Bank Holidays in December : ఏడాది చివరి నెలలో బ్యాంకులకు సెలవులే- సెలవులు! పూర్తి లిస్ట్​ ఇదే..-bank holidays in december 2024 check the full list here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bank Holidays In December : ఏడాది చివరి నెలలో బ్యాంకులకు సెలవులే- సెలవులు! పూర్తి లిస్ట్​ ఇదే..

Bank Holidays in December : ఏడాది చివరి నెలలో బ్యాంకులకు సెలవులే- సెలవులు! పూర్తి లిస్ట్​ ఇదే..

Sharath Chitturi HT Telugu
Nov 29, 2024 01:00 PM IST

December bank holidays list : డిసెంబర్​ 2024కు సంబంధించిన బ్యాంక్​ సెలవుల డేటా విడుదలైంది. ఈ ఏడాది చివరి నెలలో బ్యాంక్​లకు లభించిన సెలవుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

డిసెంబర్​లో బ్యాంక్​ సెలవుల లిస్ట్​..
డిసెంబర్​లో బ్యాంక్​ సెలవుల లిస్ట్​.. (Mint)

ఇంకో రెండు రోజుల్లో ఈ ఏడాది చివరి నెల ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2024 బ్యాంక్ సెలవుల జాబితాను మేము మీకు అందిస్తున్నాము. పండుగ, ప్రాంతీయ, జాతీయ సెలవులతో పాటు అన్ని బ్యాంకులు (ప్రభుత్వ- ప్రైవేట్) కూడా ఈ సంవత్సరం చివరి నెలలో మొత్తం రెండు శని, ఐదు ఆదివారాలు సెలవును కలిగి ఉంటాయి.

డిసెంబర్ 2024లో బ్యాంకులకు కనీసం 17 లిస్టెడ్ సెలవులు (వారాంతపు సెలవులతో సహా) ఉన్నాయి. కొన్ని లాంగ్ వీకెండ్స్ కూడా వచ్చాయి. కాబట్టి దానికి అనుగుణంగా మీ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోండి. డిసెంబర్ 2024 బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా ఇక్కడ ఉంది:

డిసెంబర్ 2024..

  • డిసెంబర్ 1 - ఆదివారం (పాన్ ఇండియా)
  • డిసెంబర్ 3 - శుక్రవారం - సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ (గోవా) పండుగ
  • డిసెంబర్ 8 - ఆదివారం (పాన్ ఇండియా)
  • డిసెంబర్ 12 - మంగళవారం - పా-టోగన్ నెంగ్మింజా సంగ్మా (మేఘాలయ)
  • డిసెంబర్ 14 - రెండో శనివారం (పాన్ ఇండియా)
  • డిసెంబర్ 15 - ఆదివారం (పాన్ ఇండియా)
  • డిసెంబర్ 18 - బుధవారం - యు సోసో థామ్ వర్ధంతి (మేఘాలయ)
  • డిసెంబర్ 19 - గురువారం - గోవా విమోచన దినం (గోవా)
  • డిసెంబర్ 22 - ఆదివారం (పాన్ ఇండియా)
  • డిసెంబర్ 24 - మంగళవారం - క్రిస్మస్ పండుగ (మిజోరం, నాగాలాండ్ మరియు మేఘాలయ)
  • డిసెంబర్ 25 - బుధవారం - క్రిస్మస్ (పాన్ ఇండియా)
  • డిసెంబర్ 26 - గురువారం - క్రిస్మస్ వేడుకలు (మిజోరం, నాగాలాండ్ మరియు మేఘాలయ)
  • డిసెంబర్ 27 - శుక్రవారం - క్రిస్మస్ వేడుకలు (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)
  • డిసెంబర్ 28 - నాలుగో శనివారం (పాన్ ఇండియా)
  • డిసెంబర్ 29 - ఆదివారం (పాన్ ఇండియా)
  • డిసెంబర్ 30 - సోమవారం - యు కియాంగ్ నంగ్బా (మేఘాలయ)
  • డిసెంబర్ 31 - మంగళవారం - నూతన సంవత్సర వేడుకలు / లోసాంగ్ / నమ్సోంగ్ (మిజోరాం, సిక్కిం)

భారతదేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి, హాలిడే షెడ్యూల్ లేదా జాబితా కోసం మీ స్థానిక బ్యాంక్ శాఖను సంప్రదించడం ఉత్తమమని కస్టమర్లు గమనించాలి.

ఆన్​లైన్ బ్యాంకింగ్ సేవలు

నగదు అత్యవసర పరిస్థితుల కోసం, అన్ని బ్యాంకులు వారాంతం లేదా ఇతర సెలవులతో సంబంధం లేకుండా వారి ఆన్​లైన్ వెబ్సైట్లు, మొబైల్ బ్యాంకింగ్ సేవల ద్వారా అందుబాటులో ఉంటాయి. నగదు ఉపసంహరణ కోసం మీరు ఏ బ్యాంకు ఏటీఎంలను అయినా యాక్సెస్ చేయవచ్చు.

చెక్కులు, ప్రామిసరీ నోట్ల జారీకి సంబంధించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం బ్యాంక్ వార్షిక హాలిడే క్యాలెండర్​ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటిస్తుంది. అందువల్ల ఈ లిస్టెడ్ సెలవు దినాల్లో ఈ సాధనాలకు సంబంధించిన లావాదేవీలు అందుబాటులో ఉండవు.

జాతీయ, స్థానిక సందర్భాలు, కార్యాచరణ అవసరాలు, మతపరమైన వేడుకలు, ఇతర సాంస్కృతిక ఆచారాలను పరిగణనలోకి తీసుకొని ఆర్బీఐ, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులకు సెలవుల జాబితాను రూపొందిస్తాయి. సెంట్రల్ బ్యాంక్ తన అధికారిక వెబ్సైట్, నోటిఫికేషన్ల ద్వారా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ప్రకటన చేస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం