శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు రావణుడు చదివిన స్తోత్రం ఇదే..! మీరూ పఠించండి అనుగ్రహం పొందండి-this is the hymn read by ravana to please lord shiva read it yourself and get grace ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు రావణుడు చదివిన స్తోత్రం ఇదే..! మీరూ పఠించండి అనుగ్రహం పొందండి

శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు రావణుడు చదివిన స్తోత్రం ఇదే..! మీరూ పఠించండి అనుగ్రహం పొందండి

Ramya Sri Marka HT Telugu
Dec 15, 2024 06:35 AM IST

తనకు మించిన శక్తివంతుడు లేడని విర్రవీగిన లంకాధిపతి రావణుడు, ఆ పరమశివుడి నుంచి వరాలు ఎలా పొందగలిగాడు..? శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ఏం చేశాడు, ఎలాంటి స్తోత్రం చదివాడు? ఇక్కడ తెలుసుకోవచ్చు.

శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు రావణుడు పఠించిన స్తోత్రం
శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు రావణుడు పఠించిన స్తోత్రం

దశకంఠుడు రావణుడు లంకకు మహారాజు, సీతాదేవిని అపహరించిన దుర్మార్గుడు మాత్రమే కాదు.. ఆ మహాదేవుని మెప్పించగల మేధావి, కవితా, కలా నైపుణ్యం గల జ్ఞాని. రావణునికి ఉన్న 10 తలల మేధస్సు, శాస్త్రాలపై పట్టు, శివుడిని సైతం పరవశుడ్ని చేసింది. రామాయణంలోనూ రావణుడికి గల నైపుణ్యాలను పేర్కొన్నారంటే అతని భక్తితో పాటు అతను చూపించిన ఏకాగ్రత కూడా ఒక కారణం. పరమశివుడు నుంచి అపారమైన, శక్తివంతమైన వరాలను పొందేందుకు అవే దోహదపడ్డాయి. శివుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు రావణుడు ఉచ్ఛరించిన స్తోత్రం ఏమిటో తెలుసుకుందాం.

రావణుని సృజనాత్మకత:

శివుని ఆరాధించేందుకు రావణుడు స్వయంగా అనేక శక్తివంతమైన వాక్యాలతో పొందుపరిచిన స్తోత్రం శివతాండవ స్తోత్రం. ఇది శివుని నృత్యం, తాండవం, మహిమను కీర్తిస్తూ అద్భుతమైన సంస్కృత కవిత్వంగా రూపొందింది. ఈ స్తోత్రంలోనిగాన మధురిమ, దాని కవిత్వ అమరిక, ఆధ్యాత్మిక దృఢత్వం, శక్తివంతమైన భక్తి రావణుని కవితా ప్రతిభను అతనికి శివునిపై ఉన్న అనురాగాన్ని ప్రదర్శిస్తుంది.

శివ తాండవ స్తోత్రం ఎలా ఆవిర్భవించిందంటే..

ఒకానొక సందర్భంలో, శివుని ముందు తన శక్తిని ప్రదర్శించడానికి కైలాసపర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు రావణుడు. అతనికి బుద్ధి రావాలని శివుడు తన కాలి బొటనవేలితో పర్వతాన్ని ఇంకా కిందుకు నొక్కుతాడు. రావణుడు తన తప్పును గ్రహించి, శివున్ని శాంతింపచేయడానికి, తన తప్పు మన్నించమని వేడుకునే సందర్భంలో శివతాండవ స్తోత్రాన్ని రచించాడు. ఈ స్తోత్రంతో శివుని పూజించి, శివుని మహిమను పొగడుతూ, ప్రకృతి, శక్తి, అంతిమ సృష్టిగా, వినాశనాన్ని సృష్టించగల మహాశక్తిగా అభివర్ణించాడు. దాంతో రావణుని హృదయాంతరాలలో కనిపించిన భక్తికి, శివుడు అతన్ని క్షమించడమే కాకుండా అపారమైన వరాలను ప్రసాదించాడు.

శివతాండవ స్తోత్రపు ముఖ్యాంశాలు..

శివతాండవ స్తోత్రం అనేది శివుని దివ్యమైన లక్షణాల గురించి విస్తృతంగా వర్ణించిన సంస్కృత కవిత. ఈ స్తోత్రంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

1. శివ తాండవం:

ఈ స్తోత్రం మొదటి పంక్తులు శివుని తాండవాన్ని వర్ణిస్తాయి. ఇది సృష్టి, సంరక్షణ, వినాశన శాశ్వత చక్రాలను సూచిస్తుంది. శక్తివంతమైనది, దివ్యమైనది అయిన ఈ నృత్యం విశ్వంలోని సృజనాత్మక మార్పులను ప్రదర్శిస్తుంది.

2. శివుని శుభాత్మక అలంకారాలు:

ఈ స్తోత్రం శివుని కేశాలు, తలపై అర్ధచంద్రాన్ని, మెడలో పాము, ఆయన జుట్టులో నుండి ప్రవహించే గంగను ప్రశంసిస్తుంది. ఇవన్నీ శివుని గౌరవం, కాలచక్రం, శుద్ధతను సూచించే దివ్యమైన లక్షణాలు.

3. శివుని జ్వాలాస్పద స్వభావం:

రావణుని స్తోత్రం శివుని అగ్ని వంటి, అజేయమైన శక్తిని ప్రతిబింబిస్తుంది. వినాశన, సృష్టి ప్రక్రియలో శివుని పాత్రను వర్ణిస్తుంది.

4. రావణుని భక్తి:

రావణుని వాక్యాలలో శివుని పట్ల ఒక నిస్సందేహమైన భక్తి కనపడుతుంది. అతని అహంకారి అయిన రావణుడు ఆరాధన విషయంలో కూడా తనను మించి ఎవరూ శివుడిని ఆరాధించలేరని నిరూపించాడు. రావణుని భక్తి అత్యతం శక్తిమంతమైనది, అఖండమైనదని పురాణాలు చెబుతున్నాయి.

5. దివ్య శక్తి:

రావణుని అహంకారం, గర్వం అతన్ని పరాజయానికి తీసుకెళ్లినా, అతని మనసులో ఉన్న శుద్దత, భక్తి శివుని అనుగ్రహాన్ని పొందడానికి మార్గం చూపింది.

ఆ పరమశివుని ఆశీర్వాదాలను పొందడానికి నిజమైన భక్తితో, హృదయాన్ని శివునికి అంకితం చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకోగలిగాడు. జీవితంలో ఎన్ని లోపాలున్నా, ఎలాంటి చరిత్ర ఉన్న ఈ శివతాండవ స్తోత్రం రచించి, పఠించి శివున్ని ఆరాధించడం వల్ల పరమశివుడితో శాశ్వత బంధాన్ని ఏర్పరచుకోగలిగాడు. ఈ స్తోత్రాన్ని జపించడం ద్వారా భక్తులు శక్తి, జ్ఞానం, ఆధ్యాత్మికత పొందుతారని, శివుడిని సులభంగా ప్రసన్నం చేసుకోగలుగుతారని విశ్వసిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner