Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు మరో అప్డేట్ - శబరిమలకు మరో 22 ప్రత్యేక రైళ్లు, ఇవిగో వివరాలు
South Central Railway Sabarimala Trains : అయ్యప్త భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. మరో 22 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాచిగూడ, హైదరాబాద్, నాందేడ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి ఈ రైళ్లు నడవనున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపుతుండగా… తాజాగా మరో 22 స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. వేర్వేరు స్టేషన్ల నుంచి శమరిమలకు 22 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది.
డిసెంబర్ 13 నుంచి జనవరి 26 వరకు…
ఇందులో కొన్ని ప్రత్యేక రైళ్లు కాచిగూడ, హైదరాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్ల నుంచి ఉన్నాయి. డిసెంబర్ 13 నుంచి జనవరి 26 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తాజా ప్రకటనలో పేర్కొన్నారు.
నాందేడ్ - కొల్లా మధ్య జనవరి 3,10 తేదీల్లో స్పెషల్ ట్రైన్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇక కొల్లాం నుంచి నాందేడ్ కు జనవరి 5, 12 తేదీల్లో మరో ట్రైన్ ను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఇక సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కొల్లాంకు జనవరి 17, 24 తేదీల్లో ప్రత్యేక రైలు వెళ్తుందని ప్రకటించారు. అంతేకాకుండా కొల్లాం నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ కు జనవరి 19, 26 తేదీల్లో మరో స్పెషల్ ట్రైన్ ఉంటుందని వివరించారు.
హైదరాబాద్ నుంచి కొట్టాయంకు డిసెంబర్ 13వ తేదీ స్పెషల్ ట్రైన్ ఉంటుంది. కొట్టాయం నుంచి సికింద్రాబాద్ కు డిసెంబర్ 14వ తేదీన మరో రైలు అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్ - కొట్టాయం మధ్య డిసెంబర్ 20,27 తేదీల్లో స్పెషల్ ట్రైన్ ఉంటుంది. కొట్టాయం - హైదరాబాద్ మధ్య డిసెంబర్ 21, 28 తేదీల్లో ప్రత్యేక రైలు నడవనుంది.
డిసెంబర్ 8, 15,22,29 తేదీల్లో కాచిగూడ స్టేషన్ నుంచి కొట్టాయంకు ప్రత్యేక రైలు వెళ్తుంది. డిసెంబర్ 9,16,23,30 తేదీల్లో కొట్టాయం నుంచి కాచిగూడ స్టేషన్ కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
మౌలాలి, నర్సాపూర్ స్టేషన్ల నుంచి స్పెషల్ ట్రైన్స్ :
అయ్యప్ప భక్తుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లపై మరో ప్రకటన చేసింది. వేర్వేరు స్టేషన్ల నుంచి శమరిమల 28 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇందులో కొన్ని మౌలాలి నుంచి, మరికొన్ని కాచిగూడ, నర్సాపూర్ నుంచి ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన బుకింగ్స్ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.
మౌలాలి రైల్వే స్టేషన్ నుంచి - కొల్లాంకు డిసెంబరు 11,18,25 తేదీల్లో ప్రత్యేక రైలు (ట్రైన్ నెంబర్ 07193) బయల్దేరుతుంది. ఇక కొల్లంనుంచి మౌలాలికి(ట్రైన్ నెంబర్ 07194) కూడా ప్రత్యేక రైలు ఉంటుంది. ఇది డిసెంబర్ 13,20,27 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది.
అంతేకాకుండా మాలౌలి నుంచి కొల్లాంకు (07149) డిసెంబర్ 14,21,28 తేదీల్లో ట్రైన్ ఉంటుంది. ఇక కొల్లం నుంచి మౌలాలికి (07150) కూడా ట్రైన్ బయల్దేరుతుంది. ఇది డిసెంబర్ 16,23,30 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆయా తేదీల్లో ఈ ట్రైన్ కొల్లాం నుంచి మధ్యాహ్నం 02,.30 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 09. 50 గంటలకు మౌలాలి చేరుకుంటుంది.
ఇక కాచిగూడ నుంచి కొట్టాయంకు ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ జనవరి 2,9,16,23 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది. ఇక కొట్టాయం నుంచి కాచిగూడకు కూడా ట్రైన్ ఉంటుంది. ఇది జనవరి 3,10,17,24 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
మరోవైపు ఏపీలోని కాకినాడ టౌన్ నుంచి కొల్లాంకు స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు. ఈ ట్రైన్ జనవరి 6, 13 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. కొల్లాం నుంచి కాకినాడ టౌన్ కు జనవరి 8,15 తేదీల్లో మరో ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇక నర్సాపూర్ నుంచి కొల్లంకు కూడా స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. జనవరి 20, 27 తేదీల్లో రాకపోకలు సాగిస్తాయి. కొల్లాం నుంచి నర్సాపూర్ కు జనవరి 22, 29 తేదీల్లో ట్రైన్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.
సంబంధిత కథనం