Tollywood: అల్లు అర్జున్ అరెస్ట్ -జానీ మాస్టర్ నేషనల్ అవార్డ్ క్యాన్సిల్-ఈ ఏడాది టాలీవుడ్‌ను కుదిపేసిన వివాదాలు ఇవే
Tollywood: 2024 లో టాలీవుడ్‌ను పలు వివాదాలు కుదిపివేశాయి. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మంచు ఫ్యామిలీ ఆస్తి గొడవలు, నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌తో పాటు ఈ ఏడాది హాట్ టాపిక్‌గా మారిన వివాదాలు ఏవంటే
2024 టాలీవుడ్‌కు ఎన్నో మరుపురాని విజయాల్ని అందించింది. అదే స్థాయిలో ఈ ఏడాది పలు వివాదాలు టాలీవుడ్‌ను కుదిపివేశాయి. అల్లు అరెస్ట్ నుంచి జానీ మాస్టర్ నేషనల్ అవార్డ్ రద్దు వరకు పలు సంఘటనలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
అల్లు అర్జున్ అరెస్ట్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప 2 పెయిడ్ ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళా అభిమాని మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
కోర్డు రిమాండ్‌ను విధించడంతో ఒక రోజు రాత్రి మొత్తం జైలులోనే ఉన్నాడు బన్నీ. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రిలీజయ్యాడు. ఈ ఘటనకు బన్నీకి ఎలాంటి సంబంధం లేదని సినీ ప్రముఖులతో పాటు కొంత మంది రాజకీయ నాయకులు చెబుతోండగా...కొందరు మాత్రం బన్నీ అరెస్ట్ సరైందేనంటూ కామెంట్స్ చేశారు. బన్నీ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్రలు దాగి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
జానీ మాస్టర్‌పై కేసు...
అసిస్టెంట్‌పై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం టాలీవుడ్‌లో కలకలాన్ని సృష్టించింది. జానీ మాస్టర్ దగ్గర చాలా ఏళ్ల పాటు పనిచేసిన అసిస్టెంట్ అతడిపై కేసు పెట్టింది. ఈ అత్యాచార ఆరోపణల కారణంగా జానీ మాస్టర్ నేషనల్ అవార్డును రద్దు చేశారు. ఈ కేనులో రిమాండ్ ఖైదీగా 36 రోజుల పాటు జైలులో ఉన్న జానీ బెయిల్ లభించడంతో రిలీజయ్యాడు.
మంచు ఫ్యామిలీ ఆస్తి గొడవలు..
మంచు ఫ్యామిలీ ఆస్తి గొడవలు టాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆస్తి పంపకాల విషయంలో నెలకొన్న విభేదాలు గొడవలకకు దారితీయడంతో మోహన్‌బాబు, మంచు మనోజ్ ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. మంచు మనోజ్‌ను ఇంట్లోకి రాకుండా మోహన్‌బాబు, విష్ణు మనుషులు అడ్డుకోవడం, గేటు బద్దలు కొట్టుకొని మనోజ్ ఇంట్లోకి వెళ్లడంతో విభేదాలు తీవ్రమయ్యాయి.
ఈ గొడవల సందర్భంగా సహనం కోల్పోయిన మోహన్‌బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడిచేయడంతో అతడిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో మోహన్‌బాబును అరెస్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ గొడవకు సంబంధించి మోహన్‌బాబు, మనోజ్ మధ్య సయోధ్య కుదిరినట్లు సమాచారం.
కొండా సురేఖ కామెంట్స్
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండాసురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్ వర్గాల్లో కొద్ది రోజుల క్రితం సంచలనంగా మారాయి. ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చవద్దు అంటే..సమంతను నా దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారని, సమంతను వెళ్లమని చెప్పి నాగార్జున వాళ్లు ఫోర్స్ చేశారు.
సమంత నేను వెళ్లను అంటేనే విడాకులు ఇచ్చారు అంటూ కేటీఆర్‌పై ఆరోపణల నేపథ్యంలో సురేఖ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్స్‌ను టాలీవుడ్ సినీ లోకం మొత్తం తప్పుపట్టింది. కొండా సురేఖపై నాగార్జున పరువునష్టం దావా వేశాడు. ఈకేసు ప్రస్తుతం కొనసాగుఏతోంది.
ఎన్ కన్వేన్షన్ హాల్ కూల్చివేత...
హైదరాబాద్‌లో తుమ్మిడి కుంట చెరువును కబ్జా చేసి హీరో నాగార్జున ఎన్ కన్వేన్షన్ సెంటర్ నిర్మించారంటూ అధికారులు కూల్చివేశారు. బఫర్ జోన్ పరిధిలోని మూడున్నర ఏకరాలు కబ్జా చేసి నాగార్జున నిర్మాణాలు చేపట్టారంటూ పేర్కొన్నారు. అది అక్రమ స్థలం కాదంటూ నాగార్జున కోర్డును ఆశ్రయించాడు.
రాజ్ తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ...
హీరో రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో మోసం చేశాడని, పెళ్లి చేసుకొని ఇప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో సన్నిహితంగా ఉంటున్నాడని లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టింది. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాతో పలుమార్లు మీడియా ముఖంగా గొడవలు పడింది లావణ్య.
హేమ అరెస్ట్...
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలాన్ని సృష్టించింది. తాను రేవ్ పార్టీకి అటెండ్ కాలేదనిమహేమ చెప్పడం ఆసక్తికరంగా మారింది.