Araku Tourist Places: డిసెంబర్‌లో వెకేషన్ వెళ్లాలంటే అరకు పర్‌ఫెక్ట్.. తప్పక చూడాల్సిన ప్లేస్‍లు ఇవి.. మిస్ అవొద్దు!
Araku Tourist Places: అరకులో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటాయి. గుహలు, వాటర్ ఫాల్స్, సెలయేర్లు సహా వెళ్లేందుకు చాలా ప్లేస్‍లు ఉన్నాయి. అరకు లోయ పరిసరాల్లో తప్పక చూడాల్సిన ప్లేస్‍లు ఇవే..
ప్రకృతి అందాలతో అరకులోయ మనసులను దోచేస్తోంది. ముఖ్యంగా చలికాలంలో ఇక్కడి వాతావణం, పచ్చదనం, పర్యాటక ప్రాంతాలు మరింత ఆకట్టుకుంటాయి. ఇక్కడి జలపాలాలు, సెలయేర్ల గలగలలు, గిరుల అందాలు మనసుకు ప్రశాంతతను,ఉల్లాసాన్ని కలిగిస్తాయి. చలికాలమైన ప్రస్తుత డిసెంబర్.. అరకు వెళ్లేందుకు సరైన సమయం. శీతాకాలంలో ఇక్కడి అందం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రకృతిని ఆస్వాదించే వారికి స్వర్గంలా ఉంటుంది. ఏడాది చివరి నెలైన డిసెంబర్‌లో వెకేషన్ వెళ్లాలంటే అల్లూరి జిల్లా పరిధిలో ఉన్న అరకులోయ సరిగ్గా సూటవుతుంది. విశాఖపట్నానికి అరకు సుమారు 113 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరకులోయ పరిసరాల్లో కచ్చితంగా చూడాల్సిన ప్లేస్‍లు ఏవో ఇక్కడ తెలసుకోండి.
బుర్రా గుహలు
అరకు లోయ నుంచి బొర్రా గుహలు 26 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. పురాతనమైన, దేశంలోనే అత్యంత లోతైన సున్నపురాయి గుహలు ఇవి. అనంతగిరి హిల్స్ ప్రాంతంలోనే ఈ గుహలు ఉంటాయి. ఈ గుహలు చూడడం ప్రత్యేక అనుభూతి, ఆశ్చర్యం కలిగిస్తాయి. ఓ కొత్త ప్రపంచంలో విహరిస్తున్న ఫీలింగ్ వస్తుంది. అరకు వెళితే బొర్రా గుహలు తప్పక చూడాల్సిన ప్లేస్.
అనంతగిరి హిల్స్
అరకుకు సుమారు 36 కిలోమీటర్ల దూరంలో అనంతగిరి హిల్స్ ఉంటాయి. ఈ హిల్ స్టేషన్ ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అరకులోయకు వెళ్లిన వారు ఇక్కడికి వెళ్లడం మిస్ కాకూడదు. కాఫీ తోటలు, జలపాతాలు, పచ్చటి వాతావరణం ఆహ్లాదంగా అనిపిస్తుంది. ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి కూడా అనంతగిరి హిల్స్ పర్‌ఫెక్ట్ ప్లేస్‍గా ఉంటుంది. విశాఖపట్నానికి అనంతగిరి హిల్స్ 88 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
చాపరాయి జలపాతం
అరకులోయకు 13 కిలోమీటర్ల దూరంలోనే చాపరాయి జలపాతం ఉంటుంది. పాడేరు అడవుల మధ్యలో నీరు జాలువారుతూ కనువిందు చేస్తాయి. చాపరాయి జలపాతం వద్ద ఫుల్‍గా ఎంజాయ్ చేయవచ్చు. మంచి అనుభూతి కలుగుతుంది.
ట్రైబల్ మ్యూజియం
అరకులోనే ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. అరకులోయలో నివసించే గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, జీవనవిధానం, చరిత్రను ఈ మ్యూజియంలో తెలుసుకోవచ్చు. ఇక్కడి వస్తువులు ఆకట్టుకుంటాయి. అరకు వెళ్లిన వార కచ్చితంగా ట్రైబల్ మ్యూజియం సందర్శించాలి.
కటికి వాటర్‌ఫాల్స్
కటికి జలపాతం అరకుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, బొర్రా గుహలకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 100 అడుగులకు పైగా ఎత్తు నుంచి నీరు అలా జారుతుంది. పచ్చని చెట్ల మధ్యలో నుంచి జాలువారే ఈ వాటర్‌ఫాల్ మనసును దోచేస్తుంది. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఇవి కూడా..
అరకుకు 35 కిలోమీటర్ల సమీపంలో మత్స్యగుండం ఉంటుంది. ఇక్కడి నీటిలో చేపలు భారీ సంఖ్యలు ఉంటాయి. దీన్ని ఫిష్ పాండ్ అని కూడా అంటారు. పాడేరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. పద్మాపురం గార్డెన్స్ అరకుకు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. టైడా నేచర్ క్యాంప్ కూడా ఆకట్టుకుంటంది. అరకుకు 70 కిలోమీటర్ల దూరంలో దదుమా వాటర్‌ఫాల్స్ ఉంటుంది.
లంబసింగి ప్లాన్ చేయవచ్చు
అరకు ట్రిప్‍కు వెళితే లంబసింగి కూడా వెళితే మంచి అనుభూతి ఉంటుంది. చలికాలంలో లంబసింగి అదిరిపోతుంది. ఇక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది. శీతాకాలంలో అప్పుడప్పుడు మంచు పడుతుంటుంది. ప్రకృతి మనసులను హత్తుకుంటుంది. అరకులోయకు లంబసింగి 92 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
సంబంధిత కథనం