SCR Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు మరో అప్డేట్ - ఏపీ, తెలంగాణ నుంచి శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు
South Central Railway Sabarimala Trains : శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ లోని ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేర్వేరు స్టేషన్ల నుంచి 12 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది.
అయ్యప్ప భక్తుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లపై మరో ప్రకటన చేసింది. వేర్వేరు స్టేషన్ల నుంచి శబరిమలకు 12 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇందులో కొన్ని సికింద్రాబాద్, కాకినాడ పోర్టు, విజయవాడ, గుంటూరు, నర్సాపూర్ నుంచి నడవనున్నాయి. వీటిలో కొన్ని ఈ నెలలోనే రాకపోకలు ఉండగా... మరికొన్ని రైళ్లు జనవరిలో రాకపోకలు సాగిస్తాయని తాజా ప్రకటనలో పేర్కొంది.
సికింద్రాబాద్ - కొల్లాం మద్య డిసెంబర్ 19,26 తేదీల్లో స్పెష్ ట్రైన్ నడవనుంది. ఇది రాత్రి 8 గంటలకు బయల్దేరి... శనివారం రాత్రి 1.30 గంటలకు కొల్లాంకు చేరుతుంది. ఇక కొల్లాం నుంచి సికింద్రాబాద్ కు కూడా మరో ట్రైన్ కూడా ఉంటుంది. ఇది ఈనెల 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
కాకినాడ పోర్టు నుంచి కొల్లాంకు డిసెంబర్ 18, 25 తేదీల్లో స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఇక కొల్లాం నుంచి కాకినాడ పోర్టుకు డిసెంబర్ 20, 27 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది. ఇక విజయవాడ నుంచి కూడా కొల్లాంకు స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఇది డిసెంబర్ 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇక కొల్లాం నుంచి కాకినాడ పోర్టుకు డిసెంబర్ 23, 30 తేదీల్లో ట్రైన్ బయల్దేరుతుంది.
జనవరిలో నడిచే రైళ్లు:
సికింద్రాబాద్ - కొల్లాం మధ్య జనవరి 2, 9,16 తేదీల్లో స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఇది రాత్రి 8 గంటలకు బయల్దేరి.. శనివారం రాత్రి 1.30 గంటలకు కొల్లాం చేరుతుంది. ఇక కొల్లాం - సికింద్రాబాద్ మధ్య జనవరి 4, 11,18 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.
మరోవైపు కాకినాడ టౌన్ నుంచి కొల్లాంకు జనవరి 1, 8 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. కొల్లాం నుంచి గుంటూరుకు జనవరి 3, 10 తేదీల్లో ట్రైన్స్ ఉండగా.. మరోవైపు గుంటూరు నుంచి కొల్లాంకు కూడా జనవరి 4,11,18 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నర్సాపూర్ నుంచి కొల్లాంకు జనవరి 15, 22 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఇక కొల్లాం నుంచి నర్సాపూర్ కు జనవరి 17, 24 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ ఉంటాయని పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లల్లో ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.
మరికొన్ని ప్రత్యేక రైళ్లు….
- రైలు నెం.07065 : హైదరాబాద్ - కొట్టాయం : మంగళవారం మధ్యాహ్నం 12.00లకు బయలుదేరి బుధవారం సాయంత్రం 4.10 గమస్థానం చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 7, 14, 21, 28వ తేదీల్లో అందుబాటులో ఉంది.
- రైలు నెం.07066 : కొట్టాయం - సికింద్రాబాద్ : బుధవారం సాయంత్రం 6.10లకు బయలుదేరి గురువారం రాత్రి 11.45 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 8, 15, 22, 29వ తేదీల్లో అందుబాటులో ఉంది.
- రైలు నెం.07167 : మౌలాలి- కొట్టాయం : శుక్రవారం మధ్యాహ్నం 2.30 లకు బయలుదేరి శనివారం సాయంత్రం 6.45 గంటలకు గమ్యస్థానికి చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 03, 10, 17, 24, 31వ తేదీల్లో అందుబాటులో ఉంది.
- రైలు నెం. 07168 : కొట్టాయం - సికింద్రాబాద్ : శనివారం రాత్రి 9.45 గంటలకు బయలుదేర సోమవారం తెల్లవారుజామున 01.30 గంటలు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు వచ్చే నెల 04, 11, 18, 25, ఫిబ్రవరి 01వ తేదీల్లో అందుబాటులో ఉంది.
- రైలు నె.07169 : కాచిగూడ - కొట్టాయం : ఈ రైలు ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 8.50 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు వచ్చే ఏడాది 05, 12, 19, 26 తేదీల్లో ఈ స్వరీసులు అందుబాటులో ఉండనుంది.
- రైలు నెంబర్ 07170 : కొట్టాయం-కాచిగూడ : సోమవారం రాత్రి 8.50 పైవు బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 1.00 సమయానికి గమ్య స్తానికి చేరుకుంటుంది.
- రైలు నెం. 07171 : మౌలాలి - కొల్లం : శనివారం సాయంత్రం 6.45 లకు బయలుదేరి ఆదివారం 10.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఈ రైలు జనవరిలో 04, 11, 18, 25 అందుబాటులో ఉంటుంది.
- రైలు నెంబర్ : 07172 : కొల్లం - మౌలాలీ : ఈ రైలు సోమవారం తెల్ల జామున 2.30 బయలుదేరి మరుసటి రోజు మంగళవారం 11.00 గమ్యానికి చేరుకుంటుంది. జనవరిలో 6, 13, 20, 27 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.