెండో ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం ఆర్జే శేఖర్ బాషా ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. అయితే, ఎలిమినేట్ అయినందుకు శేఖర్ బాషా చాలా సంతోషించాడు. ఎందుకంటే ఆ సమయంలో శేఖర్ బాషా భార్య పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Sun, 15 Dec 202409:27 AM IST

బిగ్ బాస్ మొదటి ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 8 మొదటి వారం యూట్యూబర్ బేబక్క ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఆమె సింగర్‌గా మధు నెక్కంటి పేరుతో ప్రేక్షకులకు పరిచయం.

Sun, 15 Dec 202409:27 AM IST

జోడీలుగా బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్

బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్‌గా 14 మంది బడ్డీలుగా ఎంట్రీ ఇచ్చారు. అంటే, హౌజ్‌లోకి ఒక్కొక్కరు కాకుండా జంటలుగా వెళ్లారు. అలా

మొదటగా యష్మీ గౌడ- ఆమె బడ్డీగా రెండో కంటెస్టెంట్‌గా నిఖిల్ మలియక్కల్

3. అభయ్ నవీన్- 4. ప్రేరణ కంబం

5. ఆదిత్య ఓం- 6. సోనియా ఆకుల

7. బెజవాడ బేబక్క- 8. ఆర్జే శేఖర్ బాషా

9. కిర్రాక్ సీత- 10. నాగ మణికంఠ

11. పృథ్వీరాజ్ - 12. విష్ణుప్రియ

13. నైనిక - 14. నబీల్ అఫ్రిది జోడీలుగా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టారు.

Sun, 15 Dec 202409:27 AM IST

బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభ తేది

బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ సెప్టెంబర్ 1న అట్టహాసంగా ప్రారంభం అయింది. ఎప్పటిలాగే బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌కు హోస్ట్‌గా నాగార్జున ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు 8లోకి మొదటగా కంటెస్టెంట్స్‌గా 14 మంది సెలబ్రిటీలు అడుగుపెట్టారు.