Telugu Cinema News Live December 15, 2024: Bigg Boss Finale: బిగ్ బాస్ ఫినాలేకి స్పెషల్ గెస్టుగా రామ్ చరణ్- కన్నడ, తమిళ స్టార్ హీరోలు, తెలుగు హీరోయిన్స్ ఎంట్రీ!
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 15 Dec 202402:00 AM IST
- Bigg Boss Telugu 8 Finale Chief Guest Ram Charan: బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్స్‌కు చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్ రానున్నాడని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో తమిళం, కన్నడ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఉపేంద్ర, సాయి ధరమ్ తేజ్ సందడి చేయనున్నారని సమాచారం.
Sun, 15 Dec 202401:54 AM IST
యూఐ మూవీని ప్రభాస్ కల్కితో కంపేర్ చేస్తూ జరుగుతోన్న ప్రచారంపై హీరో ఉపేంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓం మూవీ నుంచే సెన్సార్ పరంగా తన సినిమాలకు సమస్యలు ఎదురవుతూ వస్తోన్నాయని చెప్పాడు. ఉపేంద్ర యూఐ మూవీ డిసెంబర్ 20న తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో రిలీజ్ కాబోతోంది.
Sun, 15 Dec 202401:04 AM IST
Thriller OTT: సత్యదేవ్ జీబ్రా మూవీ డిసెంబర్ 20 నుంచి ఆహా ఓటీటీలోస్ట్రీమింగ్ కాబోతోంది. అనౌన్స్‌చేసిన డేట్ కంటే రెండు రోజుల ముందే ఈ మూవీని ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్లు ఆహా ప్రకటించింది. గోల్డ్ యూజర్లు డిసెంబర్ 18 నుంచే ఈ మూవీని చూడొచ్చని వెల్లడించింది.
Sun, 15 Dec 202412:22 AM IST
Bougainvillea Review: మలయాళం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బోగన్ విల్లా సోనీ లివ్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్, కుంచాకో బోబన్ హీరోలుగా నటించారు.
Sun, 15 Dec 202412:00 AM IST
- Bigg Boss Telugu 8 Avinash And Prerana Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఇవాళ జరగనుంది. అయితే బిగ్ బాస్ 8 తెలుగు ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ శనివారం (డిసెంబర్ 13) జరగ్గా హౌజ్ నుంచి అవినాష్, ప్రేరణ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మరి అవినాష్, ప్రేరణ రెమ్యునరేషన్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.