Sabarimala Special Trains : శబరిమల భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, జనవరి నెలలో 34 స్పెషల్ ట్రైన్స్
Sabarimala Special Trains : శబరిమల భక్తుల రద్దీ క్లియర్ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో 34 ప్రత్యేక రైళ్లు నడపనుంది. జనవరి, ఫిబ్రవరి నెలలో తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.
శబరిమల వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో 34 అదనపు సర్వీసులను నడుపుతున్న ప్రకటించింది. శబరిమల యాత్రికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
- రైలు నెం.07065 : హైదరాబాద్ - కొట్టాయం : మంగళవారం మధ్యాహ్నం 12.00లకు బయలుదేరి బుధవారం సాయంత్రం 4.10 గమస్థానం చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 7, 14, 21, 28వ తేదీల్లో అందుబాటులో ఉంది.
- రైలు నెం.07066 : కొట్టాయం - సికింద్రాబాద్ : బుధవారం సాయంత్రం 6.10లకు బయలుదేరి గురువారం రాత్రి 11.45 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 8, 15, 22, 29వ తేదీల్లో అందుబాటులో ఉంది.
- రైలు నెం.07167 : మౌలాలి- కొట్టాయం : శుక్రవారం మధ్యాహ్నం 2.30 లకు బయలుదేరి శనివారం సాయంత్రం 6.45 గంటలకు గమ్యస్థానికి చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 03, 10, 17, 24, 31వ తేదీల్లో అందుబాటులో ఉంది.
- రైలు నెం. 07168 : కొట్టాయం - సికింద్రాబాద్ : శనివారం రాత్రి 9.45 గంటలకు బయలుదేర సోమవారం తెల్లవారుజామున 01.30 గంటలు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు వచ్చే నెల 04, 11, 18, 25, ఫిబ్రవరి 01వ తేదీల్లో అందుబాటులో ఉంది.
- రైలు నె.07169 : కాచిగూడ - కొట్టాయం : ఈ రైలు ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 8.50 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు వచ్చే ఏడాది 05, 12, 19, 26 తేదీల్లో ఈ స్వరీసులు అందుబాటులో ఉండనుంది.
- రైలు నెంబర్ 07170 : కొట్టాయం-కాచిగూడ : సోమవారం రాత్రి 8.50 పైవు బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 1.00 సమయానికి గమ్య స్తానికి చేరుకుంటుంది.
- రైలు నెం. 07171 : మౌలాలి - కొల్లం : శనివారం సాయంత్రం 6.45 లకు బయలుదేరి ఆదివారం 10.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఈ రైలు జనవరిలో 04, 11, 18, 25 అందుబాటులో ఉంటుంది.
- రైలు నెంబరd : 07172 : కొల్లం - మౌలాలీ : ఈ రైలు సోమవారం తెల్ల జామున 2.30 బయలుదేరి మరుసటి రోజు మంగళవారం 11.00 గమ్యానికి చేరుకుంటుంది. జనవరిలో 6, 13, 20, 27 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
రైలు నెం. 07065/07066 : హైదరాబాద్ - కొట్టాయం - సికింద్రాబాద్ స్పెషల్స్ (08 సర్వీసులు):
ఈ ప్రత్యేక రైళ్లు బేగంపేట, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూరు, సీరం, సూలేహళ్లి, యాద్గిరిగుట్టు, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, జోల కట్టాడి, లింగంపల్లి, సాలార్ కట్టాడి, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్ స్టేషన్‌లు రెండు దిశలలో ఉన్నాయి.
రైలు నెం. 07167/07168 : మౌలాలి - కొట్టాయం - సికింద్రాబాద్ స్పెషల్స్ (10 సర్వీసులు):
ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం, ఎట్టుమనూరులో రెండు వైపులా ఆగనుంది.
3. రైలు నం. 07169/07170 : కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ ప్రత్యేకతలు:
ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, పాలక్కాడ్, కోయంబత్తూర్, కోయంబత్తూరు, తిరుప్పూర్ లో ఆగుతాయి. అలువా, ఎర్నాకులం, రెండు వైపులా ఎట్టుమనూరు స్టేషన్లు రైళ్లు ఆగుతాయి.
4. రైలు నం. 07171/07172 : మౌలాలి- కొల్లాం - మౌలాలీ ప్రత్యేకతలు:
ఈ ప్రత్యేక రైళ్లు భవవగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్‌పూర్‌లో ఆగుతాయి. పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం, ఎట్టుమనూర్, కొట్టాయం, చంగనస్సేరి, తిరువల్ల, చెంగన్నూర్, కాయంకుళం స్టేషన్‌లలో ఇరువైపులా ఆగుతాయి.
ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ AC, 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అందరూ ఈ స్వరీసులుని వియోగించుకవచచ్చి రైల్వే అధికారులు కోరారు.
సంబంధిత కథనం