SS Rajamouli Dance: యంగ్ హీరో పెళ్లిలో రవితేజ సాంగ్‌కి భార్యతో కలిసి రాజమౌళి స్టెప్‌లు.. వీడియో వైరల్
SS Rajamouli Dances With Wife Rama: సినిమాలతో బిజీగా ఉండే రాజమౌళి.. తన భార్యతో కలిసి మాస్ మహారాజా పాటకి డ్యాన్స్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన అన్న కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ పెళ్లి వేడుకలో రాజమౌళి వేసిన స్టెప్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
దర్శకధీరుడు రాజమౌళి మాస్ స్టెప్‌లతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు, యంగ్ హీరో శ్రీ సింహ పెళ్లి వేడుకలు ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్నాయి. ప్రముఖ నటుడు మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటితో వివాహ బంధంలోకి శ్రీసింహ అడుగుపెట్టబోతున్నాడు.
రవితేజ పాస్ట్ బీట్‌కి స్టెప్‌లు
ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా జరిగిన సంగీత్‌లో రాజమౌళి తన భార్య రమా రాజమౌళితో కలిసి మాస్ స్టెప్‌లతో అందర్నీ అలరించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ఫాస్ట్ బీట్ ‘లంచ్ కొస్తావా మంచె కొస్తావా’కి సరదాగా ఇద్దరూ డ్యాన్స్ చేశారు.
శ్రీసింహా సినిమాలు
టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న శ్రీసింహ.. ఇటీవల మత్తు వదలరా 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతను నటించిన ఉస్తాద్, దొంగలున్నారు జాగ్రత్త సినిమాలకి కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా యమదొంగ సినిమాలోనూ శ్రీసింహ మెరిశాడు.
మహేష్ బాబు సినిమాతో బిజీ
ఆర్ఆర్‌ఆర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి.. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది.