AIBE XIX Hall Ticket 2024 : 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఇవాళ AIBE 19 హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి-aibe xix exam hall ticket 2024 will be released today check the steps for hall ticket download ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Aibe Xix Hall Ticket 2024 : 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఇవాళ Aibe 19 హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AIBE XIX Hall Ticket 2024 : 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఇవాళ AIBE 19 హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 15, 2024 07:20 AM IST

All India Bar Examination Hall Ticket 2024 : AIBE 19 అడ్మిట్ కార్డులు ఇవాళ విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించిన రాత పరీక్ష… డిసెంబర్ 22వ తేదీన జరగనుంది. ఏపీ, తెలంగాణలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. http://allindiabarexamination.com/ లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇవాళ AIBE 19 హాల్ టికెట్లు విడుద
ఇవాళ AIBE 19 హాల్ టికెట్లు విడుద

ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామినేషన్​ (ఏఐబీఈ 19)కు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు(అడ్మిట్ కార్డులు) ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్ 22వ తేదీన ఈ పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో హైదరాబాద్ సెంటర్ ఉంది. ఏపీలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://allindiabarexamination.com/ వెబ్ సైట్ లోకి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

yearly horoscope entry point

హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • ఏఐబీఈ 19కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://allindiabarexamination.com/index.html వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే AIBE XIX admit card 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు పాస్ వర్డ్ ను ఎంట్రీ చేయాలి.
  • డౌన్లోడ్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

ఆలిండియా బార్ ఎగ్జామినేషన్​లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. సిలబస్ ప్రకారం AIBE 19లో 19 అంశాలు నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. మూడు గంటల సమయం ఉంటుంది.

ఏఐబీఈ పరీక్ష సిలబస్ :

  • రాజ్యాంగ చట్టం : 10 ప్రశ్నలు వస్తాయి.
  • ఐ.పీ.సీ(ఇండియన్ పీనల్ కోడ్), (కొత్త) భారతీయ న్యాయ సంహిత: 8 ప్రశ్నలు
  • సీఆర్​పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్), (కొత్త) భారతీయ నగరిక్ సురక్ష సంహిత: 10
  • సీ.పీ.సీ.(సివిల్ ప్రొసీజర్ కోడ్): 10 ప్రశ్నలు
  • ఎవిడెన్స్​ యాక్ట్​ (భారతీయ శిక్ష అధినియం): 8 ప్రశ్నలు
  • మధ్యవర్తిత్వ చట్టంతో సహా ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం(Alternate Dispute Redressal Including Arbitration Act): 4 ప్రశ్నలు
  • కుటుంబ చట్టం(Family Law): 8 ప్రశ్నలు
  • ప్రజా ప్రయోజన వ్యాజ్యం(Public Interest Litigation (PIL)): 4 ప్రశ్నలు
  • అడ్మినిస్ట్రేషన్ చట్టం: 3 ప్రశ్నలు
  • బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ ప్రొఫెషనల్ మిస్​కాండక్ట్​ కేసులు(Professional Ethics and Cases of Professional Misconduct under BCI Rules): 4 ప్రశ్నలు
  • కంపెనీ చట్టం(Company Law): 2 ప్రశ్నలు
  • పర్యావరణ చట్టం: 2 ప్రశ్నలు
  • సైబర్ చట్టం(Cyber Law): 2 ప్రశ్నలు
  • కార్మిక, పారిశ్రామిక చట్టం: 4 ప్రశ్నలు
  • మోటారు వాహన చట్టం, వినియోగదారుల రక్షణ చట్టంతో సహా లా ఆఫ్​ టోర్ట్: 5 ప్రశ్నలు
  • పన్నుకు సంబంధించిన చట్టం: 4 ప్రశ్నలు
  • కాంట్రాక్ట్ చట్టం, నిర్దిష్ట ఉపశమనం, ఆస్తి చట్టాలు, నెగోషియబుల్ ఇన్​స్ట్రుమెంట్ చట్టం: 8 ప్రశ్నలు
  • భూసేకరణ చట్టం(Land Acquisition Act): 2 ప్రశ్నలు
  • మేథో సంపత్తి చట్టాలు(Intellectual Property Laws): 02 ప్రశ్నలు.

Whats_app_banner

సంబంధిత కథనం