Thriller OTT: అనౌన్స్ చేసిన డేట్ కంటే రెండు రోజుల ముందే ఓటీటీలోకి తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ-zebra ott release date satya dev crime thriller movie early streaming for aha gold users from december 18th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thriller Ott: అనౌన్స్ చేసిన డేట్ కంటే రెండు రోజుల ముందే ఓటీటీలోకి తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ

Thriller OTT: అనౌన్స్ చేసిన డేట్ కంటే రెండు రోజుల ముందే ఓటీటీలోకి తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Dec 15, 2024 06:35 AM IST

Thriller OTT: స‌త్య‌దేవ్ జీబ్రా మూవీ డిసెంబ‌ర్ 20 నుంచి ఆహా ఓటీటీలోస్ట్రీమింగ్ కాబోతోంది. అనౌన్స్‌చేసిన డేట్ కంటే రెండు రోజుల ముందే ఈ మూవీని ఓటీటీలోకి తీసుకురాబోతున్న‌ట్లు ఆహా ప్ర‌క‌టించింది. గోల్డ్ యూజ‌ర్లు డిసెంబ‌ర్ 18 నుంచే ఈ మూవీని చూడొచ్చ‌ని వెల్ల‌డించింది.

థ్రిల్లర్ ఓటీటీ
థ్రిల్లర్ ఓటీటీ

Thriller OTT: స‌త్య‌దేవ్‌, డాలీ ధ‌నుంజ‌య‌ (పుష్ప ఫేమ్‌) హీరోలుగా న‌టించిన జిబ్రా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. డిసెంబ‌ర్ 20 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. అనౌన్స్ చేసిన డేట్ కంటే రెండో రోజుల ముందే జీబ్రా సినిమా చూసే అవ‌కాశాన్ని త‌మ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు ఆహా ఓటీటీ క‌ల్పించింది.

గోల్డ్ యూజ‌ర్లు డిసెంబ‌ర్ 18 నుంచే ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీని చూడొచ్చ‌ని ఆహా ఓటీటీ సంస్థ ప్ర‌క‌టించింది. వారి కోసం రెండు రోజుల ముందే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఇద్ద‌రు హీరోయిన్లు...

జీబ్రా మూవీకి ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్రియా భ‌వానీ శంక‌ర్‌, అమృత అయ్యంగార్ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో సత్య రాజ్ కీలక పాత్ర లో క‌నిపించాడు.న‌వంబ‌ర్ 22న జీబ్రా మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. స‌త్య‌దేవ్ రీసెంట్ మూవీస్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సినిమాగా నిలిచింది. ఫ‌స్ట్ వీక్‌లో మోస్తారు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ మూవీ మౌత్ టాక్‌తో లాభాల్లోకి అడుగుపెట్టింది. ఈ మూవీతో చాలా రోజుల త‌ర్వాత స‌క్సెస్‌ను అందుకున్నాడు స‌త్య‌దేవ్‌. జీబ్రా మూవీకి కేజీఎఫ్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ మ్యూజిక్ అందించాడు.

జీబ్రా క‌థ ఏంటంటే?

సూర్య (స‌త్య‌దేవ్‌) ప్రైవేటు బ్యాంకు ఎంప్లాయ్‌. బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌తో పాటు అందులోని లోతుపాతుల‌పై పూర్తిగా అవగాహ‌న ఉంటుంది. త‌న బ్యాంకులోనే ప‌నిచేసే స్వాతిని (ప్రియా భ‌వానీ శంక‌ర్‌) ఇష్ట‌ప‌డ‌తాడు. ఆమెను పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటాడు. ఓ వ్య‌క్తి ఖాతాలో జ‌మ చేయాల్సిన డ‌బ్బును మ‌రొక‌రి అకౌంట్‌లో వేస్తుంది స్వాతి. త‌న తెలివితేట‌ల‌తో స్వాతి పొగొట్టుకున్నడ‌బ్బును రాబ‌డుతాడు స‌త్య‌...

అదే టైమ్‌లో మ‌రో బ్యాంక్‌లో సూర్య పేరుతో ఉన్న‌ అకౌంట్‌లో ఐదు కోట్లు ప‌డ‌తాయి. ఆ డ‌బ్బు తీసుకునే లోపే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఆ ఐదు కోట్లు ఎక్క‌డివి? అదే త‌న డ‌బ్బే అంటూ గ్యాంగ్ స్ట‌ర్ ఆది ( డాలీ ధ‌నుంజ‌య‌)...సూర్య‌ను ఎందుకు బెదిరించాడు? త‌న అకౌంట్‌లో ప‌డిన డ‌బ్బును ఆదికి సూర్య ఎలా చెల్లించాడు? అనే అంశాల‌తో ద‌ర్శ‌కుడు ఈశ్వ‌ర్ కార్తీక్ జీబ్రా మూవీని తెర‌కెక్కించాడు.

ఫుల్ బాటిల్‌...

ఈ ఏడాది జీబ్రాతో పాటు కృష్ణ‌మ్మ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు స‌త్య‌దేవ్‌. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ప్రొడ్యూస్ చేసిన కృష్ణ‌మ్మ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం తెలుగులో ఫుల్ బాటిల్‌తో పాటు గ‌రుడ సినిమాలు చేస్తోన్నాడు స‌త్య‌దేవ్‌.

Whats_app_banner