Telangana News Live December 15, 2024: Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను, ఆ ప్రచారమంతా ఊహాగానాలే-కేంద్ర మంత్రి బండి సంజయ్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 15 Dec 202404:53 PM IST
Bandi Sanjay : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో తాను లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగిస్తారని వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారమంతా ఊహాగానాలేనని కొట్టిపారేశారు.
Sun, 15 Dec 202402:35 PM IST
TG Schools Holiday : తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. దీంతో గ్రూప్-2 పరీక్ష కేంద్రాలుగా ఉన్న 1368 స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ప్రకటించారు. మిగతా స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది.
Sun, 15 Dec 202402:14 PM IST
Manchu Family Issue : మంచు కుటుంబ వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంపై మంచు మనోజ్ మరో సంచలన ఆరోపణ చేశారు. విష్ణు టీమ్ తో తన ఇంటికి వచ్చి జనరేటర్ లో పంచదార పోశారని ఆరోపించారు. దీంతో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు.
Sun, 15 Dec 202412:58 PM IST
Dy CM Bhatti Vikramarka : తెలంగాణ ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తామని ప్రకటించింది. ఈ పథకం మొదటి విడత నగదును డిసెంబర్ 28న జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
Sun, 15 Dec 202409:33 AM IST
Karimnagar Crime : మావోయిస్టు అగ్రనేత స్వగ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. తుపాకులతో బెదిరించి దాడి చేసి చోరీకి పాల్పడ్డారు. అపహరించిన సొత్తు తక్కువే అయినా గన్నులు పెట్టి బెదిరించి దాడి చేసి చోరీకి పాల్పడి పోలీసుల పెను సవాల్ విసిరారు.
Sun, 15 Dec 202409:14 AM IST
Cyber Crime : సైబర్ నేరగాళ్ళు ట్రెండ్ మార్చారు. సరికొత్త మోసానికి తెర లేపారు. మినీ ఏటీఎంలే లక్ష్యంగా బిర్యానీ, పాస్ట్ పుడ్ ఆర్డర్లతో టోకరా వేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు మోసపోయి లబోదిబోమంటున్నారు.
Sun, 15 Dec 202406:33 AM IST
- Telangana VRO VRA System: తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థలో మళ్లీ మార్పులు రాబోతున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి రాబోతుంది. ఇదిలా ఉంటే… తిరిగి వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను పునరుద్ధరించేందకు సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
Sun, 15 Dec 202401:19 AM IST
- South Central Railway Sabarimala Trains : శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ లోని ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేర్వేరు స్టేషన్ల నుంచి 12 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది.