Jr NTR Phone Call to Allu Arjun: అల్లు అర్జున్‌కి కాల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఇంటి దగ్గరికి రాలేకపోతున్నాను కానీ?
Jr NTR Phone Call to Allu Arjun: దేవర సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం వార్-2తో మళ్లీ బిజీ అయిపోయారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియగానే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ శనివారం ఫోన్ చేసి మాట్లాడారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన అల్లు అర్జున్.. శనివారం ఉదయం బెయిల్‌పై విడుదల అయ్యారు. దాంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలో కొంత మంది సెలెబ్రిటీలు ఫోన్ చేయగా.. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈరోజు సాయంత్రం కాల్ చేసి అల్లు అర్జున్‌తో మాట్లాడారు.
ముంబయిలో జూనియర్ ఎన్టీఆర్
వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హైదరాబాద్‌లో లేరు.. వార్-2 మూవీ షూటింగ్ నిమిత్తం ముంబయిలో ఉన్నారు. దాంతో.. అక్కడి నుంచి ఫోన్ చేసి అల్లు అర్జున్‌తో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత స్వయంగా వచ్చి కలుస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
టాప్ ట్రెండింగ్‌లో దేవర
అయాన్ ముఖర్జీ, హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 మూవీలో నటిస్తూ గత కొన్ని రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది విడుదలైన దేవర పార్ట్-1 మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా రూ.400 కోట్లకిపైగా వసూళ్లని రాబట్టిన విషయం తెలిసిందే. ఓటీటీలోనూ ఈ సినిమా టాప్ ట్రెండింగ్‌లో కొనసాగింది.
అల్లు అర్జున్‌ని పరామర్శించిన సెలెబ్రిటీలు
అర్జున్ ఇంటికి వెళ్లి ఈరోజు పరామర్శించిన వారిలో.. డైరెక్టర్ సుకుమార్, చిరంజీవి సతీమణి సురేఖ, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, నాగచైతన్య, రానా దగ్గుబాటి, నిమ్మ ఉపేంద్ర, వెంకటేష్ తదితరులు ఉన్నారు.
ఎక్స్‌లో ఐకాన్ స్టార్‌కి మద్దతు
సోషల్ మీడియా ద్వారా వరుణ్ ధావన్, నాని, రష్మిక మందన్న, రాంగోపాల్ వర్మ, వివేక్ ఒబెరాయ్, సమంత రూత్ ప్రభు, విఘ్నేష్ శివన్, రవి కిషన్, శ్రీలీల, శర్వానంద్, సందీప్ కిషన్, అడివి శేష్, రాహుల్ రామకృష్ణ తదితరులు తమ మద్దతు తెలియజేశారు.