NVS Exam Date : నవోదయ విద్యాలయ పరీక్షకు ఉన్నది కొన్ని రోజులే.. విద్యార్థులు ఇలా ప్రిపేర్ అవ్వండి!
JNVST 2025-26 : జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025ను 2025 జనవరి 18న నిర్వహించనున్నట్లు నవోదయ విద్యాలయ సమితి(ఎన్వీఎస్) ప్రకటించింది. అయితే విద్యార్థులు కొన్ని బేసిక్స్ కూడా ఓసారి చూసుకోవాలి. అప్పుడే పరీక్ష బాగా రాయగలుగుతారు.
జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025 పరీక్ష దగ్గరకు వస్తుంది. విద్యార్థులకు మిగిలి ఉంది సుమారు నెల రోజులే. 2025 జనవరి 18న పరీక్ష నిర్వహించనున్నట్లు నవోదయ విద్యాలయ సమితి ప్రకటించింది. మీ పిల్లలు కూడా ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ అవుతుంటే, పరీక్షకు ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది. మీరు కింద ఇచ్చిన టిప్స్ ఆధారంగా ఒక నెల ముందుగానే రివిజన్, ప్రిపరేషన్ రెండింటినీ చేయవచ్చు.
ఇందులో 3 విభాగాలు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకు మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. అంటే ఒక ప్రశ్నకు 1.25 మార్కులు అన్నమాట.
మెంటల్ ఎబిలిటీ టెస్ట్-40 ప్రశ్నలు- 50 మార్కులు
అర్థమెటిక్ టెస్ట్-20 ప్రశ్నలు-25 మార్కులు
లాంగ్వేజ్ టెస్ట్-20 ప్రశ్నలు-25 మార్కులు
మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకు రాయాల్సి ఉంటుంది. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. రెండు గంటల్లో పరీక్ష రాయాలి.
పైన చెప్పిన సిలబస్ ఓసారి ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం పాత సంవత్సరాల ప్రశ్నపత్రాలను కూడా చూడవచ్చు. ఇది మీకు కొత్త ఆలోచనలను ఇస్తుంది. పరీక్షలో అడిగే ప్రశ్నల రకం, పరీక్షా సరళిపై మంచి అవగాహన పెంచుకోవాలి.
ముందుగా సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఏ సబ్జెక్టు బాగా ప్రిపేర్ అయ్యారో, ఏది బాగా ప్రిపేర్ కాలేదో తెలుసుకోవాలి. దీని తరువాత ఇంకా బాగా సిద్ధం కాని వాటికి కొంత సమయం తీసుకోండి. మీ బలాలు, బలహీనతలపై శ్రద్ధ వహించండి. తదనుగుణంగా సమయాన్ని సెట్ చేసుకోవాలి. మీరు బాగా సన్నద్ధమైన సబ్జెక్టును రివిజన్ చేసుకోండి.
ఈ పరీక్షలో విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యమివ్వాలి. కానీ మ్యాథ్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. మ్యాథ్స్ కు నోట్స్ తయారు చేసుకుని పదేపదే సాధన చేయాలి. రీజనింగ్ ప్రశ్నల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది.
నవోదయ విద్యాలయ సమితి 2025-26 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి 2024 అక్టోబర్‌లో దరఖాస్తులు తీసుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగుల రిజర్వేషన్లు ఉంటాయి. నవోదయ విద్యాలయ సమితి, NVS, JNVST క్లాస్ 6 ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. హాల్ టిక్కెట్‌లను navodaya.gov.in అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇలా అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి
navodaya.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న 6వ తరగతి JNVST 2025 కోసం అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ లింక్ క్లిక్ చేయండి.
లాగ్ ఇన్ మాడ్యూల్‌లో మీ ఆధారాలను(రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ) నమోదు చేసి సమర్పించుపై క్లిక్ చేయండి.
JNVST క్లాస్ 6 అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
తదుపరి ఉపయోగం కోసం అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి, దాని ప్రింట్‌అవుట్‌ను తీసుకోండి.