Men Skin Care in Winter: మగాళ్లు.. చలికాలంలో చర్మంపై ఎక్కువ శ్రద్ద పెట్టాల్సిందే.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మెరుగ్గా స్కిన్-men must follow these things for glowing and healthy skin in this winter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Men Skin Care In Winter: మగాళ్లు.. చలికాలంలో చర్మంపై ఎక్కువ శ్రద్ద పెట్టాల్సిందే.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మెరుగ్గా స్కిన్

Men Skin Care in Winter: మగాళ్లు.. చలికాలంలో చర్మంపై ఎక్కువ శ్రద్ద పెట్టాల్సిందే.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మెరుగ్గా స్కిన్

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 15, 2024 08:30 AM IST

Men Skin Care in Winter: చాలా మంది పురుషులు చర్మంపై ఎక్కువ దృష్టి సారించరు. అయితే, చలికాలంలో నిర్లక్ష్యం వహిస్తే చర్మానికి ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేవంటే..

Men Skin Care in Winter: మగాళ్లు.. చలికాలంలో చర్మంపై ఎక్కువ శ్రద్ద పెట్టాల్సిందే.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మెరుగ్గా స్కిన్
Men Skin Care in Winter: మగాళ్లు.. చలికాలంలో చర్మంపై ఎక్కువ శ్రద్ద పెట్టాల్సిందే.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మెరుగ్గా స్కిన్

మహిళలతో పోలిస్తే చాలా మంది పురుషులు చర్మం గురించి అంతగా జాగ్రత్తలు పాటించరు. తమ చర్మం రఫ్‍గా ఉంటుందని, ఏమీ కాదనుకొని నిర్లక్ష్యం వహిస్తుంటారు. అయితే, చలికాలంలో చర్మం కోసం జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ కాలంలో పురుషుల చర్మం కూడా సవాళ్లను ఎదుర్కొంటుంది. గాలిలో తేమ సరిగా లేక, చల్లటి వాతావరణం వల్ల చర్మం పొడిగా మారడం, మొటిమలు పెరగడం సహా మరిన్ని సమస్యలు ఉంటాయి.

అందుకే చలికాలంలో పురుషుల చర్మం పట్ల కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చర్మం పొడిబారితే మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. అందుకే కొన్ని టిప్స్ పాటిస్తూ స్కిన్‍ను సంరక్షించుకోవాలి. శీతాకాలంలో పురుషుల తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

స్నానం విషయంలో ఈ జాగ్రత్తలు

చలికాలంలో ఎక్కువ వేడిగా ఉండే నీటితో స్నానం చేయడం ఉపశమనంగా అనిపిస్తుంది. కానీ ఇది చర్మానికి మంచిది కాదు. ఎక్కువ వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తే చర్మంలోని తేమ తొలగిపోయి పొడిగా మారుతుంది. రఫ్‍గా మారుతుంది అందుకే మరీ వేడి నీటితో కాకుండా గోరు వెచ్చిన నీటితో స్నానం చేయాలి. చర్మంలోని నేచురల్ ఆయిల్స్ వెళ్లిపోకూడదంటే ఈ జాగ్రత్త తప్పనిసరి. అలాగే, షవర్ జెల్ వాడితే చర్మం నుంచి తేమ పోకుండా చేసే వాటినే వినియోగించాలి.

హైడ్రేటెడ్‍గా ఉండేలా..

చలికాలంలో చర్మం మెరుగ్గా ఉండాలంటే సరిపడా నీరు తాగడం తప్పనిసరి. ఎక్కువగా దాహం అనిపించకపోయినా రోజులో తగినంత నీరు తాగేలా జాగ్రత్త వహించాలి. దీనివల్ల చర్మం హైడ్రేెటెడ్‍గా ఉండి పొడిబారడం తగ్గుతుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. హెర్బల్ టీలు తాగాలి.

మాయిశ్చరైజింగ్ తప్పనిసరి

చలికాలంలో పురుషులు తప్పనిసరిగా చర్మానికి మాయిశ్చరైజర్స్ వాడాలి. గాలిలో తేమ తక్కువగా ఉండడం వల్ల శీతాకాలంలో చర్మం పొడిబారడం, ర్యాషెస్ రావడం సులభంగా జరుగుతుంది. అందుకే మాయిశ్చరైజర్స్ వాడాలి. బాడీ లోషన్, ఫేస్ క్రీమ్‍లు, పెట్రోలియం జెల్లీ లాంటి వాటిని చర్మానికి రాసుకోవాలి. చర్మానికి పోషణ అందించాలి. దీనివల్ల పొడి బారకుండా ఉంటుంది.

లిప్‍బాంబ్ వాడండి

చలికాలంలో పెదాలు ఎక్కువగా పగులుతుంటాయి. అయితే, చాలా మంది వీటిని పట్టించుకోరు. ముఖ్యంగా పురుషులు దీన్ని చాలా లైట్ తీసుకుంటారు. పెదాలు పగలడం వల్ల మంటతో ఇబ్బందిగా ఉంటుంది. తినే సమయంలోనూ సమస్యగా అనిపిస్తుంది. అందుకే చలికాలంలో లిప్‍బాంబ్ వాడితే పెదాలు పగలకుండా ఉపయోగపడతాయి.

సన్‍స్క్రీన్ వాడాలి

చలికాలంలో చాలా మంది సన్‍స్క్రీన్‍లను పక్కన పెట్టేస్తుంటారు. వేసవిలోనే ఇవి వాడాలని అనుకుంటారు. అయితే, చలికాలంలోనూ సన్‍స్క్రీన్‍లను వాడడం చాలా ముఖ్యం. సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల వల్ల చర్మంపై ప్రభావం పడకుండా ఇవి చేయగలవు. చర్మాన్ని పొడిబారకుండా కూడా సన్‍స్క్రీన్లు చేస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం